Money Astrology: గురు గ్రహం ప్రభావం.. ఈ రాశుల వారికి డబ్బు చేతిలో మిగిలే అవకాశం ఉండదు..!

ఏ రాశుల వారు ఏ విధంగా సంపాదిస్తారు? ఎంత దాచుకుంటారు? ఖర్చుల్ని అదుపు చేయగలరా? దేని మీద ఖర్చవుతుంది? మొత్తం మీద ఏ కారణంగా డబ్బు మిగలడం లేదనే ప్రశ్నకు గ్రహాల అనుకూలతలు, ప్రతికూలతల ద్వారా సమాధానం పొందాల్సి ఉంటుంది. ధన కారకుడైన గురువు అగ్నితత్వ రాశి అయిన మేష రాశిలో సంచారం చేస్తున్నంత కాలం కొన్ని రాశుల వారికి చేతిలో డబ్బు మిగిలే అవకాశం ఉండదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది.

Money Astrology: గురు గ్రహం ప్రభావం.. ఈ రాశుల వారికి డబ్బు చేతిలో మిగిలే అవకాశం ఉండదు..!
Money Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 12, 2024 | 6:19 PM

ఎంత సంపాదించినా చేతిలో ఒక్క పైసా కూడా మిగలడం లేదని చాలామంది వాపోతుంటారు. ఏ రాశుల వారు ఏ విధంగా సంపాదిస్తారు? ఎంత దాచుకుంటారు? ఖర్చుల్ని అదుపు చేయగలరా? దేని మీద ఖర్చవుతుంది? మొత్తం మీద ఏ కారణంగా డబ్బు మిగలడం లేదనే ప్రశ్నకు గ్రహాల అనుకూలతలు, ప్రతికూలతల ద్వారా సమాధానం పొందాల్సి ఉంటుంది. ధన కారకుడైన గురువు అగ్నితత్వ రాశి అయిన మేష రాశిలో సంచారం చేస్తున్నంత కాలం కొన్ని రాశుల వారికి చేతిలో డబ్బు మిగిలే అవకాశం ఉండదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం గురువు అనుకూలంగా లేని రాశులు వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. ఈ గురువు ప్రభావం ఈ ఏడాది ఏప్రిల్ చివరి వరకూ ఉండబోతోంది. ఈ రాశుల వారికి ఏవిధంగా చేతిలో డబ్బు మిగలదో పరిశీలిద్దాం.

  1. వృషభం: ధన కారకుడైన గురువు ఈ రాశివారికి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల, ఈ రాశివారికి చేతిలో డబ్బు మిగిలి ఉండే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా ఉంటుంది. ఏదో విధంగా ఈ కష్టార్జితం వృధా అయిపోతూ ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను అజమాయిషీ చేయడంలో తప్పటడుగులు వేస్తుంటారు. దైవ కార్యాలకు, దాన ధర్మాలకు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. బాగా సన్నిహితులు తేలికగా మోసం చేస్తుంటారు.
  2. కర్కాటకం: ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి కానీ, ప్రతిఫలం ఉండక పోవచ్చు. డబ్బు తీసుకున్నవారు తిరిగి ఇవ్వరు. తాము ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒత్తిడి పెరుగు తుంది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. పని చేయించుకున్నవారు పారితోషికం ఇవ్వరు. కష్టార్జితం మిగలకపోవడమే కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. డబ్బు ఇవ్వక పోవడం, తీసుకోకపోవడం మంచిది. వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం శ్రేయస్కరం.
  3. కన్య: ఈ రాశివారికి పని భారం పెరుగుతుంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. అయితే, అందుకు తగ్గట్టుగా ప్రతిఫలం మాత్రం దక్కదు. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. శుభ కార్యాల మీద, దైవ కార్యాల మీద ఖర్చుపెడతారు. రాబడి నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చుల మీద అదుపుండదు. ఒక్కోసారి అప్పు కూడా చేయాల్సి వస్తుంది. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాల అజమాయిషీలో వీరు విఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
  4. వృశ్చికం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో గురువు ఉండడం వల్ల అడపా దడపా ఆదాయం పెరుగుతూ ఉంటుంది కానీ, అనేక పర్యాయాలు ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. అనవసర పరిచయాల మీద, విలాసాల మీద ఖర్చులు అధికమవుతాయి. స్నేహితులు తేలికగా తప్పుదారి పట్టిస్తుంటారు. ఈ రాశివారితో పని చేయించుకునేవారు, ఈ రాశివారిని ఉపయోగించుకునేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కంచి గరుడ సేవకు అవకాశం ఉంది.
  5. మకరం: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో గురువు సంచారం వల్ల కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం, బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది కానీ, ప్రతిఫలం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. భేషజాలకు మీద కూడా ఖర్చు పెరుగుతుంది. ఇతరులకు వాగ్దానాలు చేసి, హామీలు ఉండి ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు చాలా దూరంగా ఉంటారు. జమాఖర్చుల బాధ్యతను జీవిత భాగస్వామికి అప్పగించడం మంచిది.
  6. కుంభం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో గురువు సంచారం వల్ల వీరి చేతిలో డబ్బు ఉండే అవకాశం లేదు. మితిమీరిన ఔదార్యం కారణంగా డబ్బు బాగా వృథా అవుతుంటుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాకపోవచ్చు. ప్రతిఫలం లేని కార్యాలు, కార్యక్రమాలు కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. దైవ కార్యాల మీద కూడా బాగా ఖర్చవుతుంటుంది. కష్టార్జితంలో సగానికి సగం ఏదో విధంగా ఖర్చయిపోతుంటుంది. ఆర్థికంగా సహాయం పొందేవారే తప్ప సహాయం చేసే వారు ఉండక పోవచ్చు.