Ayodhya: శ్రీలంక నుంచి ఉజ్జయినికి చేరుకున్న రామ చరణ పాదుక యాత్ర.. రామయ్య పయనించిన మార్గంలోనే అయోధ్యకు..
శ్రీరాముడు నడిచిన మార్గంలో రామ చరణ పాదుక యాత్రను నిర్వహిస్తున్న నేపథ్యంలో సత్యనారాయణ మౌర్య పాదుకలతో ఉజ్జయిని చేరుకున్నారు. శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో పూర్తి నియమ నిష్టలు, ఆచార వ్యవహారాలతో పూజలను నిర్వహించారు. ఈ యాత్ర శ్రీలంక నుంచి ప్రారంభమై అయోధ్య వరకు సాగుతుందని బాబా సత్యనారాయణ మౌర్య చెప్పారు. ఈ యాత్రను ఆయన శ్రీరాముడు స్వయంగా కాలినడకన శ్రీలంక చేరుకున్న అదే మార్గంలో పయనిస్తున్నట్లు వెల్లడించారు.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 22న రామాలయ గర్భ గుడిలో రామ్ లల్లా ప్రతిష్టాపన జరగనుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయోధ్య రామాలయం నుంచి వచ్చిన అక్షతలను దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. ఈ దైవ కార్యంలో ప్రతి ఒక్కరును పాల్గొనమని దేశప్రజలను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రామయ్యకు అత్తారిల్లైన నేపాల్ నుంచి భారీ కానుకలు వచ్చాయి. మరోవైపు ప్రసిద్ధ కరసేవకుడు బాబా సత్యనారాయణ మౌర్య శ్రీలంక నుండి శ్రీ రాముని చరణ్ పాదుక యాత్రను చేపట్టారు. రామయ్య అయోధ్య నుంచి శ్రీలంక చేరుకున్న మార్గంలోనే ఈ ప్రయాణం సాగుతోంది.
ఈ మార్గంలో ఉజ్జయిని కూడా ఉంది. శ్రీరాముడు నడిచిన మార్గంలో రామ చరణ పాదుక యాత్రను నిర్వహిస్తున్న నేపథ్యంలో సత్యనారాయణ మౌర్య పాదుకలతో ఉజ్జయిని చేరుకున్నారు. శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో పూర్తి నియమ నిష్టలు, ఆచార వ్యవహారాలతో పూజలను నిర్వహించారు. ఈ యాత్ర శ్రీలంక నుంచి ప్రారంభమై అయోధ్య వరకు సాగుతుందని బాబా సత్యనారాయణ మౌర్య చెప్పారు. ఈ యాత్రను ఆయన శ్రీరాముడు స్వయంగా కాలినడకన శ్రీలంక చేరుకున్న అదే మార్గంలో పయనిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే రామయ్య ఉజ్జయినికి వచ్చాడని.. అందుకే ఈ యాత్ర కూడా ఆయన అడుగుజాడల్లో ఉజ్జయినికి చేరుకుందని చెప్పారు.
శ్రీ మహాకాళేశ్వరుడి గర్భ గుడిలో పూజలు
శ్రీ రామ చరణ పాదుకా యాత్ర రథాన్ని భరతమాత ఆలయం వద్ద నిలిపి ముందుగా శ్రీ రాముని చరణ పాదుకను పూజించారు.అనంతరం చరణ పాదుకను శ్రీమహాకాళేశ్వరాలయానికి తీసుకువెళ్లి గర్భంలో ఉంచి పూజలు నిర్వహించారు. హారతినిచ్చారు. అనంతరం విధివిధానాల ప్రకారం యాత్ర ముందుకు సాగింది. శ్రీ మహాకాళేశ్వరుడి ఆలయం నుంచి తిరిగి మొదలు పెట్టిన ఈ యాత్ర రేపటికి (జనవరి 15) చిత్రకూట్‌కు చేరుకుంటుందని తెలిపారు.
నృత్యాలు, పాటలు పాడుతూ స్వాగతం పలికిన భక్తులు
భగవంతుని పాదాలు తమ ఊరికి రావడం ఉజ్జయిని వాసుల అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు శ్రీ రామ చరణ పాదుకా రథం ఉజ్జయినికి చేరుకుంటుందన్న సమాచారం అందిన వెంటనే నగరవాసులు భారీ సంఖ్యలో భరతమాత ఆలయానికి చేరుకున్నారు. రథాన్ని చూడగానే జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ డ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. భారతమాత ఆలయం నుంచి యాత్ర మహాకాళేశ్వరాలయానికి చేరుకోనే వరకూ రామయ్య భక్తులు డప్పులు వాయిస్తూ నృత్యాలు చేస్తూ పాడుతూనే ఉన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..