Tokyo Olympics 2020: టేబుల్‌ టెన్నిస్‌ ఉమెన్స్ సింగిల్‌లో మనికా బాత్రా శుభారంభం.. రేపు ఉక్రెయిన్ క్రీడాకారిణితో తలపడనున్న మనికా

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ లో భారత క్రీడాకారిణి మనికా బాత్రా సింగిల్స్ తొలి రౌండ్ లో విజయం సాధించింది. మనికా బాత్రా బ్రిటన్ క్రీడాకారిణి..

Tokyo Olympics 2020: టేబుల్‌ టెన్నిస్‌ ఉమెన్స్ సింగిల్‌లో మనికా బాత్రా శుభారంభం..  రేపు ఉక్రెయిన్ క్రీడాకారిణితో తలపడనున్న మనికా
Manika Batra
Follow us
Surya Kala

|

Updated on: Jul 24, 2021 | 7:17 PM

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ లో భారత క్రీడాకారిణి మనికా బాత్రా సింగిల్స్ తొలి రౌండ్ లో విజయం సాధించింది. మనికా బాత్రా బ్రిటన్ క్రీడాకారిణి టిన్-టిన్ హో లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. చివరికి మనికా బాత్రా 11-7, 11-6, 12-10, 11-9 తేడాతో టిన్-టిన్ హో ను ఓడించి మహిళా సింగిల్స్ లో మరో అడుగు ముందుకు వేసి రెండో రౌండ్ కు చేరుకుంది. మణికా రేపు 11:15 AM IST సమయంలో రౌండ్ 2 లో ఉక్రెయిన్ మార్గరైటా యొక్క పెసోట్స్ తో తలపడనుంది.

తొలిరోజు భారత్‌కు పలు క్రీడా విభాగాల్లో మిశ్రమ ఫలితాలు లభిస్తున్నాయి. టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌లో దేశీయ ఆటగాళ్లు సుమిత్ నాగల్‌, మనికా బాత్రా తొలి రౌండ్‌ లో విజయం సాధించి రెండో రౌండ్ లో అడుగు పెట్టారు. ఇక ఆర్చరీ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత పోరు ముగిసింది.

మరోవైలు బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ప్రపంచ నంబరు 3 జోడీపై చిరాగ్‌ శెట్టి – సాత్విక్‌ ద్వయం విజయం సాధించింది. చైనీస్‌ తైపీ ఆటగాళ్లు యాంగ్‌ లీ – చిన్‌ లిన్‌ వాంగ్‌ జోడీపై 21-16, 16-21, 27-24తో గెలుపొందింది.

అయితే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కు మొదటి పథకాన్ని వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అందించింది మీరా బాయిచాను. శనివారం జరిగిన మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో ఏస్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సిల్వర్ పతకాన్ని సాధించారు. రెండో ప్రయత్నాలు అదరగొట్టిన మీరాభాయి.. మూడో ప్రయత్నంలో విఫలం కావడంతో రెండో స్థానంలో నిలిచారు.

ఇక ఇదే విభాగంలో స్వర్ణ పతకాన్ని చైనాకు చెందిన చెందిన హౌ జిహుయికి దక్కింది. మీరాభాయి మొత్తం స్కోరు 202 కిలోలు కాగా, స్వర్ణ పతకం 8 కిలోలలో చేజారింది. ఇక ఒలింపిక్ క్రీడల ప్రారంభ రోజున భారత్ పతకం సాధించడం ఇదే మొదటిసారి. అలాగే ఒలింపిక్ గేమ్స్‌లోని వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్ గెలిచిన మొదటి పధకం కూడా ఇదే.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే