Vastu Tips: ఇంట్లో గుడ్లగూబ ఫొటో ఉండడం మంచిది కాదా.? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది.?

ఇలాంటి భయంకరైన గుడ్ల గూబను ఇంట్లో పెట్టుకుంటే ఏదో జరుగుతుందని భయపడుతుంటారు. ఇంతకీ వాస్తు శాస్త్రం ప్రకారం అసలు గుడ్ల గూబ ఫొటోను ఇంట్లో పెట్టుకోవడం మంచిదేనా.? ఈ పక్షి ఫొటోను పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.? లాంటి వివరాలు ఓసారి తెలుసుకుందాం.. గుడ్లగూబ లక్షమీ దేవి వాహనంగా భావిస్తారు. అయితే కొంతమంది గుడ్లగూబను శుభప్రదంగా భావిస్తే మరికొందరు దీనిని అపశకునంగా భావిస్తారు...

Vastu Tips: ఇంట్లో గుడ్లగూబ ఫొటో ఉండడం మంచిది కాదా.? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది.?
Vastu Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 12, 2023 | 4:35 PM

ఇంట్లో రకరకాల ఫొటోలను ఏర్పాటు చేసుకుంటుంటాం. దేవుడి ఫొటోలతో పాటు జంతువులు, పక్షుల ఫొటోలు పెట్టుకుంటారు. అయితే కొందరు గుడ్లగూబ ఫొటోలను సైతం ఇంట్లో ఏర్పాటు చేసుకుంటారు. కానీ కొందరిలో గుడ్లగూబ అనగానే ఏదో తెలియని భయం ఉంటుంది. భయంరంగా ఉండే దాని ఆకారం చూసి చాలా మంది భయపడుతుంటారు.

ఇలాంటి భయంకరైన గుడ్ల గూబను ఇంట్లో పెట్టుకుంటే ఏదో జరుగుతుందని భయపడుతుంటారు. ఇంతకీ వాస్తు శాస్త్రం ప్రకారం అసలు గుడ్ల గూబ ఫొటోను ఇంట్లో పెట్టుకోవడం మంచిదేనా.? ఈ పక్షి ఫొటోను పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.? లాంటి వివరాలు ఓసారి తెలుసుకుందాం.. గుడ్లగూబ లక్షమీ దేవి వాహనంగా భావిస్తారు. అయితే కొంతమంది గుడ్లగూబను శుభప్రదంగా భావిస్తే మరికొందరు దీనిని అపశకునంగా భావిస్తారు. అయితే లక్ష్మీదేవికి వాహనమైన గుడ్లగూబ ఫొటోను ఇంట్లో ఉంచుకుంటే లాభమని వాస్తు పండితులు చెబుతున్నారు.

అయితే సరైన దిశలో పెడితేనే లాభం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఆఫీస్‌ లేదా పని ప్రదేశాల్లో గుడ్లగూబ విగ్రహం లేదా ఫొటో పెట్టుకోవడం వల్ల విజయాలు సొంతమవుతాయి. లక్ష్మీదేవీని ప్రసన్నం చేసుకేందుకు మంచి మార్గంగా చెబుతుంటారు. ఆఫీసులో పాజిటివ్‌ ఎనర్జీ పెరగడానికి, నెగిటివ్‌ ఎనర్జీ తగ్గడానికి ఉపయోగపడుతుంది. కంప్యూటర్ టేబుల్‌పై లేదా దుకాణాల్లో కౌంటర్‌పై గుడ్లగూబ విగ్రహం పెట్టుకోవచ్చు. అయితే కచ్చితంగా మీకు కుడివైపు ఉండేలా చూసుకోవాలి. దీంతో పనిలో ఆటంకాలు తొలగిపోయి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.

ఇక ఇంట్లో కూడా గుడ్లగూబ ఫొటో లేదా విగ్రహాన్ని ఉంచుకోవాలి. హాల్‌తో పాటు, స్టడీ రూమ్‌లో ఫొటోలను పెట్టుకోవచ్చు. ఇంట్లో గుడ్లగూబ ఫొటోను ఉంచుకోవడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నరదృష్టి వంటి నెగిటివ్‌ ఎనర్జీ సోకకుండా గుడ్లగూబ ఫొటోలను ఏర్పాటు చేసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి ముఖ ద్వారంలో నుంచి కనిపించేలా పెట్టుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు. ఇంట్లో గుడ్లగూబ ఫొటో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..