Vastu Tips : లక్ష్మీదేవి అనుగ్రహం కావాలా, అయితే ఈ మొక్క మీ ఇంట్లో ఉండితీరాల్సిందే

వాస్తు శాస్త్రం ప్రకారం..తులసి మొక్క పవిత్రమైంది మాత్రమే కాదు..ఎన్నో ఔషద గుణాలున్న మొక్క కూడా. అందుకే ప్రతిహిందూ ఇంట్లో తులసి మొక్కను తప్పకుండా పెంచుకుంటారు.

Vastu Tips : లక్ష్మీదేవి అనుగ్రహం కావాలా, అయితే ఈ మొక్క మీ ఇంట్లో ఉండితీరాల్సిందే
Vastu Tips
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 11, 2023 | 8:50 AM

వాస్తు శాస్త్రం ప్రకారం..తులసి మొక్క పవిత్రమైంది మాత్రమే కాదు..ఎన్నో ఔషద గుణాలున్న మొక్క కూడా. అందుకే ప్రతిహిందూ ఇంట్లో తులసి మొక్కను తప్పకుండా పెంచుకుంటారు. నిత్యం పూజిస్తుంటారు. తులసి మొక్క ఉన్న ఇల్లు సుఖశాంతులతో, సిరిసంపదలతో వెల్లివెరిస్తుందని నమ్మకం. ఎవరి ఇంట్లో తులసి మొక్క ఉన్నా… గృహం తీర్థ స్వరూపమని శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి దళాలతో శివకేశవులను పూజించిన వారికి మోక్షం ప్రాప్తిస్తుందని నమ్ముతుంటారు. నర్మదా నదిని చూడటం, గంగాస్నానం చేయడం, తులసి వనాన్ని సేవించడం, ఈ మూడు కూడా సమాన ఫలాములను ఇస్తాయి.

ఇంట్లో తులసి మొక్కను ఎక్కడ నాటాలి:

ఇంట్లో తులసి మొక్క ఉంటే ప్రసరించే గాలి శుద్ధి అవుతుంది. గాలిలోని హానికర కెమికల్స్ ను శోషణ చేస్తుంది. ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా నిరోధిస్తుంది. తులసి మొక్కను పెంచితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో అనారోగ్య సమస్యల రాకుండా తులసి కాపాడుతుంది. అంతేకాదు ఇంట్లోకి సౌభాగ్యం తెస్తుంది. ఇంట్లో తులసి మొక్క ఉందంటే ఆ ఇంట్లో లక్ష్మీ దేవి కొలువై ఉన్నట్లే. ధనవృద్ధికి దోహదం చేయడంతోపాటు కుటుంబ ఆర్థిక స్థితి మెరుపడేందుకు తులసి మొక్కను ఇంట్లో తప్పకుండా పెంచుకోవాలి. కుటుంబ సభ్యుల రక్షణకు తులసి మొక్కను పెంచడం మంచి ఉపాయం. ఎందుకంటే తులసి దిష్టి నుంచి ఇంటిని కాపాడుతుంది. తులసి మొక్క ఉన్న ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుగారాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

తులసి లక్ష్మీదేవితో సమానం:

నిత్యం ఎవరైతే తులసిమాతకు దీపారధన చేసి నైవేద్యం సమర్పిస్తారో ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. పిల్లలు చదువుల నుంచి మీ ఆర్థికస్థితిగతులవరకు అన్నీ నెరవేరుతాయి. ప్రతిరోజూ ఉదయం సూర్యరాధన చేసిన తర్వాత తులసీకి నీటి సమర్పించాలి. ఇక తులసీని ఇంట్లో కార్తీక మాసంలో నాటుకోవడం మంచిది. శ్రీతులసిని ఇంట్లో పెంచుకుంటే అదృష్టంగా భావిస్తుంటారు. గ్రంధాలలో, తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా వర్ణించారు. అంటే తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది. కుటుంబ ఆర్థిక స్థితికి కూడా ఇది శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో తులసి మొక్క ఉంటే మనసుకు ప్రశాంతత, ఆనందం కలుగుతాయి.

ఈ విషయాలు తప్పకుండా పాటించాలి:

-స్త్రీలు తులసి దళాలు కొయ్యకూడదు.

-పురుషులు కూడా బహుళ పక్షంలోని అష్టమీ, చతుర్దశి, అమావాస్య తిథులలో కానీ పౌర్ణమి నాడు కానీ, ఆది, మంగళ , శుక్రవారాల్లో తులసి దళాలను కోయ్యరాదు.

-కొంతమంది తులసి కోటలో ఎక్కువగా పసుపు, కుంకుమ, అక్షితలు వేస్తుంటారు. అలా వేయకూడదు. అలా వేస్తే ఆ మట్టిలో పోషకాలు నశిస్తాయి. మొక్క ఎక్కువ కాలం నిలవకుండా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..