AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Jayanti: హనుమాన్ జయంతిన ఈ మంత్రం జపించండి.. ఎటువంటి కష్టాలనుంచైనా రక్షణ లభిస్తుంది..

చైత్ర మాసం పౌర్ణమి తిథి రోజున హనుమంతుడి పూజ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హనుమాన్ ఆరాధనతో ముడిపడి ఉన్న ఈ పండుగలో.. ఆంజనేయ మంత్రాలను పఠించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

Hanuman Jayanti: హనుమాన్ జయంతిన ఈ మంత్రం జపించండి.. ఎటువంటి కష్టాలనుంచైనా రక్షణ లభిస్తుంది..
Lord Hanuman Puja
Surya Kala
|

Updated on: Apr 03, 2023 | 4:22 PM

Share

హిందూ మతంలో శక్తికి మూలంగా భావించే హనుమంతుడిని ఆరాధిస్తే అన్ని కష్టాల నుండి రక్షణ లభిస్తుందని విశ్వాసం. మానవ జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా భక్తి , విశ్వాసంతో వాయు నందనుడు హనుమంతుడిని పూజిస్తే .. ఆ భక్తుడిని రక్షిస్తాడని నమ్మకం. హనుమంతుడి జయంతిని భక్తులు పవిత్రంగా జరుపుకుంటారు. చైత్ర మాసం పౌర్ణమి తిథి రోజున హనుమంతుడి పూజ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హనుమాన్ ఆరాధనతో ముడిపడి ఉన్న ఈ పండుగలో.. ఆంజనేయ మంత్రాలను పఠించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. రామ భక్త హనుమాన్ నుంచి కోరుకున్న వరాన్ని పొందగల అద్భుత మంత్రం గురించి వివరంగా తెలుసుకుందాం..

హనుమాన్ జయంతి రోజున తమ కష్టాలు తీర్చమని సరళ మంత్రమైన ‘ఓం శ్రీ హనుమతే నమః’ లేదా ‘ఓం హనుమతే నమః’ అనే మంత్రాన్ని పూర్తి భక్తి, విశ్వాసంతో జపించండి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా.. భజరంగ బలి తన భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడని.. ఎటువంటి కోరికలైనా రెప్పపాటులో నెరవేరతాయని నమ్మకం. ఈ మంత్రానికి చాలా శక్తి ఉందని నమ్ముతారు. ఎటువంటి పెద్ద సమస్యలైనా సులభంగా పరిష్కరించబడతాయి. సాధకుడికి ఆనందం, శ్రేయస్సు, అదృష్టం లభిస్తాయి.

కోరిక నెరవేర్చే మంత్రం హిందువుల విశ్వాసం ప్రకారం.. ఒక భక్తుడు హనుమంతుడిని పూజిస్తూ.. మనస్ఫూర్తిగా క్రింది మంత్రాన్ని జపిస్తే.. అతని ఎటువంటి కోరికైనా త్వరలో నెరవేరుతుంది. బజరంగి బలి మంత్రాన్ని జపించిన వ్యక్తి బలం, తెలివి, జ్ఞానాన్ని వరంగా పొందుతాడు. హనుమంతుడి దయతో.. అతని పనులన్నీ అనుకున్న సమయం కంటే ముందే పూర్తి అవుతాయి. అంతేకాదు తన జీవితంలో తెలిసిన లేదా తెలియని శత్రువుల బారిన కూడా పడడు. వానర పుత్రుడు, వానరులకు అధిపతి, శ్రీరామ దూతను నేను శరణు వేడుతున్నాను అని వేడుకోవాలి.

ఇవి కూడా చదవండి

శత్రువులు, వ్యాధులను తొలగించే మంత్రం ఎవరి జీవితంలోనైనా  తెలిసిన-తెలియని శత్రువులతో ప్రమాదం ఉంటే లేదా ఏదైనా వ్యాధి కారణంగా మీరు చాలా కాలంగా ఇబ్బంది పడుతుంటే.. వీటన్నింటి నుండి బయటపడాలంటే.. హనుమాన్ జయంతి నాడు ఈ క్రింది మంత్రాన్ని పూర్తి భక్తితో జపించండి. తప్పక విశ్వాసంతో మంత్రాన్ని పఠించండి.

మంత్రాన్ని ఎలా జపించాలంటే  హనుమంతుడి జయంతి పూజ సమయంలో మహామంత్రాన్ని జపించడానికి, సాధకుడు.. ముందు ఎరుపు రంగు ఉన్ని ఆసనంపై  కూర్చోవాలి. దీని తరువాత.. ఆంజనేయుడి చిత్రం లేదా విగ్రహం ముందు స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించి నియమ, నిబంధనల ప్రకారం పూజించాలి. అనంతరం కోరికను స్వామివారికి తెలియజేసి.. రుద్రాక్ష లేదా పగడపు పూసలతో బజరంగి మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాలను జపిస్తున్నప్పుడు ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి. మంత్రాన్ని పఠించడం ద్వారా భజరంగి బలి అనుగ్రహాన్ని పొందాలంటే.. సాధకుడు పొరపాటున కూడా మనస్సులో చెడు ఆలోచనలు చేయరాదు. కోపం తెచ్చుకోవద్దు.

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)