Fasting in Hinduism: ఉపవాసం ఏ విధంగా చేయాలి.. దానివలన కలిగే ఆరోగ్య ప్రయోజలు ఏమిటో తెలుసా

Fasting Rules: హిందూధర్మంలో ఉపవాస దీక్షకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మన అమ్మమ్మలకాలంలో ఉపవాస దీక్ష అంటే.. ఆరోజు కడుపుని ఖాళీగా ఉంచడం.. ఏమైనా పాలు, కొబ్బరినీరు వంటి..

Fasting in Hinduism: ఉపవాసం ఏ విధంగా చేయాలి.. దానివలన కలిగే ఆరోగ్య ప్రయోజలు ఏమిటో తెలుసా
Fasting Rules
Follow us
Surya Kala

|

Updated on: Jul 24, 2021 | 3:14 PM

Fasting Rules: హిందూధర్మంలో ఉపవాస దీక్షకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మన అమ్మమ్మలకాలంలో ఉపవాస దీక్ష అంటే.. ఆరోజు కడుపుని ఖాళీగా ఉంచడం.. ఏమైనా పాలు, కొబ్బరినీరు వంటి రసాహారం తీసుకోవడం.. అయితే ఇప్పటి కాలంలో ఉపవాసం అంటే.. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం అన్నం సాయంత్రం టిఫిన్ ఇది కొంతమంది భావిస్తే.. మరికొందరు అన్నం తప్ప ఏమిటిన్నా ఓకే అని అనుకుంటారు.. కానీ మన పెద్దలు పెట్టిన ఉపవాస నియమాల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఉపవాసం తో శరీరంలోని మాలిన్యాలను బహిష్కరింపబడి వ్యాధి నిర్మూలనం జరుగుతుంది. పొట్ట, కన్ను, వ్రణములు, జ్వరములు, జలుబు మొదలగు వ్యాదులను కనీసం 5 రోజులపాటు ఉపవాసం చేసి వ్యాధి తగ్గించుకోవచ్చు. ఏ వ్యాధిలోనైనా ఉపవాసం చేయుట వలన వ్యాధి తొందరగా తగ్గించుకోవచ్చు. లేనిచో ఒకపూట ఉపవాసం ఉండి తరువాత ఆ వ్యాధికి సంబంధించిన పథ్యకరమైన ఆహారం తీసుకోవచ్చు. అయితే ఈ ఉపవాసం చేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, చేయకూడని వారు, చేయాల్సిన వారి తదితర వివరాల్లోకి వెళ్తే..

ఉపవాసం చేయుట వలన వివిధ అవయవాల్లో ఆరోగ్య కరమైన మార్పులు కలుగును. జీర్ణక్రియకు మంచి విశ్రాంతి లభించి అజీర్ణం తొలగిపోయి ఆకలివృద్ధి అవుతుంది. మలాశయంలో మురికి బహిష్కరింపబడి అజీర్ణం తొలగించబడి క్రిములను, బాక్టీరీయా నాశనం అవుతుంది. మూత్రపిండాలలోని విషపదార్ధాలు, రాళ్లు విసర్జించబడతాయి. ఊపిరితిత్తులలోని నంజు, నీరు బహిష్కరించబడి ఆయాసం నివారించబడును. శ్వాసక్రియ చక్కగా జరుగుతుంది. గుండెచుట్టు,లోపల చేరిన కొవ్వు, నీరు తగ్గి హృదయ స్పందన మెరుగుపడుతుంది. ఈ ఉపవాసం చేయుట వలన కాలేయానికి విశ్రాంతి దొరుకుటుంది. దానిలోని మాలిన్యం తొలగించబడి జీర్ణక్రియ వృద్ది అవుతుంది. శరీరంలో రక్తప్రసారం చురుకుగా ఉంటుంది. ఉపవాసం చేయుట వలన రక్తదోషములు నివారించబడును. తిమ్మిర్లు, మంటలు , నొప్పులు కూడా తగ్గుతాయి. కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు, నీరు, మాంసము వంటి మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ జరుగును. చర్మం కాంతివంతం అవుతుంది. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కటిరంగునిస్తుంది.

ఉపవాసం చేయకూడనివారు:

బలహీనంగా ఉన్నవారు, గుండెజబ్బులు కలవారు, బాలురు, వృద్దులు, గర్భిణీస్త్రీలకు, బాలింతలకు, క్షయ వ్యాధి, రక్తహీనత కలిగిన రోగులు, మధుమేహంతో ఉన్నవారికి ఎక్కువ రోజులు ఉపవాసం చేయకూడదు.

ఉపవాసం చేయదగిన వారు:

స్థూలకాయులు, ఉబ్బసం, సంధివాతం, రక్తపుపోటు, చర్మవ్యాధులు మొదలగు దీర్ఘకాలిక రోగులకు ఉపవాసం చేయుట మంచిది.

అయితే ఉపవాసం ముగించిన వెంటనే ఘనాహారం తీసుకోకూడదు. ఉపవాసం తరువాత ఎక్కువ ఆహారం తీసుకొకూడదు. క్రమేపి ఆహారాన్ని పెంచుకుంటూ రావలెను. కారం, మసాలా పదార్దాలు, పిండివంటలు పచ్చళ్ళు తినకూడదు. అలా తీసుకున్నచో విరేచనాలు, వాంతులు, కడుపులో మంట, నొప్పి కలుగును..

Also Read: Tokyo Olympics 2020: టేబుల్‌ టెన్నిస్‌ ఉమెన్స్ సింగిల్‌లో మనికా బాత్రా శుభారంభం.. రేపు ఉక్రెయిన్ క్రీడాకారిణితో తలపడనున్న మనికా

గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..