AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti 2024: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సంక్రాంతి రోజున చేయాల్సిన పనులు, దానాలు ఏమిటంటే

సంక్రాంతి రోజున ఏదైనా దానము దాని ఫలితాలు రెట్టింపు అవుతుందని విశ్వాసం. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి రోజుని పెద్దల పండగ అంటూ తమ పూర్వీకులను తల్చుకుని వారి పేరుతో పదిమందికి భోజనం పెట్టి బట్టలు పెట్టె సంప్రదాయం ఉంది. అంతేకాదు మకర సంక్రాంతి రోజున కొన్ని ప్రత్యేక పనులు చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం. మకర సంక్రాంతి రోజున కొన్ని పనులు తప్పక చేయాలని పెద్దలు చెబుతారు. ఈ రోజు మకర సంక్రాంతి నాడు చేయాల్సిన పనులు ఏమిటో తెలుసుకుందాం.

Sankranti 2024: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సంక్రాంతి రోజున చేయాల్సిన పనులు, దానాలు ఏమిటంటే
Makara Sankranti
Surya Kala
|

Updated on: Jan 13, 2024 | 4:05 PM

Share

హిందూ మతంలో మకర సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజుని మకర సంక్రాంతి గా జరుపుకుంటారు. ఈ రోజున చేసే నదీ స్నానం, దానధర్మాలు, పూజలు చాలా ముఖ్యమైనవి. సంక్రాంతి రోజున ఏదైనా దానము దాని ఫలితాలు రెట్టింపు అవుతుందని విశ్వాసం. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి రోజుని పెద్దల పండగ అంటూ తమ పూర్వీకులను తల్చుకుని వారి పేరుతో పదిమందికి భోజనం పెట్టి బట్టలు పెట్టె సంప్రదాయం ఉంది. అంతేకాదు మకర సంక్రాంతి రోజున కొన్ని ప్రత్యేక పనులు చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం. మకర సంక్రాంతి రోజున కొన్ని పనులు తప్పక చేయాలని పెద్దలు చెబుతారు. ఈ రోజు మకర సంక్రాంతి నాడు చేయాల్సిన పనులు ఏమిటో తెలుసుకుందాం.

  1. మకర సంక్రాంతి రోజున పవిత్ర నదిలో స్నానమాచరించడం విశేష ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం. ఈ రోజున గంగామాత భూమిపైకి వచ్చిందని ప్రతీతి. మకర సంక్రాంతి నాడు గంగా నదిలో స్నానం చేయడం చాలా పుణ్యంగా భావిస్తారు.
  2. నువ్వులతో హవనం చేయడం: మకర సంక్రాంతి రోజున ఆవు నెయ్యిలో తెల్ల నువ్వులను కలిపి లక్ష్మీ దేవిని లేదా శ్రీ సూక్త హవనాన్ని చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని.. ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు.
  3. నువ్వుల దానం: మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులు లేదా తెలుపు నువ్వులు, బెల్లం , తేనెను దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
  4. ఆవుకు ఆహారం అందించడం : హిందూ మతంలో ఆవును గోమాతగా భావించి పూజిస్తారు. సకల దేవతలు గోవులో నివసిస్తారు. మకర సంక్రాంతి రోజున ఆవుకు పచ్చి గడ్డిని ఆహారంగా అందిస్తే సంతోషం, సౌభాగ్యం పెరుగుతాయని నమ్మకం.
  5. ఇవి కూడా చదవండి
  6. పాయసం ప్రసాదంగా : మకర సంక్రాంతి రోజున బియ్యం పరమాన్నం తయారు చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ రోజున బియ్యంతో చేసిన పాయసాన్ని పూజలో నైవేద్యంగా పెట్టి.. ప్రసాదంగా తిని పదిమందికి ప్రసాదంగా పంచడం వలన సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
  7. పితృ తర్పణం: మకర సంక్రాంతి రోజున పితృ తర్పణం ఇవ్వడం అత్యంత ఫలవంతం. ఈ రోజున పితృ తర్పణం ఇవ్వడం  వల్ల ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయని, పూర్వీకుల ఆశీస్సులతో వంశాభివృద్ధిని పెంపొందుతుందని  విశ్వసిస్తారు.
  8. చీపురు కొనడం: ధంతేరస్ లాగా, మకర సంక్రాంతి రోజున చీపురు కొనడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని చెబుతారు.
  9. కోరికల నెరవేరడం కోసం మంత్రం: ఓం హ్రీమ్ హ్రీమ్ శ్రీ సూర్య సహస్రకిరణాయ నమః అంటూ మకర సంక్రాంతి రోజున 108 సార్లు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
  10. మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడితో పాటు శని దేవుడిని ఆరాధించడం ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి దారితీస్తుందని.. కష్టాల నుండి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!