సీతా,రాముల వివాహ సమయంలో వారి వయసు ఎంత..? ఇద్దరి మధ్య ఎన్ని సంవత్సరాలు తేడా..!

Sita And Ram Marriage : రామాయణంలోని ప్రతి పాత్ర ప్రజల మనస్సులలో చెరగని ముద్ర వేసింది. రాముడికి సంబంధించి

సీతా,రాముల వివాహ సమయంలో వారి వయసు ఎంత..? ఇద్దరి మధ్య ఎన్ని సంవత్సరాలు తేడా..!
Sita And Ram
Follow us
uppula Raju

|

Updated on: May 10, 2021 | 2:47 PM

Sita And Ram Marriage : రామాయణంలోని ప్రతి పాత్ర ప్రజల మనస్సులలో చెరగని ముద్ర వేసింది. రాముడికి సంబంధించి వేలాది పురాణాలు ఉన్నాయి. మనమందరం రామాయణ ధారావాహికను తెరపై చూశాం. అయితే దేవుని గురించి సందేహాలు మన మనస్సులో చాలా ఉన్నాయి. అలాంటి ఒక ప్రశ్న ప్రతి ఒక్కరి మనస్సులో తిరుగుతూనే ఉంటుంది. అది ఏమిటంటే రామ్.. సీతను వివాహం చేసుకున్నప్పుడు వారిద్దరి వయస్సు ఎంత?

సీత వివాహం కోసం ఏర్పాటు చేసిన స్వయంవరంలో శ్రీ రాముడు శివ ధనుస్సు విరిచేసి మాతా సీతను వివాహం చేసుకుంటాడు. రామ్‌చరిత్‌మనస్‌లో గోస్వామి తులసీదాస్ ఒక ద్విపద రాశారు. ఇది రాముడికీ, సీతకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తుంది. కానీ వివాహం సమయంలో వారిద్దరి వయస్సు గురించి వాల్మీకి రామాయణంలో తెలుస్తుంది.

గోస్వామి తులసీదాస్ జి రాసిన రామ్‌చరిత్‌మనస్‌లో ఒక ద్విపద ఉంది – “18 వ సంవత్సరం సియా, ఇరవై ఏడు రాముడు అని ఉంటుంది. శ్రీ రామ్, సీత యుగాల మధ్య సుమారు 9 సంవత్సరాల తేడా ఉందని ఈ ద్విపద వల్ల తెలుస్తుంది. అయితే వివాహం సమయంలో రాముడి వయస్సు 13 సంవత్సరాలు, తల్లి సీత వయస్సు 6 సంవత్సరాలు అని వాల్మీకి రామాయణంలో చెప్పబడింది.

వాల్మీకి రామాయణం ప్రకారం.. 18 సంవత్సరాల వయస్సులో తల్లి సీత రాముడితో కలిసి అడవికి వెళ్ళింది. ఆమె 14 సంవత్సరాల తరువాత వనవాసం నుంచి తిరిగి వచ్చి 33 సంవత్సరాల వయసులో అయోధ్యకు రాణి అయింది. వాల్మీకి రామాయణం ఆరణ్యకాండలో రాముడు, తల్లి సీత వయస్సు గురించి ఒక సందర్భం ఉంది. ఈ సందర్భంలో సన్యాసిగా వచ్చిన రావణుడికి సీత తనను తాను పరిచయం చేసుకుంటుంది.

వివాహం తర్వాత 12 సంవత్సరాలు ఇక్ష్వాకువంషి మహారాజ్ దశరథ ప్యాలెస్‌లో బస చేసిన తరువాత నా భర్తతో అన్ని ఆనందాలను అనుభవించానని సీత రావణుడితో చెబుతుంది. నేను ఎల్లప్పుడూ అక్కడ ఆనందాలతో ఆశీర్వదించబడ్డాను అంటుంది. ఆ తర్వాత ఆమె అడవికి వెళ్ళేటప్పుడు నా భర్తకు 25 సంవత్సరాలు, నేను పుట్టినప్పటి నుంచి అడవికి బయలుదేరే సమయం వరకు నా లెక్క ప్రకారం 18 సంవత్సరాలు అయ్యింది అని చెబుతుంది.

కరోనాతో పీయూష్ చావ్ల తండ్రి మృతి.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటన.. పలువురి ఆటగాళ్ల సంతాపం..

Viral Video: పరుగో పరుగు.! గజరాజులను చూసి భయంతో లగెత్తిన సింహాలు.. వైరల్‌ వీడియో..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే