AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagannath Temple: జగన్నాథునికి అస్వస్థత.. 15 రోజులు పాటు గోప్య చికిత్స.. స్వామి లీల వెనుక రహస్యం ఏమిటంటే..

జగన్నాథుడు ప్రతి సంవత్సరం 15 రోజులు అనారోగ్యానికి గురవుతాడు... ఆయన లీలనే అనసార లీల అంటారు. అయితే దేవుడు ఇలా ఎందుకు అనారోగ్యానికి గురవుతాడు. ఆయన ఈ లీలను ఎందుకు సృష్టిస్తాడు, ఈ ప్రశ్న భక్తుల మనస్సులో కలిగితే .. దానికి సమాధానం.. పుట్టిన మనిషికి మరణం తప్పదు. జీవితంలో సుఖదుఃఖాలు సహజమని.. దేహం తరచూ అనారోగ్యం బారిన పడుతుందని..చికిత్స అవసరమని ఆయన చెబుతున్నాడు.

Jagannath Temple: జగన్నాథునికి అస్వస్థత.. 15 రోజులు  పాటు గోప్య చికిత్స.. స్వామి లీల వెనుక రహస్యం ఏమిటంటే..
Lord Jagannath Fall Ill
Surya Kala
|

Updated on: Jun 12, 2025 | 9:06 AM

Share

జగన్నాథ పూరి రథయాత్ర సాంస్కృతిక , మతపరమైన వారసత్వ గొప్పతనానికి చిహ్నం. ఇది హిందువులలో మతం విశ్వాసానికి ఒక ఉదాహరణ. జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జగన్నాథుని స్నాన యాత్ర పండుగని నిర్వహించారు. ఈ రోజున జగన్నాథుడు, బలరాముడు, సుభద్రలను ఆలయం నుంచి బయటకు తీసుకుచ్చారు. ఈ ప్రయాణాన్ని పహండి యాత్ర అంటారు. జగన్నాథుడిని వివిధ తీర్థయాత్రల నుంచి 108 బంగారు పాత్రలలో నింపిన నీటితో స్నానం చేయించారు. ఆ వెంటనే స్వామికి జ్వరం వచ్చి అనారోగ్యానికి గురవుతారు.

జగన్నాథుని 15 రోజుల ఏకాంతవాసం

తరువాత అతను 15 రోజులు విశ్రాంతి తీసుకుంటాడు. ఈ మొత్తం ప్రక్రియను ‘అనసార లీల’ అంటారు. ఈ సమయంలో ఆలయ తలుపులు మూసివేయబడతాయి. 15 రోజుల పాటు గోప్యంగా చికిత్సనందిస్తారు. ఈ 15 రోజులు ‘దయిత్గన్’ అని పిలువబడే అతని వ్యక్తిగత సేవకులు మాత్రమే ప్రభువు ఏకాంతానికి వెళ్ళడానికి అనుమతించబడతారు.

15 రోజుల నిడివి గల ‘అనసార లీల’

ఈ సమయంలో 24 గంటలు పనిచేసే జగన్నాథుని వంటగది 15 రోజులు మూసివేయబడుతుంది. 15 రోజులు భగవంతుడు ఆహారం తినడు. భగవంతుడు త్వరగా కోలుకోవడానికి వివిధ రకాల కషాయాలు, మూలికలు మాత్రమే ఇస్తారు. ఇది మాత్రమే కాదు ఈ 15 రోజులు భగవంతుని ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి ప్రతిరోజూ ఒక వైద్యుడు వెళ్తాడు. అయితే ప్రతి సంవత్సరం 15 రోజులు జగన్నాథుడు ఎందుకు అనారోగ్యానికి గురవుతాడు? ఈ ప్రశ్న ప్రతి భక్తుడి మనస్సులో తప్పకుండా కలుగుతుంది. కనుక ఈ ప్రశ్నకు సమాధానంగా రెండు కథలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

జగన్నాథుడు.. భక్తుడు మాధవ దాస్ ప్రేమ కథ

ఈ విషయంపై ఒక ప్రసిద్ధ కథ ఏమిటంటే మాధవదాస్ జగన్నాథునికి గొప్ప భక్తుడు. అతని భార్య మరణం తరువాత.. అతని జీవితంలో ముఖ్యమైనది భగవంతుని సేవ చేయడమే. వయసు పెరిగే కొద్దీ అతను చాలా అనారోగ్యానికి గురయ్యాడు. ఇప్పుడు జగన్నాథుడికి సేవ చేసే సామర్థ్యం మీలో లేదని ప్రజలు అన్నారు. అయితే తన శరీరంలో జీవం ఉన్నంత వరకు నేను భగవంతుని సేవ చేయడం ఆపలేనని మాధవదాస్ అన్నారు. ఇంతలో ఒక రోజు మాధవదాస్‌ సేవ చేస్తున్నప్పుడు మూర్ఛపోయాడు. భక్తుడు అనారోగ్యానికి గురైనప్పుడు.. భగవంతుడు స్వయంగా తన భక్తుడి వద్దకు సేవించడానికి వచ్చాడు. భగవంతుడు జగన్నాథుడు తన భక్తుడిని సేవిస్తూనే ఉన్నాడు. అతను స్పృహలోకి వచ్చినప్పుడు తనకు సేవలు చేసింది.. జగన్నాథుడు అని అతను అర్థం చేసుకున్నాడు. అతను భగవంతుని పాదాలపై పడి..”ప్రభూ, నువ్వు నాకు ఇంత సేవ చేస్తున్నావు, నువ్వు దేవుడివైతే.. నీ సేవ నుంచి నన్ను ఎందుకు దూరం చేశావు? నువ్వు అనుగ్రహిస్తే నాకు కలిగిన అనారోగ్యాన్ని నువ్వు తప్పించుకోగలిగేవాడివి. అని ప్రశ్నించాడు. అప్పుడు జగన్నాథుడు నేను నీ ప్రేమకు కట్టుబడి ఉన్నానని.. అందుకే నేను నిన్ను సేవించడానికి వచ్చాను. అయితే నేను విధిని మార్చలేను.. మాధవ్ దాస్.. నీ విదిలిఖితంలో ఇంకా 15 రోజుల అనారోగ్యం రాసి ఉంది.. అయితే నీ ప్రేమను చూసి.. నీ ఈ 15 రోజుల అనారోగ్యాన్ని నేను తీసుకుంటున్నా అని చెప్పాడు. అప్పటి నుంచి జగన్నాథుడు జేష్ఠ పౌర్ణమి రోజున తన భక్తుల బాధలను తనపై వేసుకుని 15 రోజులు అనారోగ్యానికి గురవుతాడని నమ్ముతారు.

పూరి రాజు కలకు సంబంధించిన కథ

మరొక కథ ప్రకారం, ఒరిస్సా రాజు కలలో జగన్నాథుడు కనిపించి.. “మహారాజా ఆలయం ముందు ఉన్న మర్రి చెట్టు దగ్గర బావి తవ్వించండి. నేను దాని చల్లని నీటిలో స్నానం చేసి 15 రోజులు ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాను” అని అన్నాడు. అప్పుడు జ్యేష్ఠ పూర్ణిమ రోజున భగవంతుడికి ఆ బావి నీటిలో స్నానం చేయించి స్నానం చేసిన తర్వాత, భగవంతుడు అనారోగ్యానికి గురయ్యాడు. ఇలా 15 రోజులు అనారోగ్యంతో ఉన్న సమయంలో భక్తుడికి దర్శనం ఇవ్వనని జగన్నాథుడు రాజుకు కలలో చెప్పాడు.

ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది

ఈ కథల కారణంగా నేటికీ జగన్నాథ పూరిలో భగవంతుడికి ఈ పవిత్ర స్నానం ఆచరిస్తారు. ప్రతి సంవత్సరం భగవంతుడు అనారోగ్యానికి గురవుతాడు. దీని తరువాత భగవంతుడు 15 రోజులు పాటు జ్వరానికి గోప్య చికిత్సని తీసుకుంటాడు. ఈ 15 రోజులలో భగవంతుడికి చికిత్స చేస్తారు. జగన్నాథుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు. ఆయన వంటగది మూసివేయబడుతుంది. అంతేకాదు 15 రోజులు ఆలయం మూసివేయబడుతుంది. మళ్ళీ 15 రోజుల తర్వాత, జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. జగన్నాథుడు రథయాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం తరలివస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.