Horoscope Today: రాశి ఫలాలు.. చేపట్టే పనులలో పురోగతి లభిస్తుంది..!

Srinivas Chekkilla

Srinivas Chekkilla |

Updated on: Nov 26, 2021 | 6:21 AM

Today Horoscope: ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు...

Horoscope Today: రాశి ఫలాలు.. చేపట్టే పనులలో పురోగతి లభిస్తుంది..!
Today Horoscope

Follow us on

Today Horoscope: ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. శుక్రవారం (నవంబర్ 26న ) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి: అవసరానికి సహాయం చేసేవారున్నారు. శ్రమ అధికం అవుతుంది. తోటివారి సహకారంతో ఆపదలు తొలగుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. వ్యాపారులకు సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. శివారాధన చేస్తే కలిసొస్తుంది. సంఘంలో గౌర‌వ మ‌ర్యాద‌లుంటాయి.

వృషభ రాశి: అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యం ఫరవాలేదనిపిస్తుంది. వృత్తి నిపుణులకు పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. మానసికంగా దృఢంగా ఉంటారు. శ‌త్రు బాధ‌లుండ‌వు.

మిథున రాశి: ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేసి, వాటిని ప్రారంభిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. శ్రీ వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం పఠించడంతో శుభం కలుగుతుంది.

కర్కాటక రాశి: మనఃస్సౌఖ్యం ఉంది. ఉద్యోగులకు శుభకాలం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆంజనేయ స్తోత్రం పారాయణ మంచిది. ఆదాయం స్థిరంగా ఉంటుంది.

సింహ రాశి: శుభఫలితాలు సొంతం అవుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన మానవద్దు.

తుల రాశి: మంచి కాలం. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది. పాత స్నేహితులు పలకరిస్తారు.

వృశ్చిక రాశి: ప్రారంభించబోయే పనుల్లో తోటివారి సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు. ఐ.టి నిపుణులకు విదేశాల నుంచి శుభవార్త వింటారు.

ధనుస్సు రాశి: ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శరీర సౌఖ్యం కలదు. శివ నామాన్ని జపించండి.

మకర రాశి: ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. చాలాకాలంగా చేస్తున్న పెళ్లి ప్రయత్నం ఫలిస్తుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. నవగ్రహ స్తోత్రం చదివితే కలిసొస్తుంది.

కుంభ రాశి: శుభకాలం. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది.

మీన రాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణం చేస్తే మంచిది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu