Job Astrology: ఆ రాశుల వారికి సంక్రాంతి తర్వాత అధికార యోగం.. ఉద్యోగ పదోన్నతులు పక్కా.. !

త్వరలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా? మరింత ఉద్యోగంలోకి మారడం జరుగుతుందా? కోరు కుంటున్న ప్రాంతానికి బదిలీ లేదా స్థాన చలనం ఉంటుందా? పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల, గుర్తింపు వంటి విషయాలకు సంబంధించి ఉద్యోగంలో శుభ వార్తలు వింటామా? కొన్ని రాశుల వారి విషయంలో తప్పకుండా ఈ ప్రశ్నలకు సంబంధించి సానుకూల సమాధానాలు దొరుకుతాయి.

Job Astrology: ఆ రాశుల వారికి సంక్రాంతి తర్వాత అధికార యోగం.. ఉద్యోగ పదోన్నతులు పక్కా.. !
Job Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Jan 15, 2024 | 8:00 AM

త్వరలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా? మరింత ఉద్యోగంలోకి మారడం జరుగుతుందా? కోరు కుంటున్న ప్రాంతానికి బదిలీ లేదా స్థాన చలనం ఉంటుందా? పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల, గుర్తింపు వంటి విషయాలకు సంబంధించి ఉద్యోగంలో శుభ వార్తలు వింటామా? కొన్ని రాశుల వారి విషయంలో తప్పకుండా ఈ ప్రశ్నలకు సంబంధించి సానుకూల సమాధానాలు దొరుకుతాయి. ఏప్రిల్ లోగా ఆరు రాశుల వారికి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దశమాధిపతి, దశమ స్థానం అనుకూలతల వల్ల మేషం, వృషభం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి ఆశించిన శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.

  1. మేషం: ఈ రాశివారికి దశమ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు లాభస్థానంలో సంచరిస్తున్నందువల్ల, నాలుగైదు రోజుల్లో రవి కూడా దశమ (ఉద్యోగ) స్థానానికి వస్తున్నందువల్ల ఉద్యోగంలో తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. పదోన్నతికి, జీతభత్యాలు పెరగడానికి, మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి, ఇష్టమైన ప్రాంతానికి బదిలీ కావడానికి అవకాశాలున్నాయి. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగంలో స్థిరపడడానికి అవకాశం ఉంది.
  2. వృషభం: ఈ రాశికి ఉద్యోగ స్థానాధిపతి శని ఉద్యోగ స్థానంలోనే ఉన్నందువల్ల ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం లభిస్తాయి. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నం చేసినా ఆశించిన ఫలితం ఉంటుంది. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. బదిలీ లేక స్థాన చలనానికి అవకాశం లేకపోవచ్చు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారడం కంటే ప్రస్తుత ఉద్యోగంలోనే శుభ ఫలితాలు అనుభవానికి రావడం, అదృష్టం పట్టడం జరుగుతుంది.
  3. కన్య: దశమ స్థానం మీద శుభ గ్రహాల దృష్టి వల్ల ఈ రాశివారికి ఉద్యోగపరంగా అనేక శుభాలు జరగబోతున్నాయి. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు, జీతభత్యాలు పెరగడానికి కూడా అవకాశం ఉంది. సంక్రాంతి తరువాత వీరి జీవితంలో తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకుం టాయి. ఊహించని విధంగా అధికార యోగం పడుతుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు న్నాయి. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందివస్తాయి.
  4. ధనుస్సు: ఈ రాశివారికి సంక్రాంతి తర్వాత ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతితో కూడిన బదిలీకి అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడం కూడా జరుగుతుంది. విదేశీ ప్రయత్నాలు కూడా బాగా సానుకూలపడతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు అనేక ఆఫర్లు అంది వస్తాయి. ఉద్యోగంలో అధికారం చేపట్టడంతో పాటు, జీతభత్యాలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ జీవితం చాలావరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
  5. కుంభం: ఈ రాశివారికి ఉద్యోగ స్థానం, ఉద్యోగ స్థానాధిపతి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆశించిన ఉద్యోగంలోకి మారడానికి కూడా అవ కాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించిన ఎటువంటి ప్రయత్నమైనా సానుకూల ఫలితాలనిస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగ భద్రత, స్థిరత్వం లభిస్తాయి. పదోన్నతికి, ప్రాధాన్యం పెరగడానికి కూడా అవకాశం ఉంది.
  6. మీనం: ఈ రాశివారికి మే వరకూ ఉద్యోగ స్థానంలో శుభ గ్రహ సంచారం జరుగుతున్నందువల్ల ఉద్యోగ జీవితం ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు సాగిపోతుంది. ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా సంక్రాంతి ప్రాంతంలో కొన్ని శుభవార్తలు కూడా వింటారు. ఉద్యోగులకు స్థాన చలనానికి, బదిలీలకు అవకాశం లేదు కానీ, ఉద్యోగం మారడానికి మాత్రం అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి.

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు
ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు