AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Magh Mela 2026: 44 రోజుల పండగ.. మాఘ మేళా, కుంభమేళా మధ్య తేడా తెలుసా?

మాఘ మేళా 2026 3 జనవరి పౌష్ పూర్ణిమతో ప్రారంభమై, 15 ఫిబ్రవరి 2026న మహాశివరాత్రి వరకు కొనసాగుతుంది. 44 రోజులపాటు జరుగే ఈ ఉత్సవంలో లక్షలాది భక్తులు ప్రయాగ్ రాజ్ వద్ద పవిత్ర స్నానాలు చేస్తారు. మాఘ మేళా, కుంభమేళా రెండూ ప్రయాగ్‌రాజ్‌లో జరిగే ఉత్సవాలే అయినా, వాటి సంప్రదాయాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Magh Mela 2026: 44 రోజుల పండగ.. మాఘ మేళా, కుంభమేళా మధ్య తేడా తెలుసా?
Magh Mela 2026
Rajashekher G
|

Updated on: Jan 08, 2026 | 1:41 PM

Share

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో గత సంవత్సరం మహా కుంభ మేళా జరగ్గా.. ఈ ఏడాది ప్రారంభంలోనే మరో ఉత్సవం జరుగుతోంది. అదే మాఘమేళా. జనవరి 3, 2026 పౌష్ పూర్ణమి రోజున మాఘమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 15, 2026న వచ్చే మహా శివరాత్రి వరకు కొనసాగుతుంది. 44 రోజులపాటు జరిగే ఈ ఉత్సవంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్ బాటపట్టారు.

సాధారణంగా మాఘమేళా, కుంభమేళాల ప్రత్యేకతలను గుర్తించడంలో ప్రజలు పొరపాటు పడుతూ ఉంటారు. ఎందుకంటే రెండూ కూడా ప్రయాగ్ రాజ్ నదుల సంగమం వద్దే జరుగుతాయి. పేర్లు, ప్రదేశాలు సారూప్యంగా ఉన్నప్పటికీ.. వాటి సంప్రదాయాలలో గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మాఘ మేళా 2026:

మాఘ మేళా: మాఘమేళా అనేది ప్రతి సంవత్సరం ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద జరిగే ప్రముఖ హిందూ ధార్మిక మేళా. ఈ మేళా పౌష పూర్ణిమ నుంచి ప్రారంభమై, మహాశివరాత్రి వరకు కొనసాగుతుంది.

కుంభమేళా: ఇది ప్రతి సంవత్సరం జరగదు. పూర్తి కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.

కల్పవాల సంప్రదాయం

మాఘ మేళా ముఖ్యంగా కల్పాలకు ప్రసిద్ధి చెందింది. మాఘ మేళా సయయంలో కల్పవాసి(యాత్రికులు) అని పిలవబడే భక్తులు ఒక నెలపాటు త్రివేణి సంగమం ఒడ్డున గుడారాలలో నివసిస్తారు. వారు సాత్విక ఆహారం తింటారు. నేలపైనే నిద్రిస్తారు. ప్రతిరోజూ తెల్లవారుజామున స్నానం, మూడు సార్లు ధ్యానం చేస్తారు.

కుంభమేళాలో కూడా కల్పవాలు జరుగుతాయి. కానీ, కుంభమేళాలో ప్రధాన ఆకర్షణ రాజస్నానం, అఖాడాల నుంచి సాదువులు, రుషులు రావడం ఉంటుంది. అఘోరాలు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు.

రాజ స్నానాలు కుంభమేళా: కుంభామేళా సమయంలో 12 అఖాడాల(మత సమూహాు) నుంచి సాదువులు, రుషులు రాజ ఊరేగింపుగా వచ్చి పాల్గొంటారు. ప్రత్యేక తేదీలలో రాజస్నానం చేస్తారు. ఇది కుంభమేళా అత్యంత ప్రముఖ లక్షణం.

మాఘ మేళా: ఈ మేళాలలో అఖాడాల కార్యకలాపాలు లేదా కుంభమేళా లాంటి రాజ స్నానాల సంప్రదాయం లేదు. ఇక్కడ ప్రధాన దృష్టి సాధారణ యాత్రికులు, కల్పవాసుల భక్తిపై ఉంటుంది.

మతపరమైన గుర్తింపు: కుంభమేళా: మత విశ్వాసాల ప్రకారం.. సముద్ర మథనం సమయంలో ప్రయాగ్‌రాజ్‌తో సహా నాలుగు ప్రదేశాలలో అమృత బిందువులు పడ్డాయి. అందువల్ల.. కుంభమేళా నిర్దిష్ట గ్రహ స్థానాల ఆధారంగా జరుగుతుంది. దీని పరిధి ప్రపంచ వ్యాప్తంగా ఉంది. మాఘ మేళా: ఇద సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించడం, మాఘ మాసం మతపరమైన ప్రాముఖ్యత ఆధారంగా ఉంటుంది. దీనిని మినీ కుంభమేళా అని కూడా అంటారు. కానీ, ఇది ప్రధానంగా స్థానిక, ప్రాంతీయ నమ్మకాలపై దృష్టి ఉంటుంది.

2026 మాఘమేళా: స్నానం ఆచరించేందుకు ప్రధాన తేదీలు:

పౌష్ పూర్ణిమ (ప్రారంభం) 3 జనవరి 2026 మకర సంక్రాంతి జనవరి 14, 2026 న మౌని అమావాస్య జనవరి 19, 2026 బసంత్ పంచమి జనవరి 23, 2026 మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 2, 2026 న వస్తుంది. మహాశివరాత్రి (ముగుస్తుంది) ఫిబ్రవరి 15, 2026.

ఇస్త్రీ లేకుండానే పర్ఫెక్ట్ లుక్!ఈ ట్రిక్‌తో టైమ్‌, డబ్బు ఆదా
ఇస్త్రీ లేకుండానే పర్ఫెక్ట్ లుక్!ఈ ట్రిక్‌తో టైమ్‌, డబ్బు ఆదా
యంగ్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!
యంగ్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!
పాకిస్థాన్‌లో ‘హైదరాబాద్’ టీం.. యూఎస్ ‘కావ్యపాప’ మాస్టర్ ప్లాన్
పాకిస్థాన్‌లో ‘హైదరాబాద్’ టీం.. యూఎస్ ‘కావ్యపాప’ మాస్టర్ ప్లాన్
మళ్లీ షాకిచ్చిన బంగారం, 3 గంటల్లోనే భారీగా పెరిగిన ధరలు
మళ్లీ షాకిచ్చిన బంగారం, 3 గంటల్లోనే భారీగా పెరిగిన ధరలు
క్రెడిట్ కార్డు నుండి నగదు ఉపసంహరించుకుంటున్నారా? జాగ్రత్త!
క్రెడిట్ కార్డు నుండి నగదు ఉపసంహరించుకుంటున్నారా? జాగ్రత్త!
సింక్ అవుతున్న గ్లోబల్ సిటీస్.. ప్రమాదంలో ఈ భారత నగరాలు!
సింక్ అవుతున్న గ్లోబల్ సిటీస్.. ప్రమాదంలో ఈ భారత నగరాలు!
జన నాయగన్ విడుదలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..
జన నాయగన్ విడుదలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..
యాక్షన్ క్వీన్‏లా సమంత.. మా ఇంటి బంగారం.. టీజర్
యాక్షన్ క్వీన్‏లా సమంత.. మా ఇంటి బంగారం.. టీజర్
మీరు ఆర్వో వాటర్ తాగుతున్నారా.. ఇది తెలియకపోతే పాయిజన్ తాగినట్టే!
మీరు ఆర్వో వాటర్ తాగుతున్నారా.. ఇది తెలియకపోతే పాయిజన్ తాగినట్టే!
రాత్రి, పగులనే తేడానే లేదు.. ఆ గ్రామంలో క్షణక్షణం భయం భయం
రాత్రి, పగులనే తేడానే లేదు.. ఆ గ్రామంలో క్షణక్షణం భయం భయం