చిత్రగుప్తుడు యముడికి అసిస్టెంట్ ఎలా అయ్యాడు? ఆ జాబ్ ఎవరు ఇచ్చారో తెలుసా?
Chitragupta: భూమిపై పుట్టిన ప్రతి జీవికి మరణం అనివార్యం. మరణానంతరం ఆత్మ మరో లోకానికి ప్రయాణిస్తుంది. హిందూ శాస్త్రాల ప్రకారం, పుణ్యాత్ములు స్వర్గానికి, పాపాత్ములు నరకానికి వెళతారు. ప్రతి ఆత్మ యమలోకంలో తమ పాప–పుణ్యాల లెక్క తెలుసుకుంటుంది. పాప, పుణ్యాలు లెక్కించడం, ఎవరి ప్రాణాలు ఎప్పుడు తీయాలో చిత్రగుప్తుడు తన వద్ద ఉన్న పుస్తకం ద్వారా నిర్ణయిస్తారు.

భూమిపై పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. మరణించిన తర్వాత శరీరం నుంచి ఆత్మ మరో లోకానికి వెళ్లిపోతుంది. హిందూ శాస్త్రాల ప్రకారం మరణం తర్వాత పుణ్యం చేసిన వారి ఆత్మలు స్వర్గానికి, పాపం చేసిన వారి ఆత్మలు నరకానికి వెళతాయి. మరణించిన తర్వాత ప్రతీ ఆత్మ యమలోకంలోకి వెళుతుంది. అక్కడ ఆత్మలు చేసిన పాప పుణ్యాలు లెక్కలు తేలుస్తారు.
విశ్వంలోని ప్రతీ ఒక్క ఆత్మ లెక్కలను తన పుస్తకంలో రాసే వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనే చిత్రగుప్తుడు. అతడ్ని యమరాజు (యముడు)కి సహచరుడు అని పిలుస్తారు. మంచి, చెడు, పాపం, పుణ్యం ఇలా అన్నింటినీ రికార్డు చేస్తారు చిత్రగుప్తుడు. పురాణాలోల చిత్రగుప్తుడికి సంబంధించిన అనేక కథలు ఉన్నాయి. కానీ, యముడికి చిత్రగుప్తుడు సహచరుడు ఎలా అయ్యారు? ఆత్మల లెక్కలు గణించే ఆ పని ఆయనకు ఎలా అప్పగించారు? ఆయన ఆత్మల లెక్కలు ఎలా వేస్తారు? అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందా.
చిత్రగుప్తుడు ఎవరు?
చిత్రగుప్తుడిని మరణ దేవుడు లేదా దేవతల లెక్కల అధికారి అయిన యమరాజు సహాయకుడిగా చెబుతారు. అతని పాత్ర న్యాయమూర్తి పాత్ర. మానవులు వ్యక్తిగతంగా చేసే చర్యలు ప్రపంచం దృష్టి నుంచి దాగి ఉండవచ్చు కానీ.. చిత్రగుప్తుడి నుంచి కాదనే విషయం గుర్తుంచుకోవాలి. చిత్రగుప్త అనే పదం రెండు పదాల నుంచి ఉద్భవించింది. చిత్ర, గుప్త. చిత్ర అంటే కనిపించేది, గుప్త అంటే దాచబడింది.
బ్రహ్మ శరీరం నుంచి జన్మించిన చిత్రగుప్తుడు
పురాణాల ప్రకారం.. మానవల చర్యల నైతికతపై తుది నిర్ణయం తీసుకునే దూరదృష్టి చిత్రగుప్తుడికి మాత్రమే ఉంది. మానవ చర్యలలో ఏవి ధర్మమైనవి? ఏవి పాపమైనవిగా పరిగణించబడతాయో ఆయనే నిర్ణయిస్తాడు. సృష్టి ప్రారంభంలో ధర్మం, అధర్మం మధ్య సమతుల్యత దెబ్బతినడం చూసిన బ్రహ్మ.. బిలియన్ల జీవుల చర్యల రికార్డును ఎలా భద్రపర్చాలో తెలియక అయోమయంలో పడ్డాడు.
ఆ తర్వాత బ్రహ్మ వేల సంవత్సరాలు కఠినమైన తపస్సు, ధ్యానంలో మునిగిపోయారు. ఈ సమయంలో ఒక కలం, సిరాకుండను మోసుకెళ్లే ఒక ప్రశాంతమైన వ్యక్తి అతని శరీరం నుంచి ఉద్భవించాడు. అతను బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించినందునే అతడ్ని ‘కాయస్థ’ అని కూడా పిలుస్తారు. ఆయన అజ్ఞాతంగా కనిపించిన కారణంగా అతడికి ‘చిత్రగుప్తుడు’ అని పేరు పెట్టారు. బ్రహ్మ.. చిత్రగుప్తుడికి ‘అగ్రసంధాని’ అనే దైవిక రిజిస్టర్‌ను అప్పగించడంతోపాటు అన్ని జీవుల పుణ్య, పాప కర్మలను నమోదు చేసే బాధ్యతను అప్పగించారు బ్రహ్మ.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9తెలుగు ధృవీకరించదు.
