AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడా ఇదేవరి మాయ..? వేములవాడలో రాజన్న కోడెలు మాయం..! పుట్టుకొస్తున్న నకిలీ గోశాలలు

వేములవాడ రాజన్న గోశాల నుండి గడిచిన ఎడాది 1866 కొడేలు,28/ఆవులని తెలంగాణ గోశాల ఫెడరేషన్ సూచించిన వారికి‌ ఆలయ అధికారులు అప్పగించారు...ఇవన్ని నిజంగా గోశాలలకి వెళ్తున్నాయా,లేదంటే గోశాలల ముసుగులో అక్రమార్కుల చేతులకి వెళ్తున్నాయా తెలియడం లేదు..గతంలో ‌కూడా గుట్టు చప్పుడు కాకుండా కబేళాలకి తరలించారు..దీంతో

దేవుడా ఇదేవరి మాయ..? వేములవాడలో రాజన్న కోడెలు మాయం..! పుట్టుకొస్తున్న నకిలీ గోశాలలు
Vemulawada Goshalas
G Sampath Kumar
| Edited By: Jyothi Gadda|

Updated on: Jan 10, 2024 | 1:03 PM

Share

కరీంనగర్, జనవరి 10; ఎంతో భక్తిభావంతో రాజన్నకి సమర్పించే కో డేలు మాయం అవుతున్నాయి….కొడే మొక్కులతోనే రాజన్న ఆలయానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది… నిబంధనలు పాటించకుండా ఇష్ట రాజ్యం గా గోవులని రవాణా చేస్తున్నారు.. గోశాలలు లేకున్నా నకిలి‌పత్రాలు సృష్టించి గోవులని తీసుకు వెళ్తున్నారు..తాజాగా రెండు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి… వేములవాడ గోశాల నుంచి మాయం అవుతున్న గోవుల పరిస్థితిపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుంతుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థానం లో కొడే మొక్కు తరతరాలుగా వస్తుంది.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాజన్న దర్శనానికి ముందే కోడేని స్వామివారికి మొక్కుగా చెల్లిస్తారు…లేదంటే ఆలయం లో ఉన్న కొడెని పట్టుకొని దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు…అందుకోసం ఆలయ అధికారులు కోడె టికెట్లు ఇస్తారు…ఈ కొడె టికెట్ తో కూడా దేవలయానికి భారీ ఆదాయం వస్తుంది.. కొంత అనారోగ్యానికి గురైన కొడేలు, బలహీనంగా ఉన్న కొడెలు, దూడలు గోశాలలో సంరక్షిస్తారు..గతంలో టెండర్ విధానంతో గోవులని ఇచ్చేవారు…అనేక అక్రమాలు జరగడంతో ఈ విధానాన్ని రద్దు చేసారు..తాజాగా తెలంగాణ గోశాల పెడరేషన్ పేరుతో ఓ సంస్థ ఉంది…ఈ సంస్థ చెబితే చాలు కోడెలని ఇచ్చేస్తున్నారు…ఈ సంస్థ పేరుతో లెటర్ తెచ్చుకుంటే లక్షల విలువ చేసే కొడెలని, ఆలయ అధికారులు ఉచితంగా ఇస్తున్నారు…ఇదే అదనుగా భావించి పలువురు‌ అక్రమార్కులు గోశాల ముసుగులో కోడేలని ఇతర ప్రాంతాలకి తీసుకువెళ్ళి అమ్ముకుంటున్నారు..

తాజాగా ఈనెల 2న తిప్పాపూర్ లోని రాజన్న గోశాల నుండి ఇరవై కొడెలని మహబూబాబాద్ జిల్లా శ్రీ సోమేశ్వర గో సంరక్షణా సేవా సంఘానికి ఆలయ అధికారులు అప్పగించారు…అయితే ఇక్కడ గోశాలనే లేదు…పలువురి ఫిర్యాదు మేరకి ఈ వాహానాన్ని పట్టుకొని విచారించగా నిర్వహకులు చెప్పిన చోట గోశాల లేదని తెలియడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…ఇటివల రాజన్న గోశాల నుండి ఇరవై నాలుగు కొడేలని ఒక్క వ్యానులో కుక్కి కుక్కి తీసుకు వెళ్తున్న క్రమంలో జనగామ జిల్లా స్టేషను ఘన్ పూర్ వద్ద భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు.. వాహానదారులు రాజన్న అలయ అధికారులు ఇచ్చిన రశీదు చూపించగా రసీదులో ఇరవై కోడేలు అని ఉంటే వాహనం లో‌మాత్రం 24 కొడెలు ఉండడం తో పలు అనుమానాలకి తావిస్తుంది…కేవలం ఈ రెండు సంఘటన లు‌మాత్రమే వెలుగులోకి వచ్చాయి..ఇలాంటి సంఘటనలు తరుచుగా జరుగుతున్న అధికారులు‌ పట్టించుకోవడం లేదని‌ హిందూ సంస్థలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి…

వేములవాడ రాజన్న గోశాల నుండి గడిచిన ఎడాది 1866 కొడేలు,28/ఆవులని తెలంగాణ గోశాల ఫెడరేషన్ సూచించిన వారికి‌ ఆలయ అధికారులు అప్పగించారు…ఇవన్ని నిజంగా గోశాలలకి వెళ్తున్నాయా,లేదంటే గోశాలల ముసుగులో అక్రమార్కుల చేతులకి వెళ్తున్నాయా తెలియడం లేదు..గతంలో ‌కూడా గుట్టు చప్పుడు కాకుండా కబేళాలకి తరలించారు..దీంతో స్థానిక భక్తులతో‌ పాటు హిందూ‌ సంస్థలు‌ ఆందోళన లు‌ నిర్వహించాయి..గోవుల సంరక్షణ విషయం లో‌ అధికారుల తీరుపైన పలు‌ అనుమానాలు వస్తున్నాయి…భక్తుల ఇచ్చిన కొడేలని ఉచితంగా నిజమైనా రైతులకి‌ అందించాలి..నిబంధనలు తుంగలో తుక్కి ఓ సంస్థ కి‌ పావుగా మారిపోయారు‌ అధికారులు…అధుకారులు ఇప్పటికైనా స్పందించి ‌పారదర్శకంగా రైతులకి గోవులని సరఫరా చేయాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.. లేదంటే అందోళనలు మరింత ‌ఉదృతం చేస్తామని హెచ్చరిస్తుంది విహెచ్ పి

అధికారుల తీరుతోనే రాజన్న గోశాలలో అక్రమాలు‌ జరుగుతున్నాయని బిజేపి, విహెచ్ పి నేతలు అరోపిస్తున్నారు…ఎంతో భక్తిబావంతో దేవుడి పేరు మీద ఇచ్చిన కొడేలు కబేళాలకి తరలించడం తగదని హెచ్చరిస్తున్నారు.. వెంటనే అధికారుల తీరును మార్చుకోవాలని కోరుతున్నారు.. గోవుల రవాణా విషయం లో‌ ఎలాంటి అక్రమాలు జరగడం లేదని అలయ అధికారులు చెబుతున్నారు…పారదర్శకంగానే గోవులని గోశాలకి ఇస్తున్నామని‌ స్పష్టం చేస్తున్నారు..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..