AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Purnima 2022: గురుపౌర్ణమి ప్రాముఖ్యత.. ఈ రోజున చేయాల్సిన, చేయకూడని పనులు ఏమిటంటే

ఆషాఢ మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు, ఎందుకంటే మహాభారతాన్ని రచించిన వేద వ్యాస మహర్షి కూడా ఈ రోజునే జన్మించారని నమ్ముతారు. ఈ సందర్భంగా, ఈ రోజును గురు పూర్ణిమగా జరుపుకుంటారు.

Guru Purnima 2022: గురుపౌర్ణమి ప్రాముఖ్యత.. ఈ రోజున చేయాల్సిన, చేయకూడని పనులు ఏమిటంటే
Guru Purnami 2022
Surya Kala
|

Updated on: Jul 08, 2022 | 12:20 PM

Share

Guru Purnima 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఆషాడ మాసం నాల్గవ మాసం. సనాతన ధర్మంలో ప్రతి మాసానికి మతపరమైన,  ఆధ్యాత్మిక దృక్కోణంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి మాసంలో పండగలు, పూజలు, ఉపవాసాలు వస్తాయి. పౌర్ణమి ప్రతి నెల వస్తుంది. కానీ ఆషాడమాసంలో వచ్చే పౌర్ణమికి ఓ ప్రత్యేక ఉంది. ఈ పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు, ఎందుకంటే మహాభారతాన్ని రచించిన వేద వ్యాస మహర్షి కూడా ఈ రోజునే జన్మించారని నమ్ముతారు. ఈ సందర్భంగా, ఈ రోజును గురు పూర్ణిమగా జరుపుకుంటారు. పూర్తి ఆచార, నియమాలతో వ్యాస భగవానుడిని పూజిస్తారు.

ఈ ఏడాది గురు పూర్ణిమ జూలై 13వ తేదీ బుధవారం వచ్చింది. గ్రహాలు, రాశుల ప్రకారం ఈ రోజు చాలా ముఖ్యమైనదని నమ్ముతారు. ఈ రోజున మీ జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును ఏ నియమాలను పాటించడం ద్వారా తీసుకురావచ్చో ఈరోజు తెలుసుకుందాం.

ఈ రోజున ఎలా పూజించాలంటే..  గురు పూర్ణిమ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి పూజకు ఏర్పాటు చేసుకోండి. ఈ రోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి, తెల్లవారుజామున పూజలు చేయడంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూజాసామాగ్రి, పూలు, మాలలు, తాంబూలం, వంటి ఇతర పూజా వస్తువులను ఒక రోజు ముందుగానే ఏర్పాటు చేసుకోండి. అనంతరం మీ గురువుగారి దగ్గరకు వెళ్లి, ఆయన పాదాలు కడిగిన తర్వాత ఆయనకు పూజ చేసి.. మీ శక్తి కొలది  పండ్లు, పూలు, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, డబ్బు మొదలైన వాటిని సమర్పించండి.

ఇవి కూడా చదవండి

ఈ రోజున చేయాల్సిన పనులు:  1. పౌర్ణమి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా సంపదలకు దేవత అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. దీని కోసం, ఒక కుండలో మంచినీటిని తీసుకొని రావి చెట్టుకు ఆ నీటిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.

2. సాయంత్రం వేళల్లో భార్యాభర్తలు కలిసి చంద్రుని దర్శనం చేసుకుని పూజిస్తే వారి దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి.

3. పౌర్ణమి సాయంత్రం తులసి మొక్క ముందు స్వచ్ఛమైన దేశం నెయ్యి దీపం వెలిగించడం వలన అదృష్టం కలిగిస్తుంది.

పూర్ణమి రోజున చేయకూడని పనులు:  1. పౌర్ణమి నాడు దానం చేయడం చాలా శ్రేయస్కరం అని అంటారు. అయితే ఈరోజున ఇంటికి వచ్చిన బిచ్చగాళ్లను కూడా కూడా ఖాళీ చేతులతో తిరిగి పంపించకూడదని అంటారు. హిందూ మతంలో దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది గ్రంధాలలో కూడా ప్రస్తావించబడింది. ఈ రోజుల్లో పేదలకు లేదా అవసరం ఉన్న వారికి వస్తువులను దానం చేయడం ద్వారా మీరు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. అలాగే ఇంటికి వచ్చే వ్యక్తికి ఏదైనా దానం చేయండి.

2. పౌర్ణమి రోజున, వృద్ధులను లేదా స్త్రీని పొరపాటున కూడా అవమానించకూడదు. వాస్తవానికి, గురు పూర్ణిమ మీ పెద్దలను గౌరవించాలని మీకు బోధిస్తుంది, అయితే ఈ రోజున, పెద్దలను అవమానించే వైఖరి మీకు ఉంటే..  సాధారణ జీవితంలో ఈ చర్యలు హానికరాన్ని కలుగజేస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)