Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులకు కలిసి వస్తుందంటే..
Horoscope Today(October 31st 2021): కొందరు రోజుని మంచి చెడుల గురించి ఆలోచిస్తూ మొదలు పెడతారు. అంతేకాదు ఏ వస్తువులు ఏ కొత్త పనులు మొదలు..
Horoscope Today(October 31st 2021): కొందరు రోజుని మంచి చెడుల గురించి ఆలోచిస్తూ మొదలు పెడతారు. అంతేకాదు ఏ వస్తువులు ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా ఈరోజు మంచిదా కదా అని ఆలోచిస్తారు. తమ నక్షత్ర బలం ఎలా ఉంది.. రాశి ఫలాలు ఎలా ఉన్నాయో అంటూ దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆదివారం (అక్టోబర్ 31వ తేదీ) రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండడం మేలు చేస్తుంది. ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. ప్రయాణాలలో అప్రమత్తత అవసరం.. కొత్త పనులు చేపట్టేవారు వాయిదా వేసుకోవడం మంచిది.
వృషభ రాశి: ఈ రాశివారికి ఈరోజు వ్యాపార, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చేపట్టిన పనులు ఆలస్యంగా సఫలమవుతాయి.
మిధున రాశి: ఈరాశివారికి ఈరోజు సంతోషంగా గడుపుతారు. ఆర్ధిక ఇబ్బందులను అధిగమిస్తారు. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శుభవార్త వింటారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆరోగ్య బారిన పడే అవకాశం ఉంది. ధన వ్యయంతో రుణప్రయత్నాలను చేస్తారు. బంధు మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
సింహ రాశి: ఈరాశివారు ఈరోజు స్త్రీలు సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధన లాభం ఉంది. చేపట్టిన పనుల్లో విజయం సొంతం చేసుకుంటారు. క్రీడారులకు, రాజకీయ రంగాలలోని వారికీ ఈరోజు అనుకూలంగా ఉంది. బంధుమిత్రులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికీ అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారి కుటుంబం పరిస్థితి సంతోషాన్ని కలిగితుంది. అప్పులు తీరుస్తారు. స్త్రీలు, బంధుమిత్రులను కలిసి సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి.
ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశి వారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. చేపట్టిన పనులలో విజయంసొంతం చేసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి.
మకర రాశి: ఈరోజు ఈ రాశి వారు అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. మానసిక ఆందోళన కలుగుటఁది. వృత్తి రీత్యా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.
కుంభ రాశి: ఈరాశి వారు ఈరోజు అధిక వ్యయప్రయాసలకు గురవుతారు. స్వల్ప అనారోగ్య బారిన పడతారు.
మీన రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. స్త్రీల వలన లాభం పొందుతారు. రుణబాధలు తీరతాయి.. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
Also Read: అక్టోబర్ 31 నుంచి నవంబర్ 6 వరకు వార ఫలాలు.. వివిధ రాశుల వారికి ఎలా ఉందంటే..