Hanuman Chalisa: హనుమాన్ చాలీసా పారాయణానికి శ్రీకారం చుట్టిన టీటీడీ.. 4 రాష్ట్రాల్లో ప్రచార రథాల పర్యటన..

సమాజ శ్రేయస్సు కోసం చేపట్టిన ఈ హనుమాన్ చాలీసా ప్రచార రథాలు జనవరి 2024 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో పర్యటించనుందని అధికారి తెలిపారు. అనంతరం జనవరి 21వ తేదీ 2024న తిరుమలలో కోటి హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి టీటీడీ రూ. 1.5 కోట్లు కేటాయించిందని, అన్ని రథాల్లో ఐదు లక్షల హనుమాన్ చాలీసా పుస్తకాలు, హ్యాండ్‌ బిల్లులుంటాయి.

Hanuman Chalisa: హనుమాన్ చాలీసా పారాయణానికి శ్రీకారం చుట్టిన టీటీడీ.. 4 రాష్ట్రాల్లో ప్రచార రథాల పర్యటన..
Hanuman Chalisa
Follow us
Surya Kala

|

Updated on: Aug 22, 2023 | 2:01 PM

తిరుమల తిరుపతి దేవస్థానం మరో బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రామ భక్త హనుమాన్ ను కీర్తిస్తూ  హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని చేపట్టనుంది. హనుమాన్ చాలీసా పారాయణ ప్రచారం కోసం రథాలు ఊరూరా పర్యటించనున్నాయి. ఈ మేరకు SV విశ్వవిద్యాలయంలో శ్రీకారం చుట్టారు. టీటీడీ.. శ్రీ హనుమాన్ దీక్షా పీఠం ఆధ్వర్యంలో దక్షిణాదిలో పర్యటించనున్నట్లు టీటీడీ అధికారి చెప్పారు.  సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ చేపట్టిన ఈ పారాయణ కార్యక్రమంను నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో జరగనున్నట్లు వెల్లడించనున్నారు.

సమాజ శ్రేయస్సు కోసం చేపట్టిన ఈ హనుమాన్ చాలీసా ప్రచార రథాలు జనవరి 2024 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో పర్యటించనుందని అధికారి తెలిపారు. అనంతరం జనవరి 21వ తేదీ 2024న తిరుమలలో కోటి హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది.

ఈ కార్యక్రమానికి టీటీడీ రూ. 1.5 కోట్లు కేటాయించిందని, అన్ని రథాల్లో ఐదు లక్షల హనుమాన్ చాలీసా పుస్తకాలు, హ్యాండ్‌ బిల్లులుంటాయి. నాలుగు రాష్ట్రాల్లో జరిగే రథయాత్ర సందర్భంగా భక్తులకు హనుమాన్ చాలీసా పంపిణీ చేస్తామని టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సదా భార్గవి తెలిపారు. అంతేకాదు హనుమంతుని మహిమను, శ్రీ ఆంజనేయ స్వామి జన్మస్థలం, ఇతర కార్యక్రమాలను ప్రాచుర్యం పొందడంలో TTD సహకారం అందిస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

హనుమంతుడి దర్శనం తర్వాత ఆయన్ని కీర్తిస్తూ తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా ను పారాయణం చేస్తారు. కేసరినందుడ్ని పూజిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుందని.. కష్టాలు, అనారోగ్యం వంటి బాధల నుంచి ఆంజనేయ స్వామి విముక్తినిస్తాడని విశ్వాసం.

ప్రతి రోజు స్నానం చేసి సింధూరం ధరించి హనుమాన్ చాలీసాను రోజులో 11 సార్లు చొప్పున నలభై రోజులు పారాయణ చేసిన భక్తులపై అనుగ్రహం కురిపిస్తాడని.. కోరిన కోర్కెలు తీరుస్తాడని గ్రహ దోషాలు తొలగుతాయని నమ్మకం. వివాహం కానీ యువతీ యువకులు హనుమాన్ చాలీసాను  పారాయణం చేయడం వలన పెళ్లి కుదురుతుంది.  అంజనేయ అనుగ్రహముతో ఉద్యోగం, ఆరోగ్యం, గ్రహ దోష, భయాందోళన నుంచి విముక్తి కలుగుతాయి.

ఏ కోరికకు ఏ విధంగా హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలంటే

జాతకంలో గ్రహ దోష నివారణకు 21 రోజుల పాటు రోజూ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రదక్షిణలు, సింధూర ధారణ చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.

వివాహం, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు మండలం అంటే 40 రోజుల పాటు హనుమాన్ చాలీసాను  పారాయణం చేసి ఆలయంలో 21 ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉండాలి.

కుటుంబంలో సుఖ సంతోషాల కోసం సుందరకాండ పారాయణం చేయడం వలన శుభఫలితాలను ఇస్తుంది.

శనీశ్వరుడి వలన బాధలు పడుతున్నా.. ఆరోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా హనుమాన్ చాలీసాను రోజుకు 11 సార్లు క్రమం తప్పకుండా పారాయణం చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..