Aarti Rules: పూజ సమయంలో హారతి ఎందుకు ఇస్తారు.. ఏ సమయంలో ఇవ్వాలి.. నియమాలు మీ కోసం..

హిందూ విశ్వాసం ప్రకారం ఆరతి ఇవ్వని  ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో పూజలో భాగంగా భగవంతుడి ముందు దీపం వెలిగించి పూజను మొదలు పెట్టాలి. చివరిగా ఆరతి ఇచ్చి పూజను ముగించాలి. ఈ నేపథ్యంలో ఈరోజు హారతి ఇచ్చే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

Aarti Rules: పూజ సమయంలో హారతి ఎందుకు ఇస్తారు.. ఏ సమయంలో ఇవ్వాలి.. నియమాలు మీ కోసం..
Puja Aarti Rules
Follow us
Surya Kala

|

Updated on: May 04, 2023 | 11:10 AM

సనాతన హిందూ సంప్రదాయంలో భగవంతుని ఆరాధన చాలా ముఖ్యమైనది. హిందువుల విశ్వాసం ప్రకారం ప్రతిరోజూ ఉదయం కుల  ఇష్టమైన దేవుడిని పూజిస్తే, దేవుని ఆశీర్వాదం కుటుంబంపై ఉంటాయని.. విశ్వాసం. తనను కోరి కొలిచే భక్తుల ఇంట సంతోషం, శ్రేయస్సు , అదృష్టాన్ని ఇచ్చే భగవంతుని ఆరాధనకు కూడా కొన్ని నియమాలు రూపొందించబడ్డాయి. హిందూ విశ్వాసం ప్రకారం ఆరతి ఇవ్వని  ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో పూజలో భాగంగా భగవంతుడి ముందు దీపం వెలిగించి పూజను మొదలు పెట్టాలి. చివరిగా ఆరతి ఇచ్చి పూజను ముగించాలి. ఈ నేపథ్యంలో ఈరోజు హారతి ఇచ్చే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

పూజలో ఆరతి ఎప్పుడు ఇవ్వాలంటే: భగవంతుని ఆరాధనలో హారతి చాలా ముఖ్యమైనది. పూజ ముగింపులో ఎల్లప్పుడూ నిర్వహిస్తారు. అంతేకాదు ఉదయం, సాయంత్రం దైవాన్ని పూజించే సమయంలో ప్రతిరోజూ హారతి చేయవచ్చు. వీలైతే రోజుకు ఐదుసార్లు దేవుడికి ఆరతి ఇవ్వవచ్చు.

ఆరతి ఎలా ఇవ్వాలంటే: 

ఇవి కూడా చదవండి

దేవుడికి హారతి ఇచ్చే సమయంలో మీ విశ్వాసం, నమ్మకం లేదా పూజా పద్ధతి ప్రకారం దీపాన్ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు.. మీరు ఒక వత్తి వెలిగించే దీపాన్ని లేదా ఐదు లేదా ఏడు వత్తులతో దీపం ఎంచుకోవచ్చు. అదేవిధంగా నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించవచ్చు. ఇంట్లో పూజ చేస్తున్న సమయంలో ఇచ్చే హారతిని ముందుగా నాలుగు సార్లు దేవుడి పాదాల వైపు, రెండుసార్లు నాభి వైపు .. చివరిగా ఒకసారి దైవం ముఖం వైపు తిప్పడం ద్వారా ఆరతిని పూర్తి చేయాలి. అయితే హారతి ఇచ్చే సమయంలో దీపం తో మాత్రమే కాదు.. హారతిని కర్పూరం ఉపయోగించి కూడా ఇవ్వవచ్చు.

హారతి ఇచ్చే సమయంలో పాటించాల్సిన నియమం  భగవంతుని పూజలో..నిలబడి ఆరతి ఇవ్వాలనే నియమం ఎప్పుడూ ఉంటుంది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో,  కూర్చుని కూడా ఆరతి ఇవ్వవచ్చు. హిందూ విశ్వాసం ప్రకారం.. శారీరకంగా నిలబడలేకపోతే లేదా అనారోగ్యంతో ఉంటే దేవునికి క్షమాపణలు చెబుతూ కూర్చొని ఆరతి ఇవ్వొచ్చు. నిర్మలమైన హృదయంతో ఇచ్చే హారతి అన్ని దుఃఖాలను తొలగిస్తుందని.. దేవుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

ఆరతి ఇచ్చే సమయంలో ఈ నియమాలను గుర్తుంచుకోండి ఆరతి ఇచ్చిన అనంతరం భక్తుడు లేదా ఇతర వ్యక్తులు నేరుగా ఆరతిని తీసుకోకూడదు. ఆరతి ఇచ్చిన అనంతరం ముందుగా నీటిని దీపం దగ్గర వేయాలి. దీని తరువాత పూజ పవిత్ర జలాన్ని అందరిపై చల్లాలి. దీని తరువాత, ఆరతి ఇచ్చిన వ్యక్తి మొదట ఆరతి తీసుకోవాలి, తరువాత అతను ఆరతిని అందరికి దర్శించుకునే విధంగా చూపించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..