President Ramnath Kovind : దేశరాజధాని ఢిల్లీలో ఘనంగా గురుపూర్ణిమ, ధర్మచక్ర దినోత్సం వేడుకలు : కిషన్ రెడ్డి
దేశరాజధాని ఢిల్లీలో గురుపూర్ణిమ, ధర్మచక్ర దినోత్సం వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య వేదిక నిర్వహించిన..
Kishan Reddy : దేశరాజధాని ఢిల్లీలో గురుపూర్ణిమ, ధర్మచక్ర దినోత్సం వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య వేదిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలు, గౌరవభావంతో గురువులకు కృతజ్ఞతా భావంతో పూజించే రోజునే గురుపూర్ణిమగా పిలుస్తామని కిషన్‌రెడ్డి అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా బౌద్దులకు కూడా ఇది పవిత్రమైన రోజు అని కిషన్ రెడ్డి అన్నారు. 2 వేల 500 ఏళ్ల క్రితం ఇదే రోజున గౌతమబుద్దుడు సారనాథ్‌లో తన ఐదుగురు సహచరులకు జ్ఙానబోధ చేశారని ఆయన గుర్తు చేశారు. ఇవాళ్టికి బుద్దుని అష్టాంగమార్గాలు మానవాళికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయన్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ.. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యతో కలిసి ఈ ఏడాది నవంబర్‌లో అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.
భారతదేశ భౌద్ధ వారసత్వాన్ని పెంపొందించడంలో ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బోధ్ గయా నుండి బోధి మొక్కను తీసుకొచ్చి నాటినందుకు ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Read also : Disha app : దిశ యాప్ : మహిళా రక్షణకు ఉక్కు కవచం, చెవిరెడ్డి పనితో సీఎం జగన్ ఫుల్ ఖుషి