Consume Papaya in Winter: చలికాలంలో బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ బెనిఫిట్స్ అన్నీ మీవే!

పొడి చ‌ర్మాన్ని మృదువుగా, య‌వ్వ‌నంగా మారుస్తుంది. అదేవిధంగా, నీర‌సం, అల‌స‌ట స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డే వారు ప్ర‌తి రోజు బొప్పాయి తీసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను దూరం చేయ‌డంలో బొప్పాయి పండు స‌హాయ‌ప‌డుతుంది. ఇక చాలా మంది నోటి పూత స‌మ‌స్య‌తో త‌ర‌చూ ఇబ్బంది ప‌డ‌తారు. అయితే బొప్పాయి తీసుకుంటే, అందులో ఉండే..

Consume Papaya in Winter: చలికాలంలో బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ బెనిఫిట్స్ అన్నీ మీవే!
Papaya In Winter
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 12, 2024 | 7:02 AM

ప్ర‌స్తుతం చ‌లి కాలం కొన‌సాగుతోంది.ఈ సీజ‌న్‌లో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా తెగ ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే వింట‌ర్‌లో ఆరోగ్యంపై, చ‌ర్మంపై మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సీజ‌న్‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా హెల్తీగా ఉండాలంటే ఖ‌చ్చితంగా కొన్ని పండ్ల‌ను తీసుకోవాలి. వాటిలో బొప్పాయి ఒక‌టి. అవును, చ‌లి కాలంలో ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో బొప్పాయి పండు తీసుకుంటే. బోలెడ‌న్ని బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ వింటర్‌ సీజనల్‌లో శరీర రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే, రెగ్యులర్‌గా బొప్పాయి తీసుకుంటే, అందులో ఉండే విటమిన్‌ సి మరియు యాంటి ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి.

అది శీతాకాలమైనా లేదంటే.. వేసవి కావచ్చు. బొప్పాయి ప్రతి సీజన్‌లో అందుబాటులో ఉంటుంది. కానీ, బొప్పాయి ఎండాకాలం కంటే చలికాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. బొప్పాయి శీతాకాలంలో చాలా చౌకగా లభిస్తుంది. మీరు దానిని సమృద్ధిగా తినవచ్చు. ఎందుకంటే బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది విటమిన్ ఎ, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే సూపర్ ఫుడ్. బొప్పాయి వార్మింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, మీరు శీతాకాలంలో కూడా తినవచ్చు. దీన్ని తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. బొప్పాయి కాలేయం, మూత్రపిండాలు, ప్రేగులకు మంచిది. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. చలికాలంలో బొప్పాయిని హాయిగా తినవచ్చు.

అజీర్ణం, హార్ట్ బర్న్, యాసిడ్ రిఫ్లక్స్, స్టొమక్ అల్సర్ వంటి అనేక వ్యాధుల చికిత్సలో బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. బొప్పాయిలో పపైన్ అనే ప్రత్యేక ప్రోటీన్ ఉంటుంది. ఇది సూపర్ ఎంజైమ్ లాగా పనిచేస్తుంది. బొప్పాయి ఎసిడిటీ, మలబద్ధకం, పేగు సమస్యలను కూడా తక్షణమే నయం చేస్తుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఊపిరితిత్తుల వాపును నివారిస్తుంది. అలాగే, ధూమపానానికి అలవాటు పడిన వారు కూడా బొప్పాయిని సమృద్ధిగా తినాలి. ఇది ఊపిరితిత్తుల వాపును నయం చేస్తుంది. ఈ వ్యాధి రాకుండా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

బొప్పాయి ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్ చికిత్సలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌ను చైమోపాపైన్ అంటారు. ఇది ఎముకలు దృఢంగా పని చేసేలా చేస్తుంది. బొప్పాయి తీసుకోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తులు, ముక్కు రంధ్రాల్లో శ్వాససంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే బొప్పాయిలో కేల‌రీలు త‌క్కువ‌గా, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల, బ‌రువు త‌గ్గాల‌ని భావించే వారు ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో బొప్పాయిని తీసుకుంటే, మంచి ఫ‌లితం ఉంటుంది. ఇక ఈ చ‌లి కాలంలో చ‌ర్మం త‌ర‌చూ పొడిబారిపోయి, డ్రైగా మారుతుంది. అయితే బొప్పాయి తీసుకోవ‌డం వ‌ల్ల అందులో ఉండే విట‌మిన్ ఇ, ఇత‌ర పోష‌కాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

పొడి చ‌ర్మాన్ని మృదువుగా, య‌వ్వ‌నంగా మారుస్తుంది. అదేవిధంగా, నీర‌సం, అల‌స‌ట స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డే వారు ప్ర‌తి రోజు బొప్పాయి తీసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను దూరం చేయ‌డంలో బొప్పాయి పండు స‌హాయ‌ప‌డుతుంది. ఇక చాలా మంది నోటి పూత స‌మ‌స్య‌తో త‌ర‌చూ ఇబ్బంది ప‌డ‌తారు. అయితే బొప్పాయి తీసుకుంటే, అందులో ఉండే విట‌మిన్ బి నోటి పూత స‌మ‌స్య‌ను గ్రేట్‌గా నివారిస్తుంది. ఇక డెంగ్యూ రోగులకు బొప్పాయి దివ్యౌషధం అని అందరికీ తెలిసిందే.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అప్పట్లో గ్లామర్ పాత్రలతో అల్లాడించేసింది.. గుర్తుపట్టలేనంతగా..
అప్పట్లో గ్లామర్ పాత్రలతో అల్లాడించేసింది.. గుర్తుపట్టలేనంతగా..
ఈడు ఎవడ్రా బాబు.. మోసం చేయడంలో పీహెచ్‌డీ చేసినట్లు ఉన్నాడు..
ఈడు ఎవడ్రా బాబు.. మోసం చేయడంలో పీహెచ్‌డీ చేసినట్లు ఉన్నాడు..
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాపై ఆంక్షలు.. మినిమమ్ ఏజ్ విధింపు
ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాపై ఆంక్షలు.. మినిమమ్ ఏజ్ విధింపు
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
మెట్లపై పడిపోయిన విజయ్ దేవరకొండ..
మెట్లపై పడిపోయిన విజయ్ దేవరకొండ..
3 ఏళ్లుగా ఎదురుచూపులు.. ఐపీఎల్ 2025కి ముందు నెరవేరిన డ్రీమ్
3 ఏళ్లుగా ఎదురుచూపులు.. ఐపీఎల్ 2025కి ముందు నెరవేరిన డ్రీమ్
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
పరీక్షలో ఫెయిల్ అయినట్లు కల వచ్చిందా.? దాని అర్థం ఏంటంటే..
పరీక్షలో ఫెయిల్ అయినట్లు కల వచ్చిందా.? దాని అర్థం ఏంటంటే..
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!