AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Horoscope: రాశి ఫలాలు.. ఈ రోజు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందంటే..

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు...

Today Horoscope: రాశి ఫలాలు.. ఈ రోజు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందంటే..
Horoscope Today
Srinivas Chekkilla
|

Updated on: Oct 30, 2021 | 6:05 AM

Share

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 30న ) శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. ఓసారి తెలుసుకుందాం..

మేష రాశి: శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. మీ రాశికి చెందిన వ్యక్తులు భూమి నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో విజయం సాధించే అవకాశముంది. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

వృషభ రాశి: మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.అంతేకాకుండా మీ మాటలతో ప్రజల హృదయాలను ఆకర్షిస్తారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది.

మిథున రాశి: కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం. కుటుంబానికి దూరంగా ఉండేవారు ఈ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది.

కర్కాటక రాశి: శుభకాలం. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. మీ రాశికి చెందిన కొంతమంది వ్యక్తులు శారీరకంగా బలహీనతను అనుభవిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం పఠించాలి.

సింహరాశి: మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం శుభప్రదం.

కన్యరాశి: గొప్ప ఫలితాలను సాధిస్తారు. సుఖ సౌఖ్యాలు కలవు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.

తులరాశి: శుభకాలం. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. శ్రీమహాగణపతి ఆరాధన చేస్తే మంచిది.

వృశ్చిక రాశి: చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.

ధనస్సు రాశి: ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రారంభించబోయే పనుల్లో కుటుంబ సభ్యుల సహకారంతో మంచి ఫలితాలను సాధిస్తారు. శుభవార్తలు వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్ట దైవ దర్శనం శుభప్రదం.

మకర రాశి: ఈ రాశి ఈరోజు ఆప్తుల సహాయంతో ఒక పని పూర్తి చేసే అవకాశముంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

కుంభరాశి: అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.

మీనరాశి: మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. ఈ రోజు మీ రాశికి చెందిన కొంతమంది వ్యక్తులు మాతృ పక్షం నుంచి ధనలాభాలను పొందే అవకాశముంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు.