AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varahi: ఈ రోజున వారాహి అమ్మవారిని పూజిస్తే మీకు తిరుగుండదు!

Goddess Varahi: వారాహి అమ్మవారు హిందూ దేవతలలో అత్యంత శక్తివంతమైన దేవత. భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని, శత్రు బాధల నుంచి రక్షణ కలుగుతుందని విశ్వాసం. ముఖ్యంగా కృష్ణపక్ష పంచమి రోజున ఆమెను పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయి. ఈ అమ్మవారిని పూజించడం వల్ల ప్రతికూలతలు తొలగిపోతాయి.. మీ జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు.

Varahi: ఈ రోజున వారాహి అమ్మవారిని పూజిస్తే మీకు తిరుగుండదు!
Varahi Ammavaru
Rajashekher G
|

Updated on: Jan 08, 2026 | 11:26 AM

Share

వారాహి అమ్మవారు.. హిందూ దేవీదేవతలలో శక్తివంతమైన దేవత. ఆమెను భక్తిశ్రద్ధలతో కోరుకుంటే ఖచ్చితంగా వారి కోరికలను తీరుస్తారని ప్రసిద్ధి. శత్రు బాధల నుంచి కూడా ఈ అమ్మవారు విముక్తి కల్పిస్తారు. ఇక, కృష్ణపక్ష పంచమి రోజున వారాహి అమ్మవారిని పూజించడం సర్వశుభాలను తీసుకువస్తుంది.

ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్యలు పరిష్కారం కాకపోవడం, అప్పులు తీరకపోవడం, తరచూ మిమ్మల్ని సమస్యలు ఇబ్బంది పెడుతుంటే.. మీరు తప్పకుండా వారాహి అమ్మవారి పూజ చేయాలి. శ్రీ విష్ణువుకు చెందిన వారాహ అవతార శక్తి నుంచి ఉద్భవించిన అమ్మవారే వారాహి దేవీ. ఈ అమ్మవారిని పూజించడం వల్ల ప్రతికూలతలు తొలగిపోతాయి.. మీ జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు.

కృష్ణపంచమి రోజున వారాహి దేవి పూజతో అద్భుత ఫలితాలు

ఇక, కృష్ణపంచమి రోజున వారాహి దేవి పూజ చేయడం వల్ల అనుకున్న కార్యాలు పూర్తవుతాయి. వారాహి అమ్మవారిని పూజించడంతో మీకున్న శత్రు బాధలు కూడా తొలగిపోతాయి. అంతేగాక, రుణ విముక్తలవుతారు. ఈతి బాధలు తొలగిపోతాయి. వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా నరదృష్టి నుంచి విముక్తి లభిస్తుంది. మీకు చెడు కలిగించే మాంత్రిక శక్తులు కూడా మీపై పనిచేయవు.

వారాహి అమ్మవారు మాంత్రిక దోషాలను తొలగిస్తుంది. అడ్డంకులను, శత్రు బాధలను తొలగించి తన భక్తులను ఎల్లవేళలా కాపాడుతుంది. భక్తుల కోరికలు నెరవేర్చడంలో కల్పవృక్షంలా అమ్మవారు కరుణిస్తారు. అందుకే వారాహి దేవిని కృష్ణపక్ష పంచమి రోజున పూజించడం ఉత్తమమని చెబుతారు.

ఇంట్లో పంచ దీపాన్ని వెలిగించి.. వారాహి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. నైవేద్యంగా గారెలు, దానిమ్మ పండ్లు, పెరుగును సమర్పించవచ్చు. ఈ రోజున వారాహి అమ్మవారి ఆలయాలను దర్శించి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల మీపై వారాహి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. దీంతో అన్ని కష్టాలు తొలగిపోయి.. సానుకూల ఫలితాలను పొందుతారు.

Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది.

లండన్‌ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
లండన్‌ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
భీష్ముడు మకర సంక్రాంతి రోజే ఎందుకు మరణించాడో తెలుసా?
భీష్ముడు మకర సంక్రాంతి రోజే ఎందుకు మరణించాడో తెలుసా?
ప్రతి నెలా 5 వేల మంది రైడర్లను తొలగిస్తుంటాం..
ప్రతి నెలా 5 వేల మంది రైడర్లను తొలగిస్తుంటాం..
ఆగివున్న రైల్లో మంటలు..ముంబై విద్యావిహార్-కుర్లా మధ్య ఘటన..
ఆగివున్న రైల్లో మంటలు..ముంబై విద్యావిహార్-కుర్లా మధ్య ఘటన..
అమ్మబాబోయ్‌ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
అమ్మబాబోయ్‌ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్‌
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్‌
ఆ అంకుల్ నాతో అలా ప్రవర్తించేవారు.. తర్వాతే అర్థమైంది.. సీరియల్ న
ఆ అంకుల్ నాతో అలా ప్రవర్తించేవారు.. తర్వాతే అర్థమైంది.. సీరియల్ న
నాకు మరో భార్య కావాలి.. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి వ్యక్తి హంగామా
నాకు మరో భార్య కావాలి.. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి వ్యక్తి హంగామా
తెల్లవారుజామున పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికులు
తెల్లవారుజామున పూరి - తిరుపతి రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికులు
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్..
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్..