Astro Tips: రేపు రాశిని మార్చుకోనున్న సూర్యుడు.. 30 రోజుల పాటు ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
జనవరి 15న సూర్యభగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనిని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 13 వరకు సూర్యుడు మకరరాశిలో ఉండబోతున్నాడు. ఈ పరిస్థితిలో, సూర్యుని సంచార ప్రభావం కారణంగా రేపటి నంచి 30 రోజులు వరకూ కొన్ని రాశులకు చాలా అదృష్టం కలుగుతుందట. కనుక మకర సంక్రాంతి రోజున సూర్యుని సంచారం వల్ల ఏ రాశుల వారి జీవితాలు మారబోతున్నాయో తెలుసుకుందాం.
నవ గ్రహాల రాజు సూర్య భగవానుడు నెలకు ఒకసారి తన గమనాన్ని మార్చుకుని ఒక రాశి నుండి మరొక రాశి లోకి ప్రవేశిస్తాడు. ఇలా సూర్యుడు రాశిని మార్చుకునే సమయంలో మొత్తం 12 రాశులపై ప్రభావం కనిపిస్తుంది. రేపు జనవరి 15న సూర్యభగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనిని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 13 వరకు సూర్యుడు మకరరాశిలో ఉండబోతున్నాడు. ఈ పరిస్థితిలో, సూర్యుని సంచార ప్రభావం కారణంగా రేపటి నంచి 30 రోజులు వరకూ కొన్ని రాశులకు చాలా అదృష్టం కలుగుతుందట. కనుక మకర సంక్రాంతి రోజున సూర్యుని సంచారం వల్ల ఏ రాశుల వారి జీవితాలు మారబోతున్నాయో తెలుసుకుందాం.
మేషం రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు సూర్యుని సంచారం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. సూర్యుని శుభ ప్రభావం కారణంగా వ్యాపార సంబంధిత ప్రణాళికలు అద్భుత ప్రయోజనాలను ఇస్తాయి. అదే సమయంలో సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, గౌరవం పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అదే సమయంలో.. కొంతమంది తమ భాగస్వామితో సంతోషముగా సమయాన్ని గడుపుతారు. సూర్యుని అనుగ్రహం వల్ల ఆగిన పనులు మళ్ళీ ఊపందుకుంటాయి.
సింహ రాశి: ఈ రాశికి అధినేత సూర్యుడు. దీంతో సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెట్టిన తర్వాత ఈ సింహ రాశి వారికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి. సూర్యుని అనుగ్రహం వల్ల విద్యార్థులు చదువుపై ఏకాగ్రత చూపిస్తారు. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఆరోగ్య పరంగా ఆనందంగా ఉంటారు. అదే సమయంలో ఆర్థిక సమస్యలు కూడా క్రమంగా తొలగిపోతాయి.
కుంభ రాశి: ఈ రాశికి చెందిన వారికీ సూర్య గ్రహం రాశిని మార్చుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది. పని చేస్తున్న ప్రాంతాల్లో వచ్చే కష్టాలు వాటంతట అవే తీరుతాయి. వ్యాపారంలో ధనలాభం పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు తమ అధికారులు, సహోద్యోగుల మద్దతును పొందుతారు. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. అదే సమయంలో వైవాహిక జీవితంలో కూడా మాధుర్యంతో నిండిపోతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు