AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Puran: భార్యాభర్తల బంధంలో జోక్యం చేసుకోవడం మహా పాపం.. గరుడ పురాణం ప్రకారం ఏ శిక్షను అనుభవించాలంటే..

గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణంలో ఇలలో మనిషి చేసే పాపాలకు నరకంలో విధించే శిక్షలను తెలియజేస్తుంది. ఎటువంటి పాపాలకు ఏ విధమైన శిక్షను అనుభవిస్తారో వర్ణిస్తుంది. గరుడ పురాణం ప్రకారం భార్యాభర్తల సంబంధంలో జ్యోక్యం చేసుకోవడం... వారి గోప్యతను ఉల్లంఘించినా అది పాపమే.. దీనికి కూడా అతను కఠినమైన శిక్షను ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టంగా చెప్పబడింది.

Garuda Puran: భార్యాభర్తల బంధంలో జోక్యం చేసుకోవడం మహా పాపం.. గరుడ పురాణం ప్రకారం ఏ శిక్షను అనుభవించాలంటే..
Garuda Purana
Surya Kala
|

Updated on: Jun 04, 2025 | 2:34 PM

Share

హిందూ మతంలో 18 గొప్ప పురాణాలు ప్రస్తావించబడ్డాయి. వాటిలో ఒకటి గరుడ పురాణం. వ్యాస మహర్షి రచించిన ఈ పురాణం శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన గరుడునకు ఉపదేశించినట్లు నమ్మకం. అందుకనే ఈ పురాణానికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. దీనిలో మనిషి చేసే కర్మల గురించి.. దానికి అనుగుణంగా మరణాంతరం జీవి ప్రయాణం స్వర్గం, నరకంలో ఎలా సాగుతుందనేది తెలియజేస్తుంది. అందుకనే ఈ పురాణం హిందూ మతంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది మరణం తరువాత పరిస్థితిని వివరించడమే కాకుండా జీవితంలో నీతి, నిజాయతీ, ప్రవర్తనకు సంబంధించిన విషయాలను కూడా వివరంగా వివరిస్తుంది. భార్యాభర్తల పవిత్ర సంబంధంలో జోక్యం చేసుకోవడం లేదా వారి గోప్యత, సాన్నిహిత్యం, గోప్యతను ఉల్లంఘించడం తీవ్రమైన పాపమని గరుడ పురాణం స్పష్టంగా పేర్కొంది. ఎవరైనా ఈ గోప్యతను ఉల్లంఘిస్తే, అతను కఠినమైన శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటం ఎందుకు పాపం అవుతుంది?

గరుడ పురాణం ప్రకారం ఒక జంట లేదా ప్రేమికుడు-ప్రేమికుడి వ్యక్తిగత సంబంధంలో జోక్యం చేసుకోవడం, వారి వ్యక్తిగత క్షణాల గురించి సమాచారాన్ని ఇతరులకు చెప్పడం.. లేదా వారి పరస్పర విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేయడం “అధర్మం”గా పరిగణించబడుతుంది. అలా చేసే వ్యక్తి మరణం తర్వాత నరకానికి చేరుకుంటాడని గరుడపురాణం తెలియజేస్తుంది. ఎందుకంటే గోప్యతను ఉల్లంఘించడం.. మహా పాపం.

ఇవి కూడా చదవండి

ఎటువంటి శిక్ష విదిస్తారంటే..

గరుడ పురాణం ప్రకారం అటువంటి వ్యక్తి మరణం తరువాత “తామిశ్ర” లేదా “అంధతామిస్ర” అనే నరకానికి పంపబడతాడు.

తామిశ్ర నరకంలో ఆత్మ చీకటి , బాధలతో నిండిన రాజ్యంలో ఉంచబడుతుంది,

మోసం, ద్రోహం, గోప్యత ఉల్లంఘన చేసినందుకు ఆత్మ ఇక్కడ పదే పదే వేధించబడుతుంది.

ఇతరుల వైవాహిక జీవితంలో జోక్యం చేసుకునే వ్యక్తి తదుపరి జన్మలో నీచమైన యోనిలో జన్మిస్తాడని గరుడ పురాణంలో చెప్పబడింది.

గరుడ పురాణంలో భార్యాభర్తల మధ్య సంబంధం అత్యంత పవిత్రమైనది, గోప్యమైనది , గౌరవప్రదమైనదిగా పరిగణించబడుతుంది. కనుక వారి గోప్యతను ఉల్లంఘించడం సామాజిక నేరమే కాకుండా ఆధ్యాత్మిక, కర్మ దృక్కోణం లో కూడా తీవ్రమైన పాపం కూడా.. దీని పర్యవసానాలు మరణం తరువాత తీవ్రమైన నరకయాతన రూపంలో అనుభవించాల్సి ఉంటుంది. కనుక ఎప్పుడూ ఇతరుల వైవాహిక సంబంధంలో జోక్యం చేసుకోవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు