Horoscope Today: ఈ రాశివారికి ఇంటా బయటా బాగా ఒత్తిడి.. కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి
ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వృత్తి జీవితంలో ఉన్నవారు అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవ కాశం ఉంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు విజయవంతం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అనేక విధాలుగా సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు చేపట్టడానికి, పనులు ప్రారంభించడానికి అనువైన కాలం ఇది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా సఫలం అవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందు కుంటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వృత్తి జీవితంలో ఉన్నవారు అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవ కాశం ఉంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. కొత్త ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. సమయం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగపరంగా ఊహించని అదృష్టం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగు తుంది. వృత్తి జీవితంలో కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగు తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. గృహ, వాహన సౌకర్యాలకు అవ కాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే సూచనలు న్నాయి. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. తల్లి తండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ పెద్దల జోక్యంతో తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవు తుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలి స్తాయి. మంచి కంపెనీల నుంచి శుభవార్త అందుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడ తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ప్రస్తుతం ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణ యాలు అమలు చేసి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అదికారులు ఎక్కువగా ఆధారపడతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు చోటు చేసుకుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపో తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కుటుంబపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎటువంటి ప్రయత్నం తల పెట్టినా సఫలం అవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరగడంతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు అంచనాలకు మించి అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడు తుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలం అవు తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. సామాజికంగా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. వ్యాపారాలలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవు తాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నం అయినా అనుకూల ఫలితాలనిస్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు పెట్టుకోవద్దు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ జీవితంలో మీ ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆహార విహారాల్లోనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారులు మరీ ఎక్కువగా మిమ్మల్ని ఉపయోగించు కునే అవకాశం ఉంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగు తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అవ కాశాలు అంది వస్తాయి. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. సతీమణితో సామరస్యం పెరుగుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చ వద్దు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు కనిపిస్తాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపా రాలు లాభదాయకంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. వ్యాపారాల్లో పోటీదార్లు వెనుకడుగు వేసే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకో వాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ ఉంటుంది. బంధుమిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడ తాయి.