TTD: అలిపిరి తనిఖీ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి.. భక్తుల రద్దీతో బారులు తీరుతున్న వాహనాలు
కరోనా అనంతర పరిస్థితుల తర్వాత తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ అధికమవుతోంది. వారాంతాల్లో భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొవిడ్ కారణంగా ప్రజా రవాణా వాహనాల కంటే సొంత వాహనాల్లో ప్రయాణించేందుకే...
కరోనా అనంతర పరిస్థితుల తర్వాత తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ అధికమవుతోంది. వారాంతాల్లో భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొవిడ్ కారణంగా ప్రజా రవాణా వాహనాల కంటే సొంత వాహనాల్లో ప్రయాణించేందుకే భక్తులు(Devotees) ఆసక్తి చూపుతున్నారు. దీంతో అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. టీటీడీ భద్రత సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండటంతో వాహనాలు బారులు తీరుతున్నాయి. కరోనా(Corona) కు ముందు తిరుమలకు రోజూ 1,500 ట్రిప్పులు ఆర్టీసీ బస్సులు నడిచేవి. భద్రత సిబ్బంది పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తున్నా అప్పుడప్పుడూ వీరి కళ్లు కప్పేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. వాహనాల్లో మద్యం బాటిళ్లు, సిగరెట్ ప్యాకెట్లతో పాటు కొన్ని సందర్భాల్లో తుపాకీ సైతం తరలించే ప్రయత్నాలు చేశారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆలయంలో ఇతర సేవలను సైతం పునఃప్రారంభించనుండటంతో భక్తుల సంఖ్య మరింత పెరగనుంది. అప్పుడు భద్రత సిబ్బందిపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
వాహనాల్లో ఉండే వస్తువులను గుర్తించేందుకు అలిపిరి కేంద్రం వద్ద ప్యాసింజర్ వెహికల్ స్కానర్లను ఏర్పాటు చేయాలని భావించారు. అయితే లగేజీ స్కానర్ల వినియోగానికి మాత్రమే అనుమతి ఉంది. వీటి ద్వారా వాహనాల్లో ఉన్న వస్తువులను సులువుగా స్కానింగ్ చేయవచ్చు. నిషేధిత వస్తువులను తరలించేందుకు ప్రయత్నిస్తే వెంటనే పట్టుకునే వీలుంటుంది. వీటి ఉపయోగంపై తుది నిర్ణయం తీసుకోలేదు. వీటి ఏర్పాటుకు కేంద్ర అటామిక్ ఎనర్జీ విభాగం అనుమతి తప్పనిసరి కావడంతో ఏర్పాటు కష్టసాధ్యమని అధికారులు అంటున్నారు.
Also Read
Crime News: ఎస్ఐ బైక్ లాక్కుని, కొట్టారంటూ యువకుడి ఆత్మహత్య.. నిర్మల్ జిల్లాలో టెన్షన్!
Ambrane Fitshot Surge: మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్ వాచ్.. రూ. 2వేల లోపు ఆకట్టుకునే ఫీచర్లు..
Andhra Pradesh: పలమనేరు విద్యార్థిని కేసులో సంచలన విషయాలు.. టాపర్ గా ఉండటమే శాపమైందా..?