karnataka lockdown: కర్ణాటకలో తగ్గని కరోనా ఉధృతి.. మరోసారి లాక్‌డౌన్ పొడిగింపు..
Lockdown in Karnataka: కర్ణాటకలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ఆ రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 14వ తేదీ
Lockdown in Karnataka: కర్ణాటకలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ఆ రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 14వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప గురువారం ప్రకటించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని.. కోవిడ్ -19 సెకండ్ వేవ్ గ్రామీణ ప్రాంతాలకు సైతం వ్యాపించిందని దీంతో జూన్ 14 వరకు లాక్‌డౌన్ గడువును పొడిగిస్తున్నట్లు యడియూరప్ప తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆయన రెండు రోజుల నుంచి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పాజిటివ్ కేసులు తగ్గకపోవడం వల్ల లాక్‌డౌన్ ను పెంచాలని టాస్క్‌ఫోర్స్ బృందం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.
అనంతరం గురువారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసులు అదుపులోకి రాలేదని.. దీంతో లాక్‌డౌన్‌ను పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ నిబంధనలే కొనసాగుతాయని ఆయన స్పష్టంచేశారు. జూన్ 7 వరకూ ఉన్న లాక్‌డౌన్‌ను 14 వరకూ పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.
కాగా.. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మే 24 నుంచి రాష్ట్రంలో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. కొన్ని వ్యాపారాల నిర్వహణకు ప్రభుత్వం సడలింపులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలాఉంటే.. కర్ణాటకలో కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 30,000 దాటింది. బుధవారం రాష్ట్రంలో 463 మంది కరోనా కారణంగా మరణించగా.. 16,387 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 26,35,122 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,93,024 యాక్టివ్ కేసులున్నాయి.
Also Read: