Tokyo Olympics 2021: మీరాభాయి చానుపై కరణం మల్లీశ్వరి ప్రశంసల వర్షం.. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహిస్తే..
Tokyo Olympics 2021: టోక్యో ఒలంపిక్స్ లో 130 కోట్ల మందికి ప్రతినిధిలా భారత్ కు మొదటి పతాకాన్ని వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాభాయి చాను అందించారు. టోక్యో ఒలింపిక్స్‌లో..
Tokyo Olympics 2021: టోక్యో ఒలంపిక్స్ లో 130 కోట్ల మందికి ప్రతినిధిలా భారత్ కు మొదటి పతాకాన్ని వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాభాయి చాను అందించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల వేట మొదలు పెడుతూ.. భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత భారత్‌కు పతకం అందించింన మీరా పై కారణం మల్లీశ్వరి ప్రశంసల వర్షం కురిపించింది. మీరాను ఆదర్శంగా తీసుకుని మరింత మంది క్రీడాకారులు వెలుగులోకి వస్తాయని చెప్పారు. అంతేకాదు ఈ సారి టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కు 10 నుంచి 12 మ మెడల్స్ వస్తాయని కరణం మల్లీశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నిటి గేమ్స్ కంటే కొంచెం వెయిట్ లిఫ్టింగ్ లో కష్టపడాలని.. తమ జనరేషన్ కంటే ఇప్పటి క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మంచి ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు మల్లీశ్వరి..46 ఏళ్ల మల్లేశ్వరి ప్రస్తుతం ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా ఉన్నారు.
వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చాను మహిళల 49కిలోల విభాగంలో రజత పతకం గెలుచుకుంది. స్నాచ్‌లో 87 కిలోలు ఎత్తిన ఆమె క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి తొలి పతకం సాధించింది. ఈ పతకంతో భారత్ తరపున వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధించిన రెండో భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది మీరాబాయ్ చానుపై యావత్ భారత దేశం ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
Also Read: KTR Birtday Day: కేటీఆర్ పుట్టినరోజున సందర్భంగా మంత్రి ఎర్రబెట్టి చేసిన మంచి పని ఏమిటో తెలుసా..