AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhogi 2024: భోగి పండగ విశిష్టత.. భోగి మంటల్లో భోగి పిడకలు వేయడం వెనుక రీజన్ ఏమిటో తెలుసా..

మొదటి పండగ భోగి.. అంటే తొలిరోజు అని అర్ధం. ఈ రోజున తెల్లవారు జామునే ఇంటి ముంగిట భోగి మంటలు వేస్తారు. భోగి అనే మాట.. భాగ అనే పదం నుంచి వచ్చిందని అంటారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్ధం. మరికొందరు 'భుగ్' అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖంని అర్ధం ని చెబుతారు. ఈరోజున శ్రీ రంగనధస్వామిని గోదాదేవి వివాహం చేసుకుని ఆయనలో లీనమై భొగాన్ని పొందిందని దీనికి సంకేతంగా భోగి పండగ మొదలైందని పురాణ గాధ.

Bhogi 2024: భోగి పండగ విశిష్టత.. భోగి మంటల్లో భోగి పిడకలు వేయడం వెనుక రీజన్ ఏమిటో తెలుసా..
Bhogi 2024
Surya Kala
|

Updated on: Jan 13, 2024 | 4:05 PM

Share

తెలుగు వారు జరుపుకునే అతి పెద్ద పండగల్లో సంక్రాంతి ఒకటి. మూడు రోజుల పాటు జరుపుకునే సంబరాల  పండుగ. మొదటి రోజున’ భోగి పండగగా.. రెండవ రోజున మకర సంక్రాంతి గా… మూడో రోజున కనుమగా మూడు రోజులు పాటు కొందరు జరుపుకుంటే మరికొన్ని ప్రాంతాల్లో నాల్గో రోజున ముక్కనుమగా కూడా  జరుపుకుంటాం. మొదటి పండగ భోగి.. అంటే ‘తొలిరోజు అని అర్ధం. ఈ రోజున తెల్లవారు జామునే ఇంటి ముంగిట భోగి మంటలు వేస్తారు. భోగి అనే మాట.. భాగ అనే పదం నుంచి వచ్చిందని అంటారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్ధం.

భోగి అని ఎందుకు పిలుస్తారు?

దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు రోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు వేడి  కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఈ మంటలు వేయడం వలన భోగీ అనే పేరు వచ్చింది.

పురాణ కథనం

మరికొందరు ‘భుగ్’ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖంని అర్ధం ని చెబుతారు. ఈరోజున శ్రీ రంగనధస్వామిని గోదాదేవి వివాహం చేసుకుని ఆయనలో లీనమై భొగాన్ని పొందిందని దీనికి సంకేతంగా భోగి పండగ మొదలైందని పురాణ గాధ.

ఇవి కూడా చదవండి

భోగి పండగ వెనుక ఆరోగ్య రహస్యం ఏమిటంటే..

  1. భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెల రోజులూ ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని భోగి పిడకలు అని అంటారు. వీటిని దండగా గుచ్చి భోగి రోజున వేసిన మంటల్లో వేస్తారు.
  2. ఇలా దేశి ఆవు పేడతో చేసిన పిడకలు మంటలో కలడం వలన గాలి శుద్ధి అవుతుంది.
  3. సూక్ష్మక్రిములు నశిస్తాయి.

  1. భోగి మంట కోసం ఎక్కువగా మామిడి, రావి వంటి ఔషధ గుణాలున్న చెట్ల కొమ్మలను ఉపయోగిస్తారు. మంటను వేసే ముందు కట్టెలు త్వరగా అంటుకోవడానికి ఆవు నెయ్యిని నెయ్యని జోడిస్తారు.
  2. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది.
  3. ఈ శుభ్రమైన గాలి మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది.
  4. భోగి మంటల సమయంలో వెలువడే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
  5. భోగి మంటలను అగ్నిదేవుడిని ఆరాధనగా పరిగణిస్తారు.

వాస్తవంగా హిందువులు జరుపుకునే ప్రతి పండగకు కొన్ని నియమాలుంటాయి.. ఆవి ఆయా కాలానికి అనుగుణంగా ఉంటాయి. మన ప్రతి పండగకు తినే ఆహార పదార్ధాలు, జరుపుకునే విధి విధానం పూజలు అన్నీ సీజన్ కు అనుగుణంగా విశేష మైన అర్థాలు, ఉపయోగాలు, ఫలితాలు పెద్దలచే నిర్ణయింపబడ్డాయని చెబుతారు.

భోగి మంటల్లో ఏమి వేయకూడదంటే

భోగి మంటల్లో రబ్బర్‌ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్‌ కుర్చీలని వేసి వాటిని మండించేందుకు పెట్రోలు, కిరసనాయిల్ వంటివాటిని వినియోగిస్తున్నారు. ఇలాంటి గాలిని పీల్చడం వలన ఊపిరితిత్తులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు