AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Charminar Express: నాంపల్లి రైల్వే ప్రమాద బాధితులకు ఎక్స్‌ గ్రేషియా.. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశం

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రమాదానికి గురైంది. డెడ్‌ఎండ్ గోడను ఢీకొనడంతో మూడు బోగిలు S2, S3, S6 పక్కకు ఒరిగాయి. రైలు చెన్నై నుంచి నాంపల్లి చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ట్రైన్‌ చాలా తక్కువ స్పీడ్‌తో ఉన్న కారణంగా పెద్ద ప్రమాదమే తప్పింది

Charminar Express: నాంపల్లి రైల్వే ప్రమాద బాధితులకు ఎక్స్‌ గ్రేషియా.. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశం
Charminar Express
Basha Shek
|

Updated on: Jan 10, 2024 | 12:29 PM

Share

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రమాదానికి గురైంది. డెడ్‌ఎండ్ గోడను ఢీకొనడంతో మూడు బోగిలు S2, S3, S6 పక్కకు ఒరిగాయి. రైలు చెన్నై నుంచి నాంపల్లి చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ట్రైన్‌ చాలా తక్కువ స్పీడ్‌తో ఉన్న కారణంగా పెద్ద ప్రమాదమే తప్పింది. దిగడానికి సిద్ధంగా ఉన్న వారు గాయపడ్డారు. క్షతగాత్రులను లాలాగూడ ఆస్పత్రికి తరలించారు. వారు పూర్తిగా కోలుకునేంత వరకు హాస్పిటల్‌లోనే చికిత్స అందిస్తామని దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేశ్ తెలిపారు. మరోవైపు నాంపల్లి రైల్వే స్టేషన్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద అనంతరం అక్కడ మరమ్మతులు కొనసాగుతున్నాయి. రైల్వే సిబ్బంది రెస్స్యూ ఆపరేషన్ చేపట్టారు.అలాగే ఈ ప్రమాదంపై ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు. తీవ్రగాయాలైన వారికి రూ.2.50 లక్షలు, గాయాలైన వారికి రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్నారు. మధ్యాహ్నం 2 గంటలలోపు పునరుద్ధరణ పూర్తవుతుందని, ఆ తర్వాత రైళ్లు యథావిధిగా నడుస్తాయని దక్షిణి మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అయితే చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ది ప్రమాదమా? నిర్లక్ష్యమా? ట్రైన్‌ డెడ్‌ ఎండ్‌ వాల్‌ను ఢీకొట్టడంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు లోకో పైలట్‌ తప్పిదమే దీనికి కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు.

నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం.. వీడియో

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి