AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omkaram Temple: మహిమాన్విత శైవ క్షేత్రం ఓంకారం.. భక్తుడి భారీ విరాళంతో మరింత దేదీప్యమానంగా..

ఓంకారేశ్వరుడు కోరిక కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి. అందుకే ఇక్కడి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కోరికలు తీరిన వారు.. కోరికలు కోరుకుని ముడుపులు కట్టుకునే భక్తులతో ఆలయం ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఆలయానికి తూర్పు, దక్షిణ ద్వారాలు కలిగి ఉన్నాయి. అదేవిధంగా ఈశాన్యంలో పుష్కరిణి కలిగి ఉండడటం,సిద్దులు తపస్సు చేసిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.

Omkaram Temple: మహిమాన్విత శైవ క్షేత్రం ఓంకారం.. భక్తుడి భారీ విరాళంతో మరింత దేదీప్యమానంగా..
Omkareshwar
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jan 10, 2024 | 2:26 PM

Share

కర్నూలు, జనవరి 10; ఓంకారం. సుప్రసిద్ధ,మహిమాన్విత శైవ క్షేత్రం.. ఇప్పుడు మరింత దేదీప్యమానంగా వెలుగొందుతోంది. కొత్తగా భక్తులు ఇచ్చిన వెండి ఆభరణాలతో మెరిసిపోతోంది. నంద్యాల జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో నెలకొన్న సుప్రసిద్ధ శైవ క్షేత్రం ఓంకారం. ఓంకారేశ్వరుడు కోరిక కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి. అందుకే ఇక్కడి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కోరికలు తీరిన వారు.. కోరికలు కోరుకుని ముడుపులు కట్టుకునే భక్తులతో ఆలయం ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలోనే జిల్లాలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన తాతిరెడ్డి తులసి రెడ్డి అనే భక్తుడి కుటుంబం స్వామివారికి భారీ విరాళం అందజేసింది.

నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన తాతిరెడ్డి తులసి రెడ్డి కుటుంబ సభ్యులు రూ.5.3 లక్షల విలువగల మూడు కేజీల ఆరు వందల గ్రాముల వెండి శివలింగం ,వెండి పాణి పట్టం తొడుగును ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అధికారులకు విరాళంగా అందజేశారు. కొత్తపల్లె గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ నాయకుడు తాతిరెడ్డి తులసి రెడ్డి, సోదరుడు తాతిరెడ్డి నాగేశ్వర్రెడ్డి కుటుంబ సభ్యులు. సోదరులు, బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, పెద్ద ఎత్తున గ్రామం నుండి  భక్తిశ్రద్ధలతో ఉరేగింపుగా వచ్చి మొక్కుబడి చెల్లించుకున్నారు.ఈ వెండి ఆభరణాల విలువ సుమారు రూ.3.5 లక్షలు ఉంటుందను దాతలు తెలియజేసారు. ఈ పూజ కార్యక్రమంలో తాతిరెడ్డి తులసి రెడ్డి ఆయన సతీమణి తాతిరెడ్డి లక్ష్మి, ఆయన కుమారుడు మనీష్ రెడ్డి, ఆయన కుమార్తె, ఆయన సోదరుడు తాతిరెడ్డి నాగేశ్వర్ రెడ్డి , ఆయన సతీమణి కుమారులు కుమార్తెలు అల్లుళ్లు, కోడలు ఆయన సోదరులు, బంధుమిత్రులు స్నేహితులు ఆత్మీయులు టి.టి. ఆర్ అసోసియేట్ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. ఆలయానికి తూర్పు, దక్షిణ ద్వారాలు కలిగి ఉన్నాయి. అదేవిధంగా ఈశాన్యంలో పుష్కరిణి కలిగి ఉండడటం,సిద్దులు తపస్సు చేసిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.నంద్యాల నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి బస్టాండు నుంచి బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు