AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadamba Tree: రాధాకృష్ణుల ప్రేమకు సాక్ష్యంగా.. దేవతలకు ఇష్టమైన వృక్షంగా నిలిచిన కదంబ విశిష్టత ఏమిటంటే..!

Kadamba Tree:హైందవ సంస్కృతిలో కదంబ వృక్షానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ క‌దంబ మొక్క‌ను రుద్రాక్షాంబ అని కూడా అంటారు. ఇక దక్షిణాదిలో జగజ్జనని..

Kadamba Tree: రాధాకృష్ణుల ప్రేమకు సాక్ష్యంగా.. దేవతలకు ఇష్టమైన వృక్షంగా నిలిచిన కదంబ విశిష్టత ఏమిటంటే..!
Kadamba
Surya Kala
|

Updated on: Jun 03, 2021 | 5:07 PM

Share

Kadamba Tree:హైందవ సంస్కృతిలో కదంబ వృక్షానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ క‌దంబ మొక్క‌ను రుద్రాక్షాంబ అని కూడా అంటారు. దక్షిణాదిలో జగజ్జనని అమ్మవారిని కదంబవాసి అని అంటూ పూజలు చేస్తారు. ఇక హనుమంతుడి పుట్టుకకు మూలం ఈ వృక్షం. అంతేకాదు కృష్ణుడు .. గోపికల చీరలను దాచింది ఈ చెట్టుపైనే.. ఇక ఈ చెట్టు నీడలో పరిమళాలను ఆస్వాదిస్తూ రాధాకృష్ణుల ప్రేమాయణం కొనసాగిందని, అందుకే అంతటి విశిష్టతను సొంతం చేసుకుంది ఈ కదంబ వృక్షం. . భగవద్గీత, మహాభారతంలో కూడా ఈ మొక్క గురించి ప్రస్తావన వుంది.

*కదంబ వృక్షం చాలా పెద్దది. దీని పుష్పాలు గుండ్రంగా బంతి వలె అందంగా ఉంటాయి. వీటిని లలితాదేవి పూజలో ప్రముఖంగా ఉపయోగిస్తారు. *పలు రకాల బొమ్మల తయారీకి కూడా ఈ చెట్టు చెక్క పనికివస్తుంది. ఈ చెట్టు 45 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తరు నీరే సరిపోతుంది. ఉష్ణ మండల ప్రాంతంలో బాగా పెరిగే లక్షణాలను కలిగి ఉంటుంది. * ఈ వృక్షం ఇది ఆకురాల్చ‌దు. ఎప్ప‌టికీ ఆకుపచ్చగా ఉంటుంది. నీడను బాగా ఇస్తుంది. అడవులలో ఎక్కువ‌గా పెరుగుతుంది. దీని పూలు నుంచి అత్తర్లు తయారు చేస్తుంటారు.

పురాణాల్లో కదంబ వృక్షం ప్రస్తావన :

ఈ కదంబవృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లు ఉన్నాయి. ఉత్తరభారతం లో దీన్ని కృష్ణవృక్షమనీ, దక్షిణభారతం లో పార్వతీవృక్షమనీ అంటారు.

* ఈ వృక్షానికి కృష్ణుడికీ మంచి అనుబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చట్లు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు. అందుకే కృష్ణవృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి * దక్షిణాదిలో అమ్మవారిని ‘కదంబవనవాసిని’ అంటారు. కదంబ వృక్షానికి ‘ఓం శక్తిరూపిణ్యై నమః’ అనే మంత్రంతో పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు * గ్రహదోషాలు తొలగించు కోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబవృక్షానికి పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలని, అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి * హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం.. అంతేకాదు, సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం. *దక్షిణాదిలో అమ్మవారిని ‘కదంబవనవాసిని’.. అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అంటారు. ఏది ఏమైనా అన్నాచెల్లెళ్ళు ‘నారాయణా నారాయణి’ లకూ, ఈ వృక్షానికీ చాలా సంబంధం ఉందని చెబుతారు.

Also Read:  ఎన్నో ఆశ్చర్యపరచే వింతలు, సైన్స్ కు అందని నిర్మాణం ఈ లేపాక్షి ఆలయం సొంతం

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..