AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (సెప్టెంబర్ 13వ వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Venkata Chari
|

Updated on: Sep 13, 2022 | 6:37 AM

Share

తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (సెప్టెంబర్ 13వ వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషరాశి..

ఈరోజు వీరు చేసే ప్రతి పనిలో అనుకూల ఫలితాల కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త పనులు ప్రారంభంచే ముందు చాలా ఆలోచనలు చేయాలి. వృత్తి, వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉండే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు ఇబ్బందిపెట్టిన, బయటపడతారు.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి..

ఈరోజు వీరికి చాలా ముఖ్యమైన రోజు. ఇష్టమైన దానిని కోల్పోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు మీ మాటలకు విలువ ఇస్తారు. మీరు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వారు మీ పనిని చెడగొట్టే అవకాశం ఉంది.

మిథునరాశి..

వీరికి అనుకూలమైన రోజు. కొత్త ఆర్థిక ప్రణాళికలో పెట్టుబటి పెట్టే అవకాశం ఉంది. మీ స్నేహితులు సహాయం కోసం మీ వద్దకు వస్తారు.

కర్కాటక రాశి

ఈ రోజు మీకు చాలా లక్ డే. కొత్త భూమి, వాహనం, ఇల్లు లాంటివి కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందుల సమస్య ఉండదు.

సింహరాశి..

ఈరోజు వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అది మీకు అనుకూలంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి కోసం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.

కన్య రాశి..

ఈరోజు వీరికి అనుకూలంగా ఉంటుంది. అయితే, ఆర్థిక పరిస్థితి ఆందోళనతో ఖర్చులపై ఓ కన్నేయండి. భవిష్యత్ కోసం కొంత డబ్బును దాచుకోవడం చాలా మంచిది.

తుల రాశి.

ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆదాయం పెరగడం వల్ల సంతోషం రెట్టింపు అవుతంది. బయటి ప్రదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి.

వృశ్చిక రాశి..

ఈరోజు వీరికి చేపట్టిన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువులు, మిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి.

ధనుస్సు రాశి..

ఈరోజు వీరికి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొంత నష్టం వచ్చే అవకాశం ఉంది.

మకర రాశి..

ఈరోజు వీరు చేపట్టిన పనిని సకాలంలో పూర్తిచేచేసేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. భాగస్వామితో వ్యాపారాలు చేసే వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్డిగా నమ్మితే చాలా ప్రమాదకరంగా మారుతుంది.

కుంభ రాశి..

ఈరోజు వీరు ఎంతో అనుకూలమైన రోజు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అయితే, లావాదేవీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు చేసే పనులు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి.

మీనరాశి..

ఈరోజు వీరికి చాలా మంచిరోజు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. అయితే, ఆర్థిక పరిస్థితి మాత్ర ఆందోళన కలిగిస్తుంది.