Ayodhya: రాములోరికి 44 క్వింటాళ్ల లడ్డూల భోగం.. దేశీ నెయ్యితో తయారీ.. భక్తులకు పంపిణీ 

రామయ్యకు నేపాల్‌ జనకపూర్‌ అత్తవారింటినుంచి స్పెషల్‌ స్వీట్స్‌, వెండి బాణం సహా దాదాపు 3 వేల రకాల వస్తువులను తమ అల్లుడి గృహ ప్రవేశానికి సారె గా తీసుకుని వచ్చారు. హైదరాబాద్ నుంచి పాదుకలు  కానుకలుగా ఊరేగింపుగా తరలి వస్తున్నాయి. మరోవైపు తిరుమల శ్రీనివాసుడు కూడా లక్ష లడ్డూలు పంపిస్తున్నాడు.. ఇప్పుడు మరో భక్తుడు రాములోరికి స్వచ్ఛమైన నేతి లడ్డూలను ప్రసాదంగా అందించనున్నారు.

Ayodhya: రాములోరికి 44 క్వింటాళ్ల లడ్డూల భోగం.. దేశీ నెయ్యితో తయారీ.. భక్తులకు పంపిణీ 
Ayodhya Ram Mandir
Follow us

|

Updated on: Jan 12, 2024 | 2:04 PM

పది రోజుల్లో రామయ్య తన జన్మ స్థలంలో కొలువడేరానున్నాడు. ఏనోట విన్నా రామనామమే.. ఏ చోట చూసినా అయోధ్యపై చర్చే.. అయోధ్యరాముడు ఆలయంలో ఇంకా ప్రతిష్ట కాలేదు కానీ.. ఆ దివ్య మంగళ స్వరూపం మాత్రం దేశవ్యాప్తంగా అందరి మదిలో నిండిపోయింది. ఎక్కడ చూసినా రాముని గురించి చర్చే… ఓ వైపు సంక్రాంతి సంబరాలు.. మరోవైపు అయోధ్యరాముని ప్రతిష్టాపన… ఆలయ ప్రారంభం..దీంతో ప్రజలు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రామయ్యకు దేశం నలుమూలలనుంచి పెద్ద ఎత్తున కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రామయ్యకు నేపాల్‌ జనకపూర్‌ అత్తవారింటినుంచి స్పెషల్‌ స్వీట్స్‌, వెండి బాణం సహా దాదాపు 3 వేల రకాల వస్తువులను తమ అల్లుడి గృహ ప్రవేశానికి సారె గా తీసుకుని వచ్చారు. హైదరాబాద్ నుంచి పాదుకలు  కానుకలుగా ఊరేగింపుగా తరలి వస్తున్నాయి. మరోవైపు తిరుమల శ్రీనివాసుడు కూడా లక్ష లడ్డూలు పంపిస్తున్నాడు.. ఇప్పుడు మరో భక్తుడు రాములోరికి స్వచ్ఛమైన నేతి లడ్డూలను ప్రసాదంగా అందించనున్నారు

అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడికి తరలివచ్చే భక్తులకు దేవ్రహా బాబా లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ ప్రసాదాన్ని స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారు చేస్తున్నారు. దేవ్రహా బాబా రామ మందిర నిర్మాణాన్ని ముందే ఊహించిన సాధువు. శ్రీరాముడు జన్మించిన ప్రదేశం ఇదేనని ఆయనే తెలియజేశారు. శ్రీరామునికి భోగంగా సమర్పించేందుకు 44 క్వింటాళ్ల లడ్డూలను దేశీ నెయ్యితో తయారు చేస్తున్నామని, ఒక్క చుక్క నీరు కూడా వాడలేదని దేవ్రహ బాబా శిష్యులు తెలిపారు. ఈ లడ్డూలు ఆరు నెలల వరకూ చెడిపోవని పేర్కొన్నారు. ఈ లడ్డూలను వెండి పళ్లెంలో రామ్‌లల్లాకు నైవేద్యంగా సమర్పిస్తామన్నారు. అనంతరం వీటిని భక్తులకు ప్రసాదంలా పంపిణీ చేయనున్నామన్నారు. భూమి పూజ సమయంలో కూడా దేవరామ్ బాబా ట్రస్టుకు వేల క్వింటాళ్ల లడ్డూలు అందించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ