Wedding Viral Video: పెంపుడు కుక్క బీభత్సం.. పెళ్లి మండపంలోనే వధువు వెంటపడి మరీ..

పెళ్లి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఈ వీడియోలు ఆసక్తికరంగా ఉంటాయి. కొన్నిసార్లు షాకింగ్ క్షణాల వీడియోలు వైరల్ అవుతాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది తమ వివాహాన్ని ప్రత్యేకంగా, మరపురానిదిగా చేయాలని కోరుకుంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటివరకు వేల సంఖ్యలో లైక్‌లు, వీక్షణలు వచ్చాయి.

Wedding Viral Video: పెంపుడు కుక్క బీభత్సం.. పెళ్లి మండపంలోనే వధువు వెంటపడి మరీ..
Dog Attack On Bride
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 10, 2024 | 11:34 AM

సోషల్ మీడియాలో చాలా రకాల వెడ్డింగ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటాయి.. కొన్ని వెరైటీగా ఉంటాయి. అలాంటి వీడియోలు చూసిన నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. కొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేవిగా ఉంటాయి.. వినియోగదారులు అలాంటి వీడియోలను ఇష్టపడతారు. పెళ్లి వేడుకలు ఎప్పుడూ సరదాగానే ఉంటాయి. ఇక పెళ్లిలో బంధువులు, స్నేహితుల సందడి, హడావుడి అంత ఇంతా కాదు.. జీవితంలో ప్రత్యేక ప్రముఖ్యత కలిగిన పెళ్లిలో చాలా మంది వధూవరులు సరదాగా ఉంటారు. అతిథులంతా వివాహ వేడుకను ఆనందిస్తారు. ఇప్పుడు కూడా ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి అందరూ షాక్ అయ్యారు. పెళ్లి మండపంలో వధువును ఓ కుక్క వెంబడించడం వీడియోలో చూడొచ్చు.

వైరల్‌ వీడియోలో పెళ్లి మండపంలోకి ప్రవేశించింది ఓ పెంపుడు కుక్క.. ఆ సమయంలో వధూవరులతో పాటు బంధువులు, అతిథులంతా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు.. ఈ క్రమంలోనే ఆ కుక్క పిల్లల వధువు వెంటపడుతుంది. ఆమె ఎటు వెళితే.. ఆ కుక్క అటువైపు పరిగెడుతోంది..వధువు భారీ ఘాగ్రా ధరించి ఉండటంతో ఆమె సరిగా పరుగెత్తలేకపోతోంది. దాంతో మండపంలో అమర్చిన పూజా సామాగ్రి అంతా చెల్లాచెదురుగా పడిపోయింది. మరో వైపు బంధువులు సైతం ఆ కుక్కపిల్లను పట్టుకునే ప్రయత్నం చేశారు. దాంతో మండపం మొత్తం బీభత్సంగా మారింది..

ఇవి కూడా చదవండి

పెళ్లి కోసం ఏర్పాటు చేసిన అక్కడి ఏర్పాట్లన్నీ చెదిరిపోయాయి. ఎంతమంది అడ్డుపడినా కూడా ఆ కుక్కపిల్ల వధువును వెంటాడం మానుకోలేదు..ఆమెను కుక్క నుండి దూరం చేయడానికి అందరూ పరుగెత్తుతారు. కానీ కుక్క పిల్ల మాత్రం ఎవరికీ దొరకదు.. చివరగా వరుడే ముందుకు వచ్చి తన నవవధువును కుక్క నుండి కాపాడతాడు. ఆ తర్వాత కుక్క వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఈ విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పెళ్లి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఈ వీడియోలు ఆసక్తికరంగా ఉంటాయి. కొన్నిసార్లు షాకింగ్ క్షణాల వీడియోలు వైరల్ అవుతాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది తమ వివాహాన్ని ప్రత్యేకంగా, మరపురానిదిగా చేయాలని కోరుకుంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటివరకు వేల సంఖ్యలో లైక్‌లు, వీక్షణలు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..