AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

58ఏళ్ల పురాతన ఇంట్లో దొరికిన సిల్వర్‌ సూట్‌కేస్‌.. ధగ ధగా మెరుస్తుందని.. ఓపెన్‌ చేయగా.. !

దంపతులు 1966లో నిర్మించిన ఆస్తిని కొనుగోలు చేశారు. కానీ వారు తమ కొత్త ఇంటిని ఆధునీకరించడం ప్రారంభించారు.. ఈ క్రమంలో వారు తమ కళ్లను తామే నమ్మలేనిది గుర్తించారు.. ఆ తర్వాత తాము కొన్న ఇళ్లు ఒక  దుకాణమని భావించి, అందులో కొంత భాగాన్ని మూసివేశారు. అయితే, ఆ ఇంటి రిపేర్ లో ఆ మహిళ తన ఫ్లాష్‌లైట్‌ వెలుతురులో ఓ వెండి సూట్‌కేస్‌ ను గమనించింది.. అది చూసిన ఆమె ఒక్కసారిగా చలించిపోయింది.

58ఏళ్ల పురాతన ఇంట్లో దొరికిన సిల్వర్‌ సూట్‌కేస్‌.. ధగ ధగా మెరుస్తుందని..  ఓపెన్‌ చేయగా.. !
Suitcase Hidden In Wall
Jyothi Gadda
|

Updated on: Jan 10, 2024 | 12:21 PM

Share

ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఏ దేశంలోనైన ప్రజలు నివసించేందుకు ఓ ఇళ్లు నిర్మించుకుంటారు.. లేదంటే.. ఉన్న పాత ఇంటికి మరమ్మతులు చేస్తుంటారు..అయిత, కొన్ని కొన్ని సందర్భాల్లో పాత ఇంటికి మరమ్మతులు చేస్తుండగా, నిధి నిక్షేపాలు వంటివి లభించిన సంఘటనలు గతంలో అనేకం చూశాం. విన్నాం.. అలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అలాంటి సంఘటనల్లో ఆ ఇంటి యజమానుల జీవితం ఒక్కసారిగా మారిపోయిందని కూడా చూస్తుంటాం..కొన్ని ప్రాంతాల్లో లభించిన నిధులు ఆయా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటాయి. అలాగే, కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ఇంటి వారికే దక్కుతుంటాయి. ఇంకా చెప్పాలంటే.. కొన్ని పాత, పురాతన ఇళ్లలో కొన్ని రహస్యాలు, కొన్ని భయానక వాస్తవాలు బయటపడుతుంటాయి. UKలో దంపతులకు అలాంటిదే జరిగింది. ఇక్కడ ఓ దంపతులు తమ ఇంటిని పునరుద్ధరిస్తుండగా, గోడలోపల పాత సూట్‌కేస్‌ ఒకటి కనిపించింది. సూట్‌కేస్‌ను తెరిచి చూడగా ఆ దంపతుల కళ్లు చెమ్మగిల్లాయి. ఎంతో ఇష్టంతో, ఆశపడి ఇంటిని కొనుగోలు చేసి రిపేర్ చేయడంతో వారి ఆనందం ఆవిరైపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

@stonestack_rennovation పేరుతో తమ ఇంటి మరమ్మతులకు సంబంధించిన కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది UKకు చెందిన ఓ జంట.. ఇలాంటి ఎన్నో విషయాలు బయటపెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వారు చెప్పిన దాని ప్రకారం.. దంపతులు 1966లో నిర్మించిన ఆస్తిని కొనుగోలు చేశారు. కానీ వారు తమ కొత్త ఇంటిని ఆధునీకరించడం ప్రారంభించారు.. ఈ క్రమంలో వారు తమ కళ్లను తామే నమ్మలేనిది గుర్తించారు.. ఆ తర్వాత తాము కొన్న ఇళ్లు ఒక  దుకాణమని భావించి, అందులో కొంత భాగాన్ని మూసివేశారు. అయితే, ఆ ఇంటి రిపేర్ లో ఆ మహిళ తన ఫ్లాష్‌లైట్‌ వెలుతురులో ఓ వెండి సూట్‌కేస్‌ ను గమనించింది.. అది చూసిన ఆమె ఒక్కసారిగా చలించిపోయింది.

1.2 మిలియన్లకు పైగా వీక్షించబడిన వైరల్ క్లిప్‌లో భయంకరమైన వాసన వెదజల్లింది..అదేంటో వారికి అర్థం కాలేదట.. తీవ్ర వాసన కారణంగా ఆమె మొదట మృతదేహం అనుకుని భయపడిపోయారు..కానీ, ఆ తర్వాత కాదని తేలింది. ఆ సమయంలో వారి కుక్క అక్కడికి వచ్చి కాస్త వింతగా ప్రవర్తించినట్లు ఆ మహిళ తెలిపింది. బహుశా అక్కడ లభించిన వస్తువులను చూసి అది కూడా భయపడింది. అయితే, ఆ తర్వాత అర్థమైంది ఏమిటంటే.. భయపడాల్సిన అవసరం లేదని.. ఎందుకంటే సూట్‌కేస్ లో కొన్ని ఎప్పటివో పాడైపోయిన స్వీట్లు, చాక్టెల్స్‌, పెన్సిల్ వంటివి తప్ప మరేమీ లేవని తెలిసింది. కానీ ఇది కలవరపెట్టే దృశ్యమని అన్నారు. పెట్టే నుంచి వచ్చిన దుర్వాసనకు తమ పెంపుడు కుక్క కూడా చాలా భయపడిందన్నారు. కానీ, ఎలాంటి ప్రమాదకరమైన వస్తువులు కాకపోవటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు..

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు ఈ మొత్తం సంఘటనను బ్లాక్ మ్యాజిక్‌తో జత చేసిన షేర్‌ చేస్తున్నారు. ఈ ఇంటిని దుష్టశక్తులు వెంటాడుతున్నాయని, దాని ప్రభావాలను చూపించడం ప్రారంభించాయని నమ్మే వినియోగదారులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ ఇంటిని విక్రయించాలని దంపతులకు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..