AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: ఆఖరు ఘట్టానికి అయోధ్య ముస్తాబు.. ప్రాణప్రతిష్ఠ ఉత్సవాల్లో ఏ రోజున ఏ కార్యక్రమం జరగనుందంటే..?

ఇక, అయోధ్య ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య నగరమంతా డ్రోన్లతో నిఘా పెట్టారు..నగరంలో ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా మొత్తం రీహార్సల్‌ కూడా చేశారు..ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయం వద్ద నిఘా చర్యలు చేపట్టారు.

Ayodhya Ram Mandir: ఆఖరు ఘట్టానికి అయోధ్య ముస్తాబు.. ప్రాణప్రతిష్ఠ ఉత్సవాల్లో ఏ రోజున ఏ కార్యక్రమం జరగనుందంటే..?
Ram Mandir Inauguration
Jyothi Gadda
|

Updated on: Jan 12, 2024 | 10:28 AM

Share

ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య ముస్తాబవుతోంది. మరో 11 రోజుల్లో భారత్‌లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది..కన్నుల పండుగగా జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టం వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. రాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజు ‘రామ్ లల్లా’కి ’56 రకాల ప్రసాదాలు అందించనున్నారు.. లక్నోలోని ఫేమస్‌ దుకాణమైన ‘మధురిమ’ నుంచి ఈ ’56 రకాల ప్రసాదాలను రాముడికి సమర్పించనుంది.. ఈ ప్రసాదాల్లో రసగుల్లా, లడ్డూ, బర్ఫీ మొదలైన వివిధ రకాల స్వీట్లు ఉన్నాయి. గుజరాత్‌లోని కళాకారులు రామభక్తుల కోసం లడ్డూల ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నారు. వీటిని ప్రధాని మోదీ, మోహన్ భగవత్, సీఎం యోగి ఆదిత్యనాథ్, పూజారి సతేంద్ర దాస్ రామ్ లాలాకు లడ్డూలు అందించనున్నారు.

అయోధ్యలో జనవరి 14 నుంచి 25 వరకు సరయూ నది ఒడ్డున ‘శ్రీరామ్‌నామ్‌ మహాయజ్ఞం’ నిర్వహించనున్నారు..1008 నర్మదేశ్వర్ శివలింగాలను ప్రతిష్ఠించి రామాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోని సరయూ నది ఘాట్‌లో ‘శ్రీరామ్‌నామ్‌ మహాయజ్ఞం కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అయోధ్యలోని ప్రసిద్ధ అమవరామ ఆలయంలో బంగారు కలశ పూజలు నిర్వహించారు..అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్బంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజు బంగారు విల్లు, కలశం, రూ. 10 కోట్లను ఇవ్వనుంది అమవరామ మందిర్ ట్రస్ట్..

అయోధ్యలోని సాకేత్ మహావిద్యాలయంలో 14 లక్షల రంగుల దీపాలతో శ్రీరాముడి చిత్రపటాన్ని తయారు చేస్తున్నారు..దీనిని బీహార్‌కు చెందిన ఒక కళాకారుడు తన బృందంతో కలిసి తయారు చేస్తున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో చర్చలు జరుగుతున్నాయని కళాకారుడు చెప్పారు. మరోవైపు, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సం, ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా అయోధ్యలో వ్యాపారాలు జోరుగా జరుగుతున్నాయి..రాముడి పేరు, రూపంతో ఎది ఉన్నా భక్తులు వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక దేశంలోని నలుమూలల నుంచి వచ్చే కళాకారులు కూడా తమ ప్రతిభకు సహకరించాలన్నారు. అదేవిధంగా, గ్వాలియర్‌కు చెందిన వాగ్దాన శిల్పి దీపక్. తన కళతో శ్రీరాముని విగ్రహాం పెట్టి రాతి పడవను సిద్ధం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక, అయోధ్య ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య నగరమంతా డ్రోన్లతో నిఘా పెట్టారు..నగరంలో ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా మొత్తం రీహార్సల్‌ కూడా చేశారు..ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయం వద్ద నిఘా చర్యలు చేపట్టారు.