AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushya Masam 2024: పుష్య మాసం ప్రారంభం.. ఏలినాటి శని దోష నివారణకు ఏ విధంగా పూజ చేయాలంటే..

పుష్య మాసం 2024లో ఈ రోజు ( జనవరి 12న) ప్రారంభమై 9 ఫిబ్రవరిన ముగుస్తుంది. శుక్ల పక్షం జనవరి 12న ప్రారంభమై జనవరి 25న ముగుస్తుంది. పుష్య మాసం 2024లో కృష్ణ పక్షం జనవరి 26న ప్రారంభమై ఫిబ్రవరి 9న ముగుస్తుంది. భోగి, సంక్రాంతి , పుష్య నవరాత్రి లేదా శాకంబరి నవరాత్రి, కనుమ, ముక్కనుమ, త్యాగరాజ ఆరాధన, శటిల ఏకాదశి తెలుగు క్యాలెండర్‌లో పుష్య మాసంలో ముఖ్యమైన పండుగలు. శీతాకాలంలో వచ్చే పుష్య మాసం..   ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించివారు దోష రహితులుగా మారతారని విశ్వాసం.

Pushya Masam 2024: పుష్య మాసం ప్రారంభం.. ఏలినాటి శని దోష నివారణకు ఏ విధంగా పూజ చేయాలంటే..
Lord Shanishwara Puja
Surya Kala
|

Updated on: Jan 12, 2024 | 3:03 PM

Share

పుష్య మాసం సంప్రదాయ తెలుగు క్యాలెండర్‌లో పదవ నెల. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసాన్ని పుష్య మాసం అని అంటారు. “పుష్య” అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. దీనిని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలతో పాటు  కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌లలో అనుసరిస్తారు. పుష్య మాసం వివాహాలు, గృహ ప్రవేశం, నిశ్చితార్థాలు మొదలైన కొన్ని రకాల ఆచారాలకు అశుభకరమైన మాసంగా పరిగణించబడుతుంది, అయితే దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. పుష్య మాసం 2024లో ఈ రోజు ( జనవరి 12న) ప్రారంభమై 9 ఫిబ్రవరిన ముగుస్తుంది. శుక్ల పక్షం జనవరి 12న ప్రారంభమై జనవరి 25న ముగుస్తుంది. పుష్య మాసం 2024లో కృష్ణ పక్షం జనవరి 26న ప్రారంభమై ఫిబ్రవరి 9న ముగుస్తుంది.

భోగి, సంక్రాంతి , పుష్య నవరాత్రి లేదా శాకంబరి నవరాత్రి, కనుమ, ముక్కనుమ, త్యాగరాజ ఆరాధన, శటిల ఏకాదశి తెలుగు క్యాలెండర్‌లో పుష్య మాసంలో ముఖ్యమైన పండుగలు. శీతాకాలంలో వచ్చే పుష్య మాసం..   ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించివారు దోష రహితులుగా మారతారని విశ్వాసం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా పండితులు చెబుతున్నారు.

శనీశ్వరుడికి ప్రీతికరమైన పుష్య మాసం..

శివునకు కార్తీక మాసం.. విష్ణువుకు మార్గశిర మాసం ఏ విధంగా ఇష్టమైన మాసాల్లో అదే విధంగా పుష్య మాసం శనీశ్వరుడికి ప్రీతికరం. ఎందుకంటే శనీశ్వరుడి జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెల రోజుల పాటు శనైశ్చరుణ్ని ఎవరు పూజిస్తారో వారి పట్ల శనీశ్వరుడు ప్రసన్న దృష్టిని కలిగి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఏలినాటి శని నివారణకు

  1. ఎవరి జాతకంలో ఏలినాటి శనినడుస్తోందో.. వారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్ధించాలి. పౌర్ణమి రోజున తెల్లవారు జామునే లేచి శనికి తైలాభిషేకం చేయించి.. నవ్వులు దానమివ్వాలి. ఆ రోజు నువ్వులు , బెల్లం ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీని వెనుక శాస్త్రీయ కోణం చుస్తే ఈ రెండూ పదార్ధాలు శరీరంలో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.
  2. శనీశ్వరుడు కర్మ ప్రదాయ.. మనిషి చేసే కర్మలను బట్టి మంచి చెడు ఫలితాలను ఇస్తాడు. ఈ నెలలో నియమ నిష్ఠులు పాటించి శనీశ్వరుడిని పూజిస్తే శని అనుగ్రహం పొందవచ్చు.
  3. గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యతకు శని ప్రభావమే కారణం అని చెబుతారు.
  4. పుష్యమాసం మొదటి పక్షం రోజులు శ్రీ మహా విష్ణువుని పూజిస్తారు. ఎవరైతే పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీ హరిని తులసీదళాలతో పూజిస్తారో వారు మానసిక ప్రశాంతతో జీవిస్తారని నమ్మకం.
  5. పుష్య సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారం రోజున సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ పూజిస్తారు.
  6. పుష్య మాసం శుక్ల పక్షంలో వచ్చే అష్టమిరోజు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం.
  7. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక గల కారణం అని చెప్పవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు