AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashifal: మరికొద్ది రోజులు ఓపిక పట్టండి.. ఈ రాశులకు లక్కు కిక్కు ఖాయం!

జనవరిలో వచ్చే సంక్రాంతి పండగతో పాటు సూర్యుడు జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు మకర రాశిలో సంచరిస్తూ కొందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు తీసుకొస్తున్నాడు. సూర్యుడు మకరంలో శత్రు స్థితిలో ఉన్నప్పటికీ, మేషం, వృషభం, కర్కాటకం, తులా, ధనస్సు, మీన రాశులకు ఈ సమయంలో శుభఫలితాలు, రాజయోగం కలగనుంది.

Rashifal: మరికొద్ది రోజులు ఓపిక పట్టండి.. ఈ రాశులకు లక్కు కిక్కు ఖాయం!
Rashifal
Rajashekher G
|

Updated on: Jan 09, 2026 | 11:54 AM

Share

జనవరిలో వచ్చే పెద్ద పండగ సంక్రాంతి పలు రాశులకు అదృష్టాన్ని తీసుకురాబోతోంది. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు సూర్యుడు మకర రాశిలో సంచరిస్తాడు. మకర రాశి సూర్యుడికి శత్రువు  అయినప్పటికీ.. కొన్ని రాశులకు రాజయోగం ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, తులా, ధనస్సు, మీన రాశులకు మకరంలోని సూర్యుడు అనేక శుభ ఫలితాలను అందిస్తున్నాడు.

శక్తి సంపద, హోదా, ప్రభుత్వానికి సూర్యుడు బాధ్యత వహిస్తాడు. అందుకే ఈ రాశులవారు ఫిబ్రవరి 16 వరకు ఈ అంశాలలో అపూర్వమైన వృద్ధిని పొందుతారు. ఆయా రాశుల పొందే అదృష్టమైన ఫలితాలను ఇప్పుడు చూద్దాం.

మేష రాశి: సూర్యుడు పదవ ఇంట్లో సంచరిస్తున్నందున ఈ రాశి వారిపై బలమైన సానుకూల ప్రభావం ఉంటుంది. దీని కారణంగా పనిలో ఖచ్చితంగా శక్తి ప్రభావం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే వారు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో గొప్ప విజయాన్ని సాధించే అవకాశం ఉంది. తండ్రివైపు నుంచి ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి. రాజకీయ ప్రభావం పెరుగుతుంది. ప్రముఖులతో సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ప్రయోజనాలుంటాయి.

వృషభ రాశి: ఈ రాశికి చాలా శుభప్రదమైన సూర్యుడు శుభస్థానంలో సంచరిస్తుండటం వల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. పనిలో అధికార యోగం ఉంటుంది. మీ స్వంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది. వ్యాపారం, పని కోసం మీరు విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. విదేశీ ఆదాయాన్ని ఆస్వాదించే యోగం ఉంది. పూర్వీకుల ఆస్తులను పొందే అవకాశం కూడా ఉంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే, సూర్యుడు ధనానికి అధిపతి అయిన ఏడవ ఇంట సంచరిస్తున్నాడు. ఆదాయం, వృత్తి, పనిలో చేసే ఏ చిన్న ప్రయత్నమైనా రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. ప్రభుత్వ విధుల నుంచి లాభం ఉంటుంది. మీరు మీ తండ్రి నుంచి ఆస్తిని పొందుతారు. వృత్తి, వ్యాపారంలో మీకు పెద్ద లాభాలు వస్తాయి. పనిలో మీ హోదా పెరుగుతుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కరించబడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి.

తులా రాశి: ఈ రాశి వారికి నాల్గవ ఇంట సూర్యుడు సంచరించడం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కరమవుతాయి. మీరు ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు. ప్రభుత్వం నుంచి మీకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. శుభప్రదమైన విషయాలు జరుగుతాయి. కెరీర్, వ్యాపారం కొత్త శిఖరాలకు చేరుకుంటాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం అనేక విధాలుగా పెరుగుతుంది.

ధనస్సు రాశి: ఈ రాశి అదృష్ట అధిపతి సూర్యుడు తన స్థానంలో సంచరిస్తున్నందన.. వీరికి పదోన్నతులు, జీతాలు, ప్రయోజనాలు లభిస్తాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఆర్థిక లాభాలు అంచనాలకు మించి ఉంటాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా విజయవంతమవుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీకు వంవపారంపర్య సంపద అందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కరమవుతాయి. గృహ యోగం కూడా ఉంది.

మీన రాశి: ఈ రాశి ప్రయోజనకరమైన స్థానంలో సూర్యుడు సంచరించడం వలన జాతకంలోని ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ముఖ్యంగా నెల మొదటి రోజున శని దోషం బాగా తగ్గుతుంది. ఆదాయం రోజురోజుకూ పెరుగుతుంది. ఆస్తుల విలువ గణనీయంగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వ్యాపారం, ఉద్యోగాలలో ఆశించిన ప్రమోషన్లు సంభవిస్తాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.