Hair Removal Tips: ముఖంపై అన్‌వాంటెడ్ హెయిర్‌ను శాశ్వతంగా నివారించాలా? ఈ చిట్కా ట్రై చేయండి
అమ్మాయిల ముఖం మీద సన్నని వెంట్రుకలు ఉంటాయి. అందంపై అధిక శ్రద్ధ తీసుకునే వారు వీటిని క్రమం తప్పకుండా ముఖంపై ఈ వెంట్రుకలను తొలగిస్తుంటారు. కొందరైతే పార్లర్‌కి వెళ్లి పికప్ చేసుకుంటే కొందరు ఇంట్లో రేజర్‌తో తీసేస్తారు. పార్లర్ ఫేషియల్ హెయిర్ రిమూవల్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. రేజర్‌తో రెగ్యులర్ హెయిర్ రిమూవల్ కూడా మంచిది కాదు. ఇది చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. నిజానికి.. ముఖం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి రేజర్ ఎక్కువగా ఉపయోగించకపోవడమే మంచిది..
Updated on: Jan 11, 2024 | 8:23 PM

అమ్మాయిల ముఖం మీద సన్నని వెంట్రుకలు ఉంటాయి. అందంపై అధిక శ్రద్ధ తీసుకునే వారు వీటిని క్రమం తప్పకుండా ముఖంపై ఈ వెంట్రుకలను తొలగిస్తుంటారు. కొందరైతే పార్లర్‌కి వెళ్లి పికప్ చేసుకుంటే కొందరు ఇంట్లో రేజర్‌తో తీసేస్తారు. పార్లర్ ఫేషియల్ హెయిర్ రిమూవల్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. రేజర్‌తో రెగ్యులర్ హెయిర్ రిమూవల్ కూడా మంచిది కాదు. ఇది చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. నిజానికి.. ముఖం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి రేజర్ ఎక్కువగా ఉపయోగించకపోవడమే మంచిది.

అధిక జుట్టు ముఖ్యంగా పై పెదవిపై ఉంటుంది. ఈ అన్‌వాంటెడ్ హెయిర్ తొలగించడానికి నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. వీటిని ఇంట్లోనే కొన్ని పదార్థాలను మిక్స్ చేసి ప్యాక్‌లా తయారు చేసుకోవచ్చు. దానితో ముఖంపై వెంట్రుకలను సులువుగా తొలగించుకోవచ్చు.

ముందుగా ఉల్లిపాయని కట్ చేసి తురుము వేయాలి. ఒక స్పూన్ ఉల్లిపాయ రసం, జామ రసంలో ఐదు చుక్కల నిమ్మరసం, కొద్దిగా కోల్గేట్ పేస్ట్ కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడు నుంచి నాలుగు రోజుల పాటు అప్లై చేయాలి. ఉల్లిపాయ, కోల్గేట్ కలిపితే జుట్టు కుదుళ్ల మూలాలు మృదువుగా మారుతాయి. ఈ మిశ్రమంలో ఒక చెంచా బియ్యప్పిండి కూడా కలుపుకోవాలి. మిశ్రమానికి కొంచెం నీరు కలపాలి. ఈ పేస్ట్‌ను వెంట్రుకలు ఉన్న చోట పట్టించి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి.

ఇలా మూడు నుంచి నాలుగు రోజుల పాటు నిరంతరం అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. చేతితో ఎంత బాగా స్క్రబ్ చేస్తే అంత మంచిది. తర్వాత తడి గుడ్డతో ముఖాన్ని తుడుచుకోవాలి. హెయిర్ ఫోలికల్ బలహీనపడిన తర్వాత, అక్కడ కొత్త జుట్టు పెరగదు.

వంట పసుపులో కొంచెం బేకింగ్ సోడా కలుపుకోవాలి. దీనిలో అర స్పూన్ బియ్యప్పిండి వేసి, కాసిన్నీ నీళ్లు పోపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని జుట్టు పెరిగే చోట అప్లై చేసుకోవాలి. ఈ చిట్కా కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ చిట్కా నాలుగు రోజులు క్రమం తప్పకుండా ట్రై చేయాలి. ఎందుకంటే ఒక్కరోజులో వెంట్రుకలన్నీ రాలిపోవు. ఇది పూర్తిగా సహజమైన పద్ధతి.




