Dussehra 2025: ఈ ఏడాది దసరా ఎప్పుడు? అక్టోబర్ 1నా ? 2నా? సరైన తేదీ, ప్రాముఖ్యత, శుభ సమయం తెలుసుకోండి..
హిందువులు ఘనంగా జరుపుకునే పండగలలో దసరా ఒకటి. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్నాయి. దసరా పండుగను ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే 2025 లో దసరా అక్టోబర్ 1వ తేదీనా లేదా 2వ తేదీనా.. సరైన తేదీ, ప్రాముఖ్యత, శుభ సమయాన్ని తెలుసుకోండి..

దసరా పండుగను హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ పండుగ చెడుపై మంచి, అసత్యంపై సత్యం.. అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని ప్రతీకగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం పదవ రోజున విజయ దశమిగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించి సీతాదేవిని తీసుకువచ్చాడని ఒక పురాణ కథనం. ఈ కారణంగా ఈ పండుగను రావణ దహనంగా కూడా జరుపుకుంటారు. అంతేకాదు మరోకథ ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరించింది. అందుకనే చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా దసరా వేడుకలను జరుపుకుంటారు. దసరాను విజయదశమి అని కూడా అంటారు. 2025లో దసరా తేదీ గురించి ప్రజల్లో గందరగోళం ఉంది. దసరా ఖచ్చితమైన తేదీ, దానిని ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకుందాం.
2025 దసరా సరైన తేదీ
- పంచాంగం ప్రకారం 2025 దసరా నెలలో ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష దశమి తిథిన జరుపుకుంటారు.
- దశమి తిథి ప్రారంభం: అక్టోబర్ 01, 2025, బుధవారం, 12:12 PM
- దశమి తిథి ముగింపు : అక్టోబర్ 02, 2025, గురువారం, 01:13 PM
2025 దసరా పండుగ గురువారం. 02 అక్టోబర్ 2025న జరుపుకుంటారు.
దసరా పూజకు శుభ ముహూర్తం
- పూజ ముహూర్తం ప్రారంభం: 01:57 PM
- పూజ ముహూర్తం ముగుస్తుంది: మధ్యాహ్నం 02:44
- వ్యవధి: 47 నిమిషాలు
- ఈ సమయంలో పూజలు చేయడం ,ఆయుధాలను పూజించడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.
దసరా ప్రాముఖ్యత
- అసత్యంపై సత్యం విజయం: ఈ రోజున శ్రీరాముడు రావణుడిని చంపి సీతాదేవిని రక్షించాడు.
- దుర్గామాత విజయం: నవరాత్రి తర్వాత ఈ రోజున.. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించింది.
- జీవితంలో విజయం కోసం విజయదశమి రోజున ఆయుధాలను, పనిముట్లను పూజించే సంప్రదాయం ఉంది.
- కొత్త పని ప్రారంభించడం: ఈ రోజున కొత్త పని ప్రారంభించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
రావణ దహనం
దసరా రోజున రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి దిష్టిబొమ్మలను వివిధ ప్రదేశాలలో సృష్టించి దహనం చేస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఇది చిహ్నంగా పరిగణించబడుతుంది. రావణ దహనాన్ని వీక్షించడానికి ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








