AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాయత్రీ మంత్రం శక్తి ఇదే.. రోజూ జపిస్తే కష్టాలు దూరమై ఐశ్వర్యం పెరుగుతుందట!

Gayatri Mantra Benefits: గాయత్రీ మంత్రం అత్యంత శక్తివంతమైన వేద మంత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ మంత్రాన్ని సరైన నియమాలతో జపిస్తే మానసిక ప్రశాంతత, సానుకూల శక్తి, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తాయని విశ్వసిస్తారు. గాయత్రీ మంత్రం అర్థం ఏమిటి? దీన్ని జపించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటి? తెలుసుకోండి.

గాయత్రీ మంత్రం శక్తి ఇదే.. రోజూ జపిస్తే కష్టాలు దూరమై ఐశ్వర్యం పెరుగుతుందట!
Gayatri Mantra Benefits
Rajashekher G
|

Updated on: Jun 06, 2026 | 3:46 PM

Share

హిందూ ధర్మంలో గాయత్రీ మంత్రం (Gayatri Mantra) అత్యంత పవిత్రమైనదిగా, శక్తివంతమైనదిగా భావించబడుతుంది. ఈ మంత్రం మనిషిని విశ్వ చైతన్యంతో అనుసంధానించే దివ్య సాధనగా పేర్కొంటారు. గాయత్రీ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం. అలాగే దీనిని నియమబద్ధంగా పఠించడం ద్వారా జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెబుతారు. అయితే ఈ మంత్ర జపానికి కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం అవసరం. వాటి గురించి తెలుసుకుందాం.

గాయత్రీ మంత్రం అర్థం

  • ఓం భూర్భువస్సువ: తత్ సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి, ధియోయోన: ప్రచోదయాత్

గాయత్రీ మంత్రం ద్వారా సృష్టికర్త అయిన పరమాత్మ దివ్య తేజస్సును ధ్యానిస్తాము. ఆ దివ్య కాంతి మన బుద్ధిని సన్మార్గంలో నడిపించి, సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించాలని ప్రార్థిస్తాము.

గాయత్రీ మంత్రం జపించే నియమాలు

శాస్త్రాల ప్రకారం గాయత్రీ మంత్రాన్ని సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం అనంతరం జపించడం అత్యంత శ్రేయస్కరంగా భావిస్తారు. ఒకవేళ సూర్యాస్తమయ సమయానికి ముందు జపించాలనుకుంటే, ప్రశాంత వాతావరణంలో మౌనంగా జపించడం మంచిదని చెబుతారు.

ఇవి కూడా చదవండి

ఈ మంత్రాన్ని జపించేటప్పుడు రుద్రాక్ష మాలను ఉపయోగించడం ఉత్తమమని భావిస్తారు. కనీసం 108 సార్లు మంత్రాన్ని జపించే ప్రయత్నం చేయాలి. జపానికి ముందు ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని, గాయత్రీ మాతను ధ్యానించి అనంతరం జపాన్ని ప్రారంభించాలి.

గాయత్రీ మంత్రం జపం వల్ల కలిగే ప్రయోజనాలు

గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం ద్వారా జీవితంలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, సానుకూల ఆలోచనలు పెరుగుతాయని విశ్వసిస్తారు. జపం చేసే సమయంలో మనస్సు నిర్మలంగా, సానుకూలంగా ఉండటం చాలా ముఖ్యమని అంటారు. ఎందుకంటే జపం చేసే వ్యక్తి భక్తి, ఏకాగ్రత, సంకల్పబలం ఆధారంగానే ఫలితాలు లభిస్తాయని నమ్మకం.

గాయత్రీ మంత్రం ప్రాచీన కాలం నుంచి ఆధ్యాత్మిక సాధనలో విశిష్ట స్థానం పొందింది. ఈ మంత్రాన్ని జపించాలనుకునేవారు గురువు వద్ద నుండి దీక్ష తీసుకుని, ఆయన సూచించిన విధానం, సమయానికి అనుగుణంగా ఆచరించడం ఉత్తమం. ముఖ్యంగా పిల్లలు ఈ మంత్రాన్ని జపించడం వల్ల విద్యలో ఏకాగ్రత పెరిగి, చదువుకు ఎదురయ్యే ఆటంకాలు తొలగుతాయని విశ్వసిస్తారు. సరైన పద్ధతిలో, నిత్యం గాయత్రీ మంత్రాన్ని జపించడం ద్వారా వ్యక్తి జీవితంలో విజయాలు సాధించేందుకు మార్గం సుగమమవుతుందని చెబుతారు.

Follow Us