Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: అక్టోబర్‌ 31 నుంచి నవంబర్ 6 వరకు వార ఫలాలు.. వివిధ రాశుల వారికి ఎలా ఉందంటే..

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు...

Weekly Horoscope: అక్టోబర్‌ 31 నుంచి నవంబర్ 6 వరకు వార ఫలాలు.. వివిధ రాశుల వారికి ఎలా ఉందంటే..
Weekly Horoscope
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 31, 2021 | 6:26 AM

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 23న ) శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషరాశి: ముఖ్యకార్యాల్లో శ్రద్ధ అవసరం, ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. ఒత్తిడి కలిగించే వారున్నారు. సంయమనాన్ని కోల్పోకూడదు. కుటుంబ సభ్యుల సలహాను ఆచరించాలి. సాంకేతికంగా ఎదుగుదలకు అవకాశముంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. సూర్యారాధన మంచిది. కొంత రుణ బాధలు తొలగుతుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. పట్టుదలతో పని పూర్తి చేయాలి. వ్యాపార లాభం సూచితం. ధనయోగం ఉండే అవకాశం ఉంది.

వృషభ రాశి: కార్యసిద్ధి సంతృప్తినిస్తుంది. ప్రతిదీ లోతుగా విశ్లేషించండి. ఉద్యోగఫలాలు అద్భుతంగా ఉంటాయి. అధికార లాభం ఉంటుంది. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఆపదల నుంచి బయటపడతారు. ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. శుభకార్యాలు జరుగుతాయి. ఇష్టదేవతారాధన శుభప్రదం. విలువైన వస్తువులు కొంటారు. గత బకాయిలు కొన్ని వనూలవుతాయి. గృహ భూ లాభాలు వస్తాయి.

మిథున రాశి: మనోబలం ముందుకు నడిపిస్తుంది. అడ్డంకులు తొలగుతాయి. అనుకున్నది సాధిస్తారు. కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తద్వారా సమాజంలో ఖ్యాతి లభిస్తుంది. స్థిర సంపాదన ఏర్పడుతుంది. సహోద్యోగులతో విభేదాలు రానీయవద్దు. భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి నిలపాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే శుభం కలుగుతుంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు.

కర్కాక రాశి: అనుకున్నది నెరవేరుతుంది. లక్ష్యం దగ్గరలోనే ఉంది. అఖండమైన ఖ్యాతి లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు సూచితం, తగు శ్రద్ధ వహించండి. సొంత నిర్ణయం కొంత శ్రమ కలిగిస్తుంది. వారం మధ్యలో ఒక అంశం సంతృప్తినిస్తుంది. వ్యయభారం పెరిగే అవకాశముంది. సకాలంలో నిర్ణయం తీసుకోవాలి. లక్ష్మీధ్యానంతో మంచి జరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకుంటే మంచిది.

సింహ రాశి: శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. కోరికలు నెరవేరతాయి. ఎటుచూసినా ఉత్తమ ఫలితమే గోచరిస్తోంది. ఉద్యోగంలో పెద్దల ప్రశంసలూ పదవీ లాభముంటాయి. పదిమందికీ ఉపయోగపడతారు. దైవానుగ్రహం లభిస్తుంది. వ్యాపారయోగం బాగుంది. ఇంట్లో వారికి మీ వల్ల మేలు జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు. విద్యార్ధులు ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూల సమయం. ఇంట్లో వారికి మీ వల్ల మేలు జరుగుతుంది.

కన్య రాశి: అదృష్టయోగముంది. సకాలంలో పనులు ప్రారంభించండి. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. వ్యాపారంలో మెలకువలు తెలుస్తాయి. ధనధాన్య లాభముంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. లక్ష్యాన్ని చేరేవరకు శాంతంగా వ్యవహరించాలి. ఆదిత్య హృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉండే అవకాశం ఉంటుంది. అధికారుల అనుగ్రహం లభించే అవకాశం ఉంది.

తుల రాశి: ఆర్థికాంశాలు శుభప్రదం.ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. సౌమ్యంగా పరిష్కరించండి. దేనికీ తొందరపడవద్దు. శాంతంగా ఆలోచించాలి. సహనానికి పరీక్షా కాలంగా అనిపిస్తుంది. ఒత్తిడిని జయించాలి. వారం మధ్యలో ఒక పనిలో లాభముంటుంది. విష్ణుమూర్తిని దర్శించండి, ఆశయం నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతాభావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి: మంచి కాలం నడుస్తోంది. అభీష్టసిద్ధి ఉంటుంది. ఉద్యోగరీత్యా అనుకూల సమయం. వ్యాపారంలో అధికలాభాలను పొందుతారు. ఇంటా బయటా కలిసివస్తుంది. పేరు ప్రతిష్ఠలుంటాయి. బంగారు భవిష్యత్తునిచ్చే గొప్ప పనులను ప్రారంభించండి. కాలం సహకరిస్తుంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయస్వామిని దర్శిస్తే మేలు. ఉద్యోగంలో అధికారుల నుంచి విపరీతంగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి: అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. సంపాదన స్థిరంగా ఉంటుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. వ్యాపారంలో జాగ్రత్త. గృహయోగం ఉంది. పరిస్థితులు చక్కబడతాయి. కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో శుభం జరుగుతుంది. ఒక వార్త శక్తినిస్తుంది. దుర్గాస్తుతితో కాలం ఆనందంగా గడుస్తుంది. కొత్త నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి.

మకర రాశి: కాలం మంచి పనులకు సహకరిస్తుంది. ముఖ్య కార్యాలను త్వరగా పూర్తిచేయండి. ఉద్యోగఫలితం శుభప్రదం. శాంత స్వభావంతో కార్యాలను సాధిస్తారు. దగ్గరివారి సలహాలు మేలుచేస్తాయి. కలహాలకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత విషయాలను ఇతరుల వద్ద ప్రస్తావించవద్దు. శివ నామ స్మరణతో అంతా మంచి జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

కుంభ రాశి: ఉత్సాహంగా పని ప్రారంభించాలి. తెలియని అవరోధాలుంటాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. ఉద్యోగంలో అనుకున్న ఫలితం వస్తుంది. చెడు ఊహించవద్దు. శ్రద్ధతో లక్ష్యాన్ని చేరాలి. కుటుంబ సభ్యుల సలహాతో సరైన నిర్ణయం తీసుకోండి. చిన్న పొరపాటు జరిగినా సమస్య చేయి దాటుతుంది. మొత్తంమీద కార్యసిద్ధికి అవకాశం ఉంటుంది. విష్ణుదర్శనం మేలు చేస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరఖర్చులు పెరిగిపోయే అవకాశం ఉంది.

మీన రాశి: అద్భుతమైన విజయం ఉంది. సకాలంలో పని పూర్తిచేస్తే విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఎదురుచూస్తున్న ఫలితం వస్తుంది. వ్యాపారంలో బాగుంటుంది. ధనలాభం ఉంది. ఎదుటివారు ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. సమయస్ఫూర్తి కాపాడుతుంది. నూతన కార్యాలకు బాటలు వేయండి, భవిష్యత్తులో చక్కని ఫలాలనిఇస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం. తలచిన పనులు పూర్తవుతాయి. అతి బెదార్యం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది.