AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ రోజున ఆ దేశం కీలక నిర్ణయం.. హిందువులకు రెండు గంటలు ప్రత్యేక సెలవు

ఈ నెల 22న బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠాపన వేడుక సమయంలో జరిగే పూజకు హాజరు కావడానికి తమ దేశంలోని హిందువులకు రెండు గంటల సమయం ప్రత్యేక సెలవును మంజూరు చేసినట్లు ప్రకటించింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. 

Ayodhya: రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ రోజున ఆ దేశం కీలక నిర్ణయం.. హిందువులకు రెండు గంటలు ప్రత్యేక సెలవు
Ayodhya Ram Mandir
Surya Kala
|

Updated on: Jan 14, 2024 | 10:14 AM

Share

రామయ్య జన్మ భూమి అయోధ్యలో శ్రీ రామ మందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22వ తేదీన అంగ రంగవైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయంతో పాటు నగరాన్ని కూడా అతి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సమక్షంలో ఇతర నేతల సమక్షంలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా వేలాది మందిని ఆహ్వానించారు. పలువురు రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సెలబ్రిటీలను దీక్షా కార్యక్రమంలో పాల్గొనమంటూ ఆహ్వానం అందించారు. ఆలయ ప్రారంభం కోసం దేశ విదేశాల్లో ఉన్న రామ భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ  మారిషస్ ప్రభుత్వం రామ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది.

రామ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని దేశ విదేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మారిషస్ ప్రభుత్వం అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మారిషస్‌ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 22న ఆ దేశంలో నిర్వహిస్తున్న పూజల్లో పాల్గొనేందుకు, అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ వేడుకను టీవీల్లో చూసేందుకు హిందు అధికారులకు రెండు గంటల పాటు అనుమతి మంజూరు చేసింది. హిందూ సంఘాలు చేసిన విజ్ఞప్తిపై అక్కడి ప్రధాని అనిరుధ్‌ జగన్నాధ్‌ నేతృత్వంలోని కేబినెట్‌ చర్చించి రెండు గంటల ప్రత్యేక సెలవుకు అనుమతి ఇచ్చింది. మారిషస్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువుల జనాభా 48.5 శాతంగా ఉంది.

అమెరికా, బ్రిటన్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో ఉన్న భారతీయులకు రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం చూడాలనే ఉత్సాహం ఉంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని యునైటెడ్ స్టేట్స్ న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రసారం చేయనున్నామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

VHPకి చెందిన అమెరికన్ చాప్టర్, USలోని వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్న హిందువుల భాగస్వామ్యంతో రామ ప్రతిష్ట వేడుకలను జరుపుకోవడానికి అగ్ర రాజ్యంలో 40 కంటే ఎక్కువ బిల్‌బోర్డ్‌లను ఏర్పాటు చేసింది. ఈ బిల్‌బోర్డ్‌లు టెక్సాస్, ఇల్లినాయిస్, న్యూయార్క్, న్యూజెర్సీ, జార్జియాలో ఏర్పాటు చేశారు. అమెరికన్ అధ్యాయం ప్రకారం జనవరి 15, సోమవారం నుండి అరిజోనా, మిస్సౌరీ రాష్ట్రం కూడా ఈ వేడుకలో భాగం కానున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వెండి ధర భారీగా పడిపోనుందా..?
వెండి ధర భారీగా పడిపోనుందా..?
చిరంజీవి హిట్ కొడితే ఇలా ఉంటది.. ఒకే ఫ్యామిలీ నుంచి 140 టికెట్లు.
చిరంజీవి హిట్ కొడితే ఇలా ఉంటది.. ఒకే ఫ్యామిలీ నుంచి 140 టికెట్లు.
క్రికెటర్ కావాలనుకుంటే.. అనుకోని ప్రమాదం క్రీడా మంత్రిని చేసింది
క్రికెటర్ కావాలనుకుంటే.. అనుకోని ప్రమాదం క్రీడా మంత్రిని చేసింది
ఇంట్లో ఇన్సులిన్ మొక్కను ఎలా పెంచాలి? ఇది డయాబెటిస్‌ వారికి వరం!
ఇంట్లో ఇన్సులిన్ మొక్కను ఎలా పెంచాలి? ఇది డయాబెటిస్‌ వారికి వరం!
కరాచీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి!
కరాచీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి!
NTRకి భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష: సీఎం చంద్రబాబు
NTRకి భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష: సీఎం చంద్రబాబు
ఉదయం లేచినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుందా? అసలు కారణాలు ఇవే!
ఉదయం లేచినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుందా? అసలు కారణాలు ఇవే!
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. 3 నెలల్లోనే 10 కిలోల బరువు తగ్గవచ్చు!
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. 3 నెలల్లోనే 10 కిలోల బరువు తగ్గవచ్చు!
రోజా కూతురును చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్
రోజా కూతురును చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్
71 పరుగులకే 4వికెట్లు ఢమాల్..ఇండోర్‌లో కష్టాల్లో పడ్డ టీమిండియా
71 పరుగులకే 4వికెట్లు ఢమాల్..ఇండోర్‌లో కష్టాల్లో పడ్డ టీమిండియా