AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath Yatra: తీవ్ర విషాదం నింపుతున్న అమర్ యాత్ర.. భారీవర్షాలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలం

ప్రముఖ ఆధ్యాత్మిక అమర్ నాథ్ (Amarnath Yatra) యాత్ర తీవ్ర విషాదం నింపుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఆకస్మికంగా ముంచెత్తిన వరదలతో భారీగా ప్రాణనష్టం కలిగింది. అనేక....

Amarnath Yatra: తీవ్ర విషాదం నింపుతున్న అమర్ యాత్ర.. భారీవర్షాలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలం
Amarnath Yatra 2022
Ganesh Mudavath
|

Updated on: Jul 09, 2022 | 6:18 AM

Share

ప్రముఖ ఆధ్యాత్మిక అమర్ నాథ్ (Amarnath Yatra) యాత్ర తీవ్ర విషాదం నింపుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఆకస్మికంగా ముంచెత్తిన వరదలతో భారీగా ప్రాణనష్టం కలిగింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకు అందిన తాజా సమాచారం ప్రకారం అమర్ యాత్ర లో తలెత్తిన ఈ ప్రకృతి విపత్తుకు 15 మంది యాత్రికులు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి సంఖ్య అధికంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. వరదల ధాటికి అమర్‌నాథ్‌ గుడారాలు కొట్టుకుపోయాయి.గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌,ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వరదల కారణంగా అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కాగా..అమర్‌నాథ్‌ విషాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో మాట్లాడారు. ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.బాధితులకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రధాని మోదీ ధైర్యం (PM Modi)చెప్పారు.

బోలేనాథ్‌ సమీపంలో కూడా భారీ వర్షం కురుస్తోంది.వరదల కారణంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్నారు.వందలాది మంది మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని,అందరూ అప్రమత్తంగా ఉండాలని జమ్మూకశ్మీర్‌ ఐజీపీ తెలిపారు. అయితే.. అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 30న ప్రారంభమైంది. జమ్మూలో ఆకస్మిక వరదలు రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు భక్తులు. అమర్‌నాథ్‌ గుహ పరిసరాలలో భారీగా వరద నీరు చేరింది.వరదల్లో చిక్కుకుని ఐదుగురు మృతి చెందగా, పలువురు గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆకస్మిక వరదలతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.దీంతో అక్కడ ప్రభుత్వం అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భారీ వరదల కారణంగా భక్తులు బిక్కబిక్కుమంటూ గడుపుతున్నారు.