AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dream Meaning: గురువారం రాత్రి ఈ కలలు వస్తే మాత్రం డేంజర్.. బీకేర్ ఫుల్!

Dream Meaning: రాత్రి నిద్రలో కలలు రావడం సహజమే. కొన్ని కలలు శుభప్రదంగా ఉండగా, మరికొన్ని భయంకరంగా ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం, కలలు భవిష్యత్తులో జరగబోయే శుభ–అశుభ పరిణామాలకు సంకేతాలు ఇస్తాయి. ఇప్పుడు గురువారం రాత్రి వచ్చే కలలు, ఏ కలలు ఎలాంటి ప్రభావాలు చూపుతాయో వాటి గురించి తెలుసుకుందాం.

Dream Meaning: గురువారం రాత్రి ఈ కలలు వస్తే మాత్రం డేంజర్.. బీకేర్ ఫుల్!
Dreams
Rajashekher G
|

Updated on: Jan 08, 2026 | 12:46 PM

Share

రాత్రి నిద్రలో కలలు రావడం అనేది సాధారణ విషయమే. అయితే, కొన్నిసార్లు మంచి కలలు వస్తుంటాయి. మరికొన్ని సార్లు చాలా భయంకరమైన కలలు కూడా వస్తుంటాయి. కలలు రావడం అనేది కొన్ని పరిణామాలకు సంకేతం కావచ్చని స్వప్న శాస్త్రం చెబుతోంది. రాత్రి నిద్రిస్తున్న వ్యక్తి చూసే కలలు శుభప్రదమైన లేదా అశుభకరమైన భవిష్యత్తును సూచిస్తాయని అంటోంది. స్వప్న శాస్త్రం గురించి అవగాహన ఉన్నవారికే ఇవి తెలుస్తాయి. గురువారం రాత్రి వచ్చే కలల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గురువారం రాత్రులలో వచ్చే కలలు అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. గురువారం రాత్రులలో వచ్చే కల.. విష్ణువు లేదా దేవతల గురువు అయిన బృహస్పతికి సంబంధించిన కల అయితే త్వరలోనే మీ కోరిక నెరవేరుతుందని సూచిస్తుంది. గురువారం రాత్రి కలలు బృహస్పతి ఆశీర్వాదాలను రూపొందడంతో ముడిపడి ఉన్నాయి.

గురువారం రాత్రి వచ్చే ఈ కలలు అశుభానికి సంకేతం

గురువారం రాత్రి కలోల వచ్చే సంకేతాల గురించి స్వప్నశాస్త్రం పలు ఆసక్తికర విషయాలను తెలియజేసింది. గురువారం రాత్రి కలలో వచ్చే కొన్ని సంకేతాలు అశుభకరమైనవని చెబుతోంది. ముఖ్యంగా ఆ కలలు బ్రహ్మ ముహూర్తం దగ్గర సంభవిస్తే.. రాబోయే కాలాల గురించి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈ అశుభ కలలు లేదా సంకేతాల గురించి స్వప్న శాస్త్రం ప్రకారం తెలుసుకుందాం.

కలలో మరణం, దంతాలు ఊడిపోవడం..

గురువారం రాత్రి ఆకస్మిక మరణం గురించి కలలు కనడం, శ్మాశాన వాటికలో లేదా భయంకరమైన ప్రదేశంలో మిమ్మల్ని మీరు చూడటం, మీ దంతాలు పోగొట్టుకోవడం లేదా విరగడం, అకస్మాత్తుగా భారీ వర్షం లేదా తుఫానును చూడటం లేదా గాయపడిన, చనిపోయిన జంతువును చూడటం.. చాలా అశుభకరమైనవిగా భావిస్తారు. ఈ సంకేతాలు రాబోయే ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు లేదా ఏదైనా నష్టాన్ని సూచిస్తాయి. ముఖ్యంగా ఈ కలలు బ్రహ్మ ముహూర్తం సమయంలో వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలని స్వప్నశాస్త్రం చెబుతోంది. ఇష్ట దైవారాధన చేయాలని సూచిస్తోంది.

Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9తెలుగు దీనిని ధృవీకరించదు.