Veera Brahmendra Swamy matam: బ్రహ్మంగారి మఠంలో కొలిక్కి వచ్చిన ‘‘పీఠా’’ముడి.. పెద్ద కుమారుడికే పీఠాధిపతి బాధ్యతలు..!

బ్రహ్మంగారి మఠాధిపత్యంపై పీఠముడి వీడటంలేదు.. సంప్రదాయం ప్రకారం వారసత్వంగా గత ఏడు తరాలుగా పెద్ద కుమారుడికే పీఠాధిపతి ఇచ్చారు.

Veera Brahmendra Swamy matam: బ్రహ్మంగారి మఠంలో కొలిక్కి వచ్చిన ‘‘పీఠా’’ముడి.. పెద్ద కుమారుడికే పీఠాధిపతి బాధ్యతలు..!
Veera Brahmendra Swamy Matam Shiva Swamy
Follow us

|

Updated on: Jun 03, 2021 | 7:08 PM

Veera Brahmendra Swamy matam: బ్రహ్మంగారి మఠాధిపత్యంపై పీఠముడి వీడటంలేదు.. సంప్రదాయం ప్రకారం వారసత్వంగా గత ఏడు తరాలుగా పెద్ద కుమారుడికే పీఠాధిపతి ఇచ్చారు. రెండోరోజు 8 మంది పీఠాధిపతులు…శ్రీ వీరబోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి సంతాన్ని ఒక్కొక్కరిని విడివిడిగా పిలిచి మాట్లాడారు. గత కొన్నేళ్లుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారమే అంతా నడచుకోవాలని మఠాధిపతుల వారసులకు సూచించారు.

శ్రీపోతులూరి వీరబ్రహ్మంగారి మఠం లో ముగిసిన పీఠాధిపతుల బృందం రెండు రోజులపాటు పర్యటించిన అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపారు. బ్రహ్మంగారి మఠం సాంప్రదాయం ప్రకారమే గత ఏడు తరాలుగా పెద్దకుమారుడికే పీఠాధిపతి ఇచ్చారని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి స్పష్టం చేశారు. దివంగత స్వామి వారి రెండో భార్యకు కూడా ఇదే విషయాన్ని చెప్పి నచ్చచెప్పే ప్రయత్నం చేశామని తెలిపారు. బ్రహ్మంగారి మఠం చరిత్రలో వీలునామా ప్రకారం తదుపరి పీఠాధిపతి ఎంపిక ఎక్కడా జరగలేదని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి చెప్పారు. స్వామి వారి ఆస్తుల విషయంలో వీలునామాలు చెల్లుతాయి కానీ…పీఠాధిపతి ఎంపిక విషయంలో అది చెల్లదని స్పష్టం చేశారు.

బ్రహ్మాం గారి మఠం ప్రతిష్ట దిగజార్చకుండా ఉండేలా పీఠాధిపతి ఎంపిక జరగాలన్నదే తమ ఉద్దేశ్యమని శివస్వామి చెప్పారు. కందిమల్లయ్యపల్లి గ్రామస్తుల అభిప్రాయం కూడా తీసుకున్నామన్నారు. వారసత్వమే పీఠాధిపతులుగా ఉండాలని వారంతా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ధార్మిక పరిషత్‌, దేవాదాయశాఖకు రెండు రోజుల్లో నివేదిక అందేస్తామన్నారు. అతి త్వరలోనే పీఠాధిపతి ఎంపికను పూర్తి చేసి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.

శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వ్యాఖ్యల ప్రకారం…బ్రహ్మంగారి పీఠం మొదటి భార్య పెద్ద కొడుకుకే మఠాధిపత్యం దక్కే అవకాశం ఉంది. చట్టమా?… సంప్రదాయమా?.. అనుకుంటే సాంప్రదాయమే ముఖ్యమని పీఠాధిపతులు తేల్చారు. వీలునామా చెల్లదని…వారసత్వమే పీఠాధిపతికి అర్హులని రెండో భార్య మహాలక్ష్మికి కూడా పీఠాధిపతులు నచ్చజెప్పారు. అయితే ఆమె దీనిపై నిర్ణయం తీసుకునేందుకు నాలుగురోజుల సమయం అడిగినట్లు తెలుస్తోంది. మరీ రెండో భార్య సంతానం వారసత్వాన్ని ఒప్పుకుంటుందా..? లేదా దీనిపై కోర్టుకెళ్తుందా..? అనేది వేచి చూడాలి…

Read Also…  Protem Chairman: శాసన మండలిలో విచిత్ర పరిస్థితి.. ఒకేసారి ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ రిటైర్.. ప్రొటెం ఛైర్మన్‌గా భూపాల్‌రెడ్డి

పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?