AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోనాలు.. శివసత్తుల పూనకాలు.. పెద్ద పట్నాలు.. కన్నుల పండువగా ఐనవోలు మల్లన్న ఆలయ బ్రహ్మోత్సవాలు

ఐనవోలు మల్లన్న ఆలయం బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. 3నెలలపాటు సందడిగా సాగే జాతరకు భక్తులు ముందస్తుగానే పోటెత్తారు. లక్షలసంఖ్యలో భక్తులు మల్లన్నను..

బోనాలు.. శివసత్తుల పూనకాలు.. పెద్ద పట్నాలు.. కన్నుల పండువగా ఐనవోలు మల్లన్న ఆలయ బ్రహ్మోత్సవాలు
Sanjay Kasula
|

Updated on: Jan 12, 2021 | 11:41 AM

Share

Inavolu Mallanna Brahmotsavalu : ఐనవోలు మల్లన్న ఆలయం బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. 3నెలలపాటు సందడిగా సాగే జాతరకు భక్తులు ముందస్తుగానే పోటెత్తారు. లక్షలసంఖ్యలో భక్తులు మల్లన్నను దర్శించుకునేదుకు తరలివస్తుండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎత్తు బోనాలు.. శివసత్తుల పూనకాలు.. పెద్ద పట్నాలతో మల్లికార్జున స్వామీ జాతర కన్నుల పండువగా సాగనుంది.

రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంబ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ముచ్చటైన స్వాగత తోరణాలతో మల్లన్న ఆలయం సుందరంగా మారింది.  ప్రకృతి రమణీయత, అద్భుత శిల్పసంపదతో సువిశాల ప్రాంగణంలో వందల ఏళ్ల క్రితం ఆలయం నిర్మితమైంది.

ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాయి. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఇటీవలే సమీక్ష నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పనులు వేగవంతం చేయాలని ఆదేశించడంతో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశారు.

ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు ప్రారభమవుతాయి. ఈ నెల 14న బండ్లు తిరుగుట, 16న మహాసంప్రోక్ష సమారాధన, ఫిబ్రవరి 2న భ్రమరాంబిక అమ్మవారి వార్షికోత్సవం, 17న రేణుకా ఎల్లమ్మ పండుగ, మార్చి 9 నుంచి 13 వరకు శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

ఏప్రిల్ 13న ఉగాదితో.. ఉత్సవాలు ముగుస్తాయి. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారులు వెల్లడించారు. కరోనా దృష్ట్యా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. క్యూలైన్లలో థర్మల్ స్క్రీనింగ్ చేసి… శానిటైజర్, మాస్క్ పంపిణీ చేస్తామని ఈవో తెలిపారు. కరోనా‌ నిబంధనలు పాటి‌స్తూ భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు కోరారు.