Sankranti Week Horoscope: వారికి కొత్త వాహన యోగం.. సంక్రాంతి వారంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది..!

వార ఫలాలు (జనవరి 14 నుంచి జనవరి 20, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందున అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృషభ రాశి వారికి ఈ వారమంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అత్యవసర ప్రయత్నాలు సఫలం అవుతాయి. మిథున రాశి వారికి ముఖ్యంగా లాభస్థానంలో గురువు ఉండడం వల్ల ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Sankranti Week Horoscope: వారికి కొత్త వాహన యోగం.. సంక్రాంతి వారంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది..!
Sankranti Weekly Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 14, 2024 | 5:01 AM

వార ఫలాలు (జనవరి 14 నుంచి జనవరి 20, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందున అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృషభ రాశి వారికి ఈ వారమంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అత్యవసర ప్రయత్నాలు సఫలం అవుతాయి. మిథున రాశి వారికి ముఖ్యంగా లాభస్థానంలో గురువు ఉండడం వల్ల ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ, కొన్ని పనులను సమర్థవంతంగా, సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవ హారాలు అనుకూలంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ, వివాహ ప్రయ త్నాలు సఫలం అవుతాయి. సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. కీలక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం, సమయ‍స్ఫూర్తితో వ్యవహరించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యో గాల్లో అధికారులతో సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపో తాయి.

ఇవి కూడా చదవండి

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వారమంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అత్యవసర ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనుల్ని, వ్యవహారాల్ని సానుకూలంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యక్తిగత ప్రయ త్నాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్తగా వాహనం కొనే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగిపోతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా లాభస్థానంలో గురువు ఉండడం వల్ల ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు కలిసి వచ్చే సమయం ఉంది. సరైన ప్రయ త్నాలు చేయడంతో పాటు, అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి బయటపడతారు. ముఖ్య మైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా సఫలం అయ్యే అవకాశం ఉంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాలు, సేవా కార్యక్రమాల్లో పాలొంటారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాదిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గ్రహ బలం పూర్తిగా అనుకూలంగా లేకపోవడం వల్ల కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ప్రతి పనిలోనూ ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. ఆదాయానికి మించి ఖర్చులు ఉండే అవ కాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎవరితోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక కార్య క్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అదనపు పని భారం తప్పకపోవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి ఆలయ దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు సాధారణ ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు పరవాలేదనిపిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

గ్రహ బలం ఏమంత అనుకూలంగా లేనందువల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త నిర్ణ యాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. బంధువులు కొందరు దుష్ప్రచారం సాగించే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టే సూచనలున్నాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, ఆర్థిక లావాదేవీల జోలికి పోకపోవడం శ్రేయస్కరం. ప్రయాణాలు కలిసి వస్తాయి కానీ, జాగ్రత్తగా ఉండడం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు తిరుగుండదు. సమాజంలో కూడా మాట చెల్లుబాటు అవుతుంది. ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు సహాయం చేస్తారు. నూతన వస్తువుల కొనుగోలుకు అవకాశం ఉంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతో స్నేహ సంబం ధాలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు చక్కబడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. మీ మాటకు తిరుగుండదు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారా లలో పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తల్లితండ్రుల సహాయంతో కొన్ని కుటుంబ వ్యవహారాలను పూర్తి చేయడం జరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వారమంతా మిశ్రమ ఫలితాలు తప్పకపోవచ్చు. ఏ పనీ ఒక పట్టాన పూర్తి కాక ఇబ్బంది పడతారు. ప్రయాణాలు, ఆరోగ్యం విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. కుటుంబంలో ఒకరికి స్వల్పంగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచించి అడుగు వేయాలి. ఆర్థిక ప్రయత్నాలు కలసి వస్తాయి. ప్రారంభించిన పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురవు తాయి. కుటుంబ సభ్యులతో తొందరపాటుతో మాట్లాడడం మంచిది కాదు. ఉద్యోగంలో సహోద్యోగు లతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదా యానికి అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు పరవాలేదనిపిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

గ్రహ బలం అనుకూలత వల్ల ఇంటా బయటా ఆశించిన అనుకూలతలుంటాయి. వృత్తి, వ్యాపా రాలు లాభాల బాట పడతాయి. నష్టాల నుంచి చాలావరకు బయటపడతారు. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక విషయాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ముఖ్య మైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్య వాతావరణం ఏర్ప డుతుంది. చేపట్టిన పనులలో అవరోధాలు, ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలుంటాయి. ఆరోగ్యం పరవా లేదనిపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా గడుస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ముఖ్యమైన శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారమంతా సానుకూలంగా గడిచి పోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో కొందరు మిత్రుల సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు అధి కారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో వివాదాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగులు శుభ వార్త వింటారు. చిన్ననాటి స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వారమంతా మిశ్రమంగా సాగిపోతుంది. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఇతరుల పనుల కంటే సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. తోబుట్టువులతో స్థిరాస్తి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా కొనసాగు తుంది. మీ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నవారు ముఖం చాటేస్తారు. అవసరానికి డబ్బు లభించక ఇబ్బందిపడే సూచనలున్నాయి. వ్యాపారాలు నత్తనడక నడుస్తాయి. కుటుంబ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పక పోవచ్చు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వారమంతా బాగా అనుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తయి ఊరట కలుగుతుంది. అనేక మార్గాలలో ధన లాభం పొందుతారు. తలపెట్టిన పనులు, వ్యవహా రాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొందరు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యత లను స్వీకరించాల్సి వస్తుంది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు అంది వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలకు కొత్త పెట్టుబడులు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆధ్యాత్మి చింతన పెరుగుతుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ